ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై హీరో రానా దగ్గుబాటి చేసిన ట్వీట్‌పై ఆ కంపెనీ స్పందించింది. జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. మీ లగేజీని వీలైనంత త్వరగా మీకు చేరేలా చూసేందుకు మా సిబ్బంది పనిచేస్తున్నారు అంటూ రిప్లయ్ ఇచ్చింది. కాగా ఇండిగో ఏయిర్ లైన్స్ సేవలపై రానా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన రానాకు అక్కడ చెక్ ఇన్ అయ్యాక ఫైట్ ఆలస్యమంటూ, మరో విమానంలో వెళ్లాల్సిందిగా సూచించారు. అయితే బెంగళూరు చేరుకున్నాక లగేజ్ రాకపోవడంతో రానా అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా వారి దగ్గర్నుంచి సరైన సమాధానం రాలేదు.
దీనిపై అసహం వ్యక్తం చేస్తూ.. ఇండియాలో ఇండిగో(IndiGo) అంత చెత్త విమాన ప్రయాణం చేయలేదు. విమానం టైమింగ్స్ గురించి ఎవరికీ తెలీదు. కనిపించకుండా పోయిన లగేజ్ గురించి తెలియదు. సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలీదు. ఇంత కన్నా చెత్తగా సర్వీస్ ఏదైనా ఉంటుందా అంటూ ఫైర్ అయ్యారు.
Sir, we understand the discomfort when the bag doesn't arrive with you. While we apologise for the inconvenience caused in the meantime, please be assured, our team is actively working to get your luggage delivered to you at the earliest. (1/2)
— IndiGo (@IndiGo6E) December 4, 2022
Comments
Please login to add a commentAdd a comment