ఢిల్లీ: లాక్‌డౌన్ 4.0లో కేంద్రం భారీ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మే 25 నుంచే దేశీయ విమాన ప్రయాణాలకు అనుమతించింది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా.. ఢిల్లీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసింది. అంతర రాష్ట్ర బస్సు, రైలు, విమానం లాంటి ప్రయాణాలు చేయాలనుకునే వారు తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందే అంటూ ఢిల్లీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కొన్ని గైడ్ లైన్స్‌ను విడుదల చేసింది.
ఈ రూల్స్ పాటించాకే అనుమతి
ప్రయాణానికి ముందే అందరినీ పరీక్షిస్తారు. కరోనా అనుమానిత లక్షణాలు లేని ప్రయాణికులు కచ్చితంగా 14 రోజుల పాటు తమ ఆరోగ్యాన్ని స్వీయ పర్యవేక్షణతో జాగ్రత్తగా చూసుకుంటామని హామీ ఇవ్వాలి. ఒకవేళ జలుబు, దగ్గు లాంటి కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వారి సమాచారాన్ని సంబంధిత అధికారులకు పంపిస్తారు. మైల్డ్ సింటమ్స్ ఉన్నవారు ఇంట్లోనే స్వీయ నిర్భందం లేదా క్వారంటైన్ సెంటర్‌కు వెళ్తారా అన్నది వారి ఇష్టం. కరోనా లక్షణాలు ఉండి, ఎక్కువగా అనారోగ్యంగా ఉంటే మాత్రం వారిని హాస్పిటల్‌కి తరలిస్తారు.
(మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు)
ప్రయాణికులందరూ తమ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీంతో మీకు ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే హెల్ప్‌లైన్ నెంబర్‌కు మీ సమాచారం వెళ్తుంది. అంతేకాకుండా మీ చుట్టుపక్కల ఎవరైనా కరోనాతో బాధపడినా ఆ సమాచారం మీకు చేరి, మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. వలస కార్మికుల కోసం కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక దేశీయ విమాన సర్వీసులకు మే 25 నుంచే అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారు తమ స్వస్థలాలకు ప్రయాణాలు చేస్తున్నారు. అంతేకాకుండా జూన్ 1 నుంచి 200 ప్యాసింజర్ రైళ్లను నడుపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. (లాక్‌డౌన్ ఎఫెక్ట్: స్వచ్ఛంగా మారుతున్న యమునా నది)
Comments
Please login to add a commentAdd a comment