
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఈ ఏడాది ఆగస్ట్‌లో 1.24 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2022 ఆగస్ట్‌తో పోలిస్తే ఇది 22.81 శాతం అధికమని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. 63.3 శాతం వాటాతో ఇండిగో విమానాల్లో 78.67 లక్షల మంది రాకపోకలు సాగించారు.
టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిర్ ఇండియా 9.8 శాతం వాటాతో 12.12 లక్షలు, ఏఐఎక్స్ కనెక్ట్ 7.1 శాతం వాటాతో 9.78 లక్షల మంది ప్రయాణించారు. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త భాగస్వామ్య కంపెనీ అయిన విస్తారా 9.8 శాతం వాటాతో 12.17 లక్షల మందికి సేవలు అందించింది.
Comments
Please login to add a commentAdd a comment