Domestic Travel
-
ఆగస్ట్‌లో 1.24 కోట్ల మంది విమాన ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఈ ఏడాది ఆగస్ట్‌లో 1.24 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2022 ఆగస్ట్‌తో పోలిస్తే ఇది 22.81 శాతం అధికమని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. 63.3 శాతం వాటాతో ఇండిగో విమానాల్లో 78.67 లక్షల మంది రాకపోకలు సాగించారు. టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిర్ ఇండియా 9.8 శాతం వాటాతో 12.12 లక్షలు, ఏఐఎక్స్ కనెక్ట్ 7.1 శాతం వాటాతో 9.78 లక్షల మంది ప్రయాణించారు. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త భాగస్వామ్య కంపెనీ అయిన విస్తారా 9.8 శాతం వాటాతో 12.17 లక్షల మందికి సేవలు అందించింది. -
వన్ ఇండియా.. వన్ టూరిజం
పర్యాటకానికి సంబంధించి దేశం మొత్తం మీద ఒకే విధానం అమలయ్యేలా వన్ ఇండియా వన్ టూరిజం పద్ధతిని పరిశీలించాలని ట్రావెల్ ఏజెంట్ల అసోసియేషన్ (టీఏఏఐ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఒకే పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చే అంశాన్ని బడ్జెట్లో చేర్చాలని కోరింది. తద్వారా మహమ్మారి ధాటికి సంక్షోభంలో చిక్కుకున్న దేశీ ట్రావెల్, టూరిజం, ఆతిథ్య రంగానికి తోడ్పాటు అందించాలని టీఏఏఐ విజ్ఞప్తి చేసింది. మరోవైపు, సంబంధిత వర్గాలందరికీ విమాన ప్రయాణం మరింత చౌకగా అందుబాటులో ఉండేలా విమాన ఇంధనాన్ని (ఏటీఎం) కూడా వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి చేర్చాలని కోరింది. అలాగే, అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం (ఈసీఎల్జీఎస్) పరిధిని మరింత విస్తృతం చేయాలని ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రం, రాష్ట్రాలు తోడ్పాటునివ్వాలి.. టూరిజం రంగం కోలుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటునివ్వాలని టీఏఏఐ పేర్కొంది. విచక్షణాయుత ఖర్చులు పెట్టేందుకు వీలుగా మధ్యతరగతి ప్రజల చేతిలో తగు స్థాయిలో డబ్బులు ఆడేందుకు సముచిత చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. స్టార్టప్‌లు, చిన్న .. మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్ఎంఈ) వర్కింగ్ క్యాపిటల్ భారాన్ని తగ్గించేందుకు, నగదు లభ్యత మెరుగుపడేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. అలాగే ఆదాయపు పన్ను రేటు, జీఎస్టీ రేటును తగ్గించాలని, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. 2022–2023లో అన్ని టూరిస్ట్ వీసాలపై ఈ–వీసా ఫీజు మినహాయింపునివ్వాలని పేర్కొంది. ఎంఎస్ఎంఈలను పటిష్టం చేయడం, పరిశ్రమలో టెక్నాలజీ వినియోగానికి ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమును ఏర్పాటు చేయడం, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ కోసం క్రెడిట్ ఆధారిత క్యాపిటల్ సబ్సిడీ స్కీము (సీఎల్సీఎస్ఎస్)ను పునరుద్ధరించడం తదితర చర్యలు తీసుకోవాలని టీఏఏఐ కోరింది. అలాగే, ట్రావెల్ ఏజెంట్లు, ఆపరేటర్ల మనుగడ కోసం వారికి రావల్సిన చెల్లింపులకు భద్రత కల్పించే విధంగా తగు వ్యవస్థను నెలకొల్పాలని విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ ఎంఐసీఈ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్) కార్యక్రమాలను భారత్‌కు రప్పించే దిశగా, దేశీ ఎంఐసీఈ కంపెనీలు అంతర్జాతీయ బిడ్డింగ్‌లలో పాల్గొనేందుకు ఉపయోగపడే గ్లోబల్ బిడ్డింగ్ ఫండ్ ఏర్పాటు అంశాన్ని బడ్జెట్లో పరిశీలించాలని టీఏఏఐ కోరింది. -
ప్రయాణానికి సిద్ధమా? అయితే ఇవి తప్పనిసరి
ఢిల్లీ: లాక్డౌన్ 4.0లో కేంద్రం భారీ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మే 25 నుంచే దేశీయ విమాన ప్రయాణాలకు అనుమతించింది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా.. ఢిల్లీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసింది. అంతర రాష్ట్ర బస్సు, రైలు, విమానం లాంటి ప్రయాణాలు చేయాలనుకునే వారు తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందే అంటూ ఢిల్లీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కొన్ని గైడ్ లైన్స్‌ను విడుదల చేసింది. ఈ రూల్స్ పాటించాకే అనుమతి ప్రయాణానికి ముందే అందరినీ పరీక్షిస్తారు. కరోనా అనుమానిత లక్షణాలు లేని ప్రయాణికులు కచ్చితంగా 14 రోజుల పాటు తమ ఆరోగ్యాన్ని స్వీయ పర్యవేక్షణతో జాగ్రత్తగా చూసుకుంటామని హామీ ఇవ్వాలి. ఒకవేళ జలుబు, దగ్గు లాంటి కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వారి సమాచారాన్ని సంబంధిత అధికారులకు పంపిస్తారు. మైల్డ్ సింటమ్స్ ఉన్నవారు ఇంట్లోనే స్వీయ నిర్భందం లేదా క్వారంటైన్ సెంటర్‌కు వెళ్తారా అన్నది వారి ఇష్టం. కరోనా లక్షణాలు ఉండి, ఎక్కువగా అనారోగ్యంగా ఉంటే మాత్రం వారిని హాస్పిటల్‌కి తరలిస్తారు. (మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు) ప్రయాణికులందరూ తమ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీంతో మీకు ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే హెల్ప్‌లైన్ నెంబర్‌కు మీ సమాచారం వెళ్తుంది. అంతేకాకుండా మీ చుట్టుపక్కల ఎవరైనా కరోనాతో బాధపడినా ఆ సమాచారం మీకు చేరి, మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. వలస కార్మికుల కోసం కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక దేశీయ విమాన సర్వీసులకు మే 25 నుంచే అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారు తమ స్వస్థలాలకు ప్రయాణాలు చేస్తున్నారు. అంతేకాకుండా జూన్ 1 నుంచి 200 ప్యాసింజర్ రైళ్లను నడుపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. (లాక్డౌన్ ఎఫెక్ట్: స్వచ్ఛంగా మారుతున్న యమునా నది) -
ఎంపీల రవాణా ఖర్చులు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: 2013-14 ఆర్థిక సంవత్సరంలో పార్లమెంట్ సభ్యులు చేసిన ఖర్చు ఎంతో తెలుసా... అక్షరాలా 147.38 కోట్లు. అయితే 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ ఖర్చు 135.8 కోట్లుగా ఉంది. సమాచార హక్కు చట్టం కింద వేద్ పటేల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశీయ రవాణా ఖర్చుల కింద ఎంపీల విమాన ప్రయాణాలే కాకుండా రైలు, రోడ్డు ప్రయాణ ఖర్చులు, రోజువారి భత్యాలు కూడా వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం పార్లమెంట్ సంభ్యుల జీత భత్యాలను భారీగా పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉంది. బేసిక్ శాలరీని నెలకు 50 వేల నుండి లక్ష రూపాయలకు, నియోజక వర్గ భత్యం 45 వేల నుండి 90 వేలకు, సెక్రటేరియల్, ఆఫీస్ అలవెన్స్‌ను కూడా 45 వేల నుండి 90 వేలకు పెంచే ప్రతిపాదన ఉంది. -
జోరు తగ్గని పర్యాటకం
న్యూఢిల్లీ: భారత పర్యాటకులపై రూపాయి పతనం ప్రభా వం స్వల్పమేనని ప్రముఖ యాత్రా పోర్టళ్లు అంటున్నా యి. రూపాయి పతనంతో భారత టూరిస్టులు బెంబేలెత్తిపోవడం లేదని, తమ టూర్లను రద్దు చేసుకోవడం లేదని యాత్రాడాట్‌కామ్ సర్వేలో వెల్లడైంది. ఈ సంస్థ మొత్తం 6,000 మందిపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 62 శాతం మంది తమ షెడ్యూల్ ప్రకారమే టూర్లను కొనసాగిస్తున్నారని సర్వే పేర్కొంది. దక్షిణాసియా దేశాల పర్యటనకే భారత టూరిస్టుల ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆ తర్వాతి స్థానాల్లో యూరప్, అమెరికా, బ్రిటన్లు ఉన్నాయని తెలిపింది. ప్రణాళిక ప్రకారమే... పర్యాటకులు కనీసం రెండు నెలలు ముందుగానే తన ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటారని, అందువల్ల రూపాయి పతనం ప్రభావం పెద్దగా ఉండదని మేక్‌మైట్రిప్‌డాట్‌కామ్ పేర్కొంది. అయితే విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గిందని ఎక్స్‌పీడియాడాట్‌కోడాట్‌ఇన్ పేర్కొంది. అయితే రూపాయి పతనం వల్ల భారత్‌ను సందర్శించే విదేశీయుల సంఖ్య పెరుగుతుందని వివరించింది.