air travellers
-
ఎయిర్‌లైన్స్‌కు పండుగే!
న్యూఢిల్లీ: రానున్న పండుగల సందర్భంగా విమాన ప్రయాణాల బుకింగ్‌లకు ఇప్పటి నుంచే డిమాండ్ ఊపందుకుంది. దీంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు పలు మార్గాల్లో 10 శాతం నుంచి 25 శాతం మధ్య టికెట్ ధరలను పెంచేశాయి. దీపావళి సమయంలో ప్రయాణ టికెట్ల ధరలు 10–15 శాతం పెరగ్గా.. ఓనమ్ సమయంలో (సెపె్టంబర్ 6–15 మధ్య) కేరళలోని పలు పట్టణాలకు వెళ్లే విమాన సరీ్వసుల్లో టికెట్ ధరలు గతేడాదితో పోల్చి చూస్తే 20–25 శాతం మేర పెరిగినట్టు ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో డేటా తెలియజేస్తోంది. దీపావళి సమయంలో ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోందని, దీంతో విమానయాన టికెట్ల ధరలు గతేడాదితో పోలిస్తే అధికమైనట్టు ఇక్సిగో గ్రూప్ సహ సీఈవో రజనీష్ కుమార్ తెలిపారు. → అక్టోబర్ 30–నవంబర్ 5 మధ్య ఢిల్లీ–చెన్నై మార్గంలో ఒకవైపు ప్రయాణానికి ఎకానమీ తరగతి నాన్ స్టాప్ ఫ్లయిట్ టికెట్ ధర రూ.7,618గా ఉంది. క్రితం ఏడాది నవంబర్ 10–16తో పోల్చి చూస్తే 25 శాతం ఎక్కువ. → ఇదే కాలంలో ముంబై–హైదరాబాద్ మార్గంలో ఫ్లయిట్ టికెట్ ధరలు 21 శాతం పెరిగి రూ.5,162కు చేరాయి. → ఢిల్లీ–గోవా సరీ్వసుల్లో టికెట్ ధరలు 19 శాతం పెరిగి రూ.5,999కు, ఢిల్లీ–అహ్మదాబాద్ మార్గంలో ఇంతే మేర పెరిగి రూ.4,980గా ఉన్నాయి. → హైదరాబాద్–తిరువనంతపురం మార్గంలో టికెట్ ధరలు 30 శాతం ఎగసి రూ.4,102కు చేరాయి. → కానీ, పండుగల సీజన్లోనే కొన్ని మార్గాల్లో టికెట్ చార్జీలు 1–27 శాతం మధ్య తగ్గడం గమనార్హం. ఉదాహరణకు బెంగళూరు–హైదరాబాద్ మార్గాల్లో టికెట్ ధరలు 23 శాతం తగ్గి రూ.3,383గా ఉంటే, ముంబై–జమ్మూ ఫ్లయిట్లలో 21 శాతం తక్కువగా రూ.7,826కే లభిస్తున్నాయి. → ముంబై–అహ్మదాబాద్ విమాన సరీ్వసుల్లో 27 శాతం తక్కువకే రూ.2,508 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ముంబై–ఉదయ్‌పూర్ మధ్య టికెట్ ధర 25 శాతం తగ్గి రూ.4,890గా ఉంది.విమాన ప్రయాణికుల జోరు దేశీయంగా జూలైలో 1.29 కోట్ల మందికిపైగా విమాన ప్రయాణాలు సాగించారు. 2023 జూలైతో పోలిస్తే ఇది 7.3 శాతం అధికం. అయితే 2024 జూన్‌తో పోలిస్తే గత నెల ప్రయాణికుల సంఖ్య 2.27 శాతం తక్కువగా ఉంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. దేశీయ విమాన ప్రయాణికుల విషయంలో ఇండిగో తన హవాను కొనసాగిస్తూ మార్కెట్ వాటాను జూలైలో 62 శాతానికి పెంచుకుంది. ఎయిర్ ఇండియా వాటా 14.3 శాతానికి వచ్చి చేరింది. విస్తారా వాటా 10 శాతానికి, ఆకాశ ఎయిర్ వాటా 4.7 శాతానికి పెరిగాయి. -
దేశీ విమాన ప్రయాణికుల్లో వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మే నెలలో 1.39 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2023 మే నెలతో పోలిస్తే ఇది 5.1 శాతం అధికం. కోవిడ్ ముందస్తు కాలంతో పోలిస్తే 14 శాతం ఎక్కువ అని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక వెల్లడించింది. ఏప్రిల్‌లో 1.32 కోట్ల మంది రాకపోకలు సాగించారు. 2024–25లో ట్రెండ్ కొనసాగుతుందని ఇక్రా భావిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌లో సానుకూల ధోరణి కొనసాగుతుందని పేర్కొంది. నివేదిక ప్రకారం.. గత నెలలో వియానయాన సంస్థల సామర్థ్యం 2023 మే నెలతో పోలిస్తే 6 శాతం, 2024 ఏప్రిల్‌తో పోలిస్తే 2 శాతం పెరిగింది. భారత్ నుంచి 2023–24లో 24 శాతం అధికంగా 2.97 కోట్ల మంది విదేశీయానం చేశారు. పరిశ్రమ కోవిడ్‌కు ముందు స్థాయిల కంటే అధిక రాబడి అందుకుంది. -
ఆగస్ట్‌లో 1.24 కోట్ల మంది విమాన ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఈ ఏడాది ఆగస్ట్‌లో 1.24 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2022 ఆగస్ట్‌తో పోలిస్తే ఇది 22.81 శాతం అధికమని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. 63.3 శాతం వాటాతో ఇండిగో విమానాల్లో 78.67 లక్షల మంది రాకపోకలు సాగించారు. టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిర్ ఇండియా 9.8 శాతం వాటాతో 12.12 లక్షలు, ఏఐఎక్స్ కనెక్ట్ 7.1 శాతం వాటాతో 9.78 లక్షల మంది ప్రయాణించారు. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త భాగస్వామ్య కంపెనీ అయిన విస్తారా 9.8 శాతం వాటాతో 12.17 లక్షల మందికి సేవలు అందించింది. -
దేశీయంగా విమాన ప్రయాణాలు రెట్టింపు
ముంబై: దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో రెట్టింపు స్థాయిలో నమోదైంది. 64.08 లక్షల నుంచి 1.25 కోట్లకు చేరింది. పౌర విమానయాన డైరెక్టరేట్ డీజీసీఏ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ఫ్లయిట్పరమైన, బ్యాగేజ్పరమైన, సిబ్బంది ప్రవర్తనపరమైన సమస్యలపై మరిన్ని ఫిర్యాదులు వచ్చాయి. వరుసగా అయిదో నెల జనవరిలోనూ ఇండిగో దేశీ మార్కెట్ వాటా తగ్గింది. 54.6 శాతానికి చేరింది. గతేడాది ఆగస్టులో ఇది 59.72 శాతంగా ఉండేది. ఇండిగో గత నెల 68.47 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. మరిన్ని కీలకాంశాలు.. ► సమీక్షాకాలంలో ఎయిరిండియా 11.55 లక్షల మందిని, విస్తారా 11.05 లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చాయి. వాటి మార్కెట్ వాటా వరుసగా 9.2 శాతం, 8.8 శాతంగా ఉంది. ► బడ్జెట్ విమానయాన సంస్థలు గో ఫస్ట్‌లో 10.53 లక్షల మంది, ఎయిర్ఏషియా ఇండియాలో 9.30 లక్షల మంది, స్పైస్‌జెట్ ఫ్లయిట్స్‌లో 9.14 లక్షల మంది ప్రయాణించారు. ► టాటా గ్రూప్‌లో భాగమైన విస్తారా, ఎయిరిండియా, ఎయిర్ఏషియా ఇండియా కలిపి 32.30 లక్షల మంది ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేర్చాయి. 26 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాయి. ► మొత్తం ఏడు దేశీ ఎయిర్‌లైన్స్‌లోనూ సీక్వెన్షియల్‌గా చూస్తే జనవరిలో సీట్ల భర్తీ స్థాయి (పీఎల్ఎఫ్) తగ్గింది. ► సమయపాలనలో (ఓటీపీ) ఇండిగో అగ్రస్థానంలో కొనసాగింది. హైదరాబాద్ సహా నాలుగు కీలక మెట్రో ఎయిర్‌పోర్టుల్లో సగటున 84.6% ఫ్లయిట్లను నిర్దేశిత సమయంలో నడిపింది. -
1.25 కోట్ల మంది విమాన ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2023 జనవరిలో 1.25 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. గతేడాది జనవరితో పోలిస్తే ఈ సంఖ్య 96 శాతం అధికమని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘కోవిడ్ ముందస్తు 2020 జనవరితో పోలిస్తే దేశీయ ప్రయాణికుల సంఖ్య గత నెలలో 2 శాతం తగ్గింది. దేశీయ ప్రయాణికుల రద్దీలో రికవరీ మెరుగ్గా ఉన్నప్పటికీ.. భారతీయ విమానయాన సంస్థల ఆర్థిక పనితీరు సమీప కాలంలో ఒత్తిడిలో ఉండే అవకాశం ఉంది. 2022–23లో ప్రయాణికుల రద్దీలో అర్థవంతమైన మెరుగుదల ఆశించినప్పటికీ పరిశ్రమ ఆదాయాల్లో రికవరీ వేగం క్రమంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.23,500 కోట్ల నికర నష్టంతో పోలిస్తే 2022–23లో నికర నష్టం తక్కువగా ఉంటుందని అంచనా. ప్రధానంగా ప్రయాణికుల రద్దీ, ఛార్జీల పెంపుదల, తక్కువ వడ్డీ భారం ఇందుకు కారణం. 2022 జనవరితో పోలిస్తే గత నెలలో సామర్థ్య విస్తరణ 42 శాతం ఎక్కువ. కోవిడ్ ముందస్తుతో పోలిస్తే 6 శాతం తక్కువ’ అని ఇక్రా తెలిపింది. త్వరగా రికవరీ.. ‘కార్యకలాపాలలో సాధారణ స్థితి, మహమ్మారి ప్రభావం తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రయాణికుల రద్దీలో త్వరిత పునరుద్ధరణ ఉంటుందని అంచనా. పెరిగిన పోటీ వాతావరణం మధ్య యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి క్షీణతకుతోడు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు పెరగడం వల్ల దేశీయ విమానయాన సంస్థలకు ఆదాయాల రికవరీ క్రమంగా ఉంటుంది. ప్రస్తుత ఏటీఎఫ్ ధరలు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 32 శాతం అధికం. పెరిగిన ఏటీఎఫ్ ధరలు సమీప, మధ్య కాలానికి విమానయాన సంస్థల ఆదాయాలు, నగదు నిల్వలకు పెద్ద ముప్పుగా కొనసాగుతాయి. అలాగే లీజు అద్దెలు, నిర్వహణ వ్యయం, ఇతర ఖర్చులను ప్రతికూలంగా ప్రభావితం చేసే యూఎస్ డాలర్‌తో భారత రూపాయి విలువ క్షీణించడం విమానయాన సంస్థల వ్యయ నిర్మాణంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. అధికం అయిన వ్యయాలకు అనుగుణంగా ఛార్జీల పెంపుదల ఉండేలా ఎయిర్‌లైన్స్ చేసే ప్రయత్నాలు వారి లాభదాయకతలో కీలకం కానున్నాయి’ అని ఇక్రా వివరించింది. -
విమాన ప్రయాణికులు @ 12.73 కోట్లు
ముంబై: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య డిసెంబర్లో 12.73 కోట్లుగా నమోదైంది. అంతక్రితం డిసెంబర్‌తో పోలిస్తే దాదాపు 14 శాతం వృద్ధి చెందింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం విడుదల చేసిన నెలవారీ గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2021 డిసెంబర్లో 11.20 కోట్ల మందిని దేశీ ఎయిర్‌లైన్స్ గమ్యస్థానాలకు చేర్చాయి. తాజాగా గత నెలలో ఇండిగో ద్వారా 69.97 లక్షల మంది ప్రయాణించారు. ఎయిరిండియా 11.71 లక్షల ప్యాసింజర్లను, విస్తారా 11.70 లక్షలు, ఎయిర్ఏషియా 9.71 లక్షలు, స్పైస్‌జెట్ 9.64 లక్షలు, గో ఫస్ట్ 9.51 లక్షలు, ఆకాశ ఎయిర్ 2.92 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. మార్కెట్ వాటా పరంగా చూస్తే ఇండిగోకు 55.7 శాతం, ఎయిరిండియాకు 9.1 శాతం, విస్తారాకు 9.2 శాతం, ఎయిర్‌ఏషియాకు 7.6 శాతం, ఆకాశ ఎయిర్‌కు 2.3 శాతం ఉంది. నాలుగు కీలకమైన మెట్రో ఎయిర్‌పోర్టుల్లో సమయ పాలనలో ఇండిగో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. -
జనవరి 1 నుంచి ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి
ఢిల్లీ: కరోనా కొత్త వేరియెంట్ల విజృంభణ నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుంచి కరోనా విజృంభిస్తున్న దేశాల నుంచి భారత్‌కు వచ్చే వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. చైనాతో పాటు హాంకాంగ్, జపాన్, సౌత్ కొరియా, థాయ్‌లాండ్, సింగపూర్ నుంచి వచ్చే వారు ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని గురువారం కేంద్రం తెలిపింది. అలాగే ప్రయాణికులు ప్రయాణాలకు ముందు.. ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఆ రిపోర్ట్‌లను అప్లోడ్ చేయాల్సిందేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. లేకుంటే భారత్‌లోకి ఎంట్రీ ఉండబోదని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి ఈ ఆరు దేశాల్లో కేసులు వెల్లువలా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. రాబోయే 40 రోజుల్లో భారత్ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు. న్యూఇయర్‌తో పాటు పండుగల ప్రయాణాల నేపథ్యంలో వైరస్ వ్యాప్తి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో విదేశాల నుంచి, ప్రత్యేకించి ఆ ఆరు దేశాల నుంచి వచ్చే వాళ్లకు టెస్టులు తప్పనిసరి చేసింది కేంద్రం. మరోవైపు ప్రస్తుతం విజృంభణకు కారణమైన ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియెంట్ తీవ్రత తక్కువే కావడంతో భారత్‌లో మరో వేవ్ ఉండకపోవచ్చని, పేషెంట్లు ఆస్పత్రుల పాలుకావడం.. మరణాలు ఎక్కువగా సంభవించకపోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. కాకపోతే.. వైరస్ వ్యాప్తి త్వరగతిన ఉంటుందని భావిస్తోంది. మరోవైపు నిపుణులు చైనాలో మాదిరి తీవ్ర పరిస్థితులు భారత్‌లో నెలకొనకపోవచ్చని, అందుకు వ్యాక్సినేషన్ డ్రైవ్, ప్రజల్లో రోగ నిరోధక కారణాలని చెబుతున్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
విమానాల్లో ‘యాపిల్ మాక్‌బుక్ ప్రో’ తేవద్దు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణం చేసే ప్రయాణికులు యాపిల్ మాక్‌బుక్ ప్రో 15 అంగుళాల మోడల్ ల్యాప్‌టాప్‌ను తీసుకురావద్దని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రయాణికులను కోరింది. ఆ మోడల్లోని కొన్ని ల్యాప్‌టాప్‌ల బ్యాటరీలు అధికంగా వేడికి గురవుతున్నాయని, ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఇదే విషయమే జూన్ 20వ తేదీన యాపిల్ సంస్థ సైతం తమ వెబ్సైట్లో ఈ మోడల్ ల్యాప్‌టాప్‌లకు సంబంధించి ఓ హెచ్చరిక నోటీసును అందుబాటులో ఉంచింది. దీని ప్రకారం సెప్టెంబర్–2015 నుంచి ఫిబ్రవరి 2017 మధ్య కాలంలో విక్రయించిన ల్యాప్‌టాప్‌ల్లో బ్యాటరీ అధిక వేడికి గురవుతుందని పేర్కొంది. అలాగే ఈ ల్యాప్‌టాప్‌ల్లో బ్యాటరీలను ఉచితంగానే మార్పు చేయాలని నిర్ణయించామని యాపిల్ సంస్థ తెలిపింది. బ్యాటరీని మార్పు చేసుకునే వరకు ప్రయాణికులు ఆ మోడల్ ల్యాప్‌టాప్‌లను తీసుకోరావద్దని డీజేసీఏ చీఫ్ అరుణ్ కుమార్ ట్వీట్ చేశారు. -
జెట్ ఎయిర్వేస్ స్పెషల్ డిస్కౌంట్
ముంబై: లీన్ సీజన్ నేపథ్యంలో విమానసంస్థల్లో ధరల యుద్ధం ఊపందుకుంది. వరుసగా ప్రయాణికులకు ఆకట్టుకునేందుకు అడ్వాన్స్ బుకింగ్ లపై రేట్లను తగ్గిసూ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ విమాన ప్రయాణికులకు శుభవార్త అందించింది. గతంలో సెవెన్ డేస్ సేల్ ప్రకటించిన జెట్ తాజాగా 'ఫైవ్ డే సేల్' స్కీమ్‌ను ప్రకటించింది. రాబోయే వర్షాకాల సీజన్‌ను దృష్టిలోపెట్టుకుని స్పెషల్ తగ్గింపు ధరల్లో అందిస్తున్నట్టు తెలిపింది. తమ టికెట్ ధరల్లో 20 శాతం స్పెషల్ డిస్కౌంట్ ను ప్రకటించింది. బిజినెస్ , ఎకానమీ రెండు క్లాసుల్లో పరిమిత కాలానికి డొమెస్టిక్ మార్కెట్ కు ఇది వర్తిస్తుందని ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది. జూన్ 2 వ తేదీ 6 వరకు ఈ బుకింగ్స్ చేసుకున్నవారికి ఈ డిస్కౌంట్ వర్తించనుంది. ఇలా బుక్ చేసిన టికెట్లతో జూన్ 25 నుంచి సెప్టెంబర్30 లోపు వినియోగించుకోవాలని తెలిపింది. ఈ ఫైవ్ డే సేల్' ఈ నెల 2-9 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా దేశీయ విమాన టికెట్ ధరల్లో దాదాపు 20 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఎకానమీ,బిజినెస్ తరగతుల ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. జులై, జనవరి సీజన్లను లో సీజన్ గా విమానయాన సంస్థలు పరిగణిస్తాయి. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణీకులను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటించడం మామూలే. ఈ కోవలోనే ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఆసియా ఇప్పటికే ఈ ఆఫర్లను ప్రకటించింన సంగతి తెలిసిందే.