
ముంబై: దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో రెట్టింపు స్థాయిలో నమోదైంది. 64.08 లక్షల నుంచి 1.25 కోట్లకు చేరింది. పౌర విమానయాన డైరెక్టరేట్ డీజీసీఏ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ఫ్లయిట్‌పరమైన, బ్యాగేజ్‌పరమైన, సిబ్బంది ప్రవర్తనపరమైన సమస్యలపై మరిన్ని ఫిర్యాదులు వచ్చాయి. వరుసగా అయిదో నెల జనవరిలోనూ ఇండిగో దేశీ మార్కెట్ వాటా తగ్గింది. 54.6 శాతానికి చేరింది. గతేడాది ఆగస్టులో ఇది 59.72 శాతంగా ఉండేది. ఇండిగో గత నెల 68.47 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది.
మరిన్ని కీలకాంశాలు..
► సమీక్షాకాలంలో ఎయిరిండియా 11.55 లక్షల మందిని, విస్తారా 11.05 లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చాయి. వాటి మార్కెట్ వాటా వరుసగా 9.2 శాతం, 8.8 శాతంగా ఉంది.
► బడ్జెట్ విమానయాన సంస్థలు గో ఫస్ట్‌లో 10.53 లక్షల మంది, ఎయిర్‌ఏషియా ఇండియాలో 9.30 లక్షల మంది, స్పైస్‌జెట్ ఫ్లయిట్స్‌లో 9.14 లక్షల మంది ప్రయాణించారు.
► టాటా గ్రూప్‌లో భాగమైన విస్తారా, ఎయిరిండియా, ఎయిర్‌ఏషియా ఇండియా కలిపి 32.30 లక్షల మంది ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేర్చాయి. 26 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాయి.
► మొత్తం ఏడు దేశీ ఎయిర్‌లైన్స్‌లోనూ సీక్వెన్షియల్‌గా చూస్తే జనవరిలో సీట్ల భర్తీ స్థాయి (పీఎల్‌ఎఫ్) తగ్గింది.
► సమయపాలనలో (ఓటీపీ) ఇండిగో అగ్రస్థానంలో కొనసాగింది. హైదరాబాద్ సహా నాలుగు కీలక మెట్రో ఎయిర్‌పోర్టుల్లో సగటున 84.6% ఫ్లయిట్లను నిర్దేశిత సమయంలో నడిపింది.
Comments
Please login to add a commentAdd a comment