Directorate General of Civil Aviation (DGCA)
-
ఇండిగో, ముంబై ఎయిర్‌పోర్ట్‌లకు జరిమానా
ముంబై: విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు రన్‌వే పక్కనే నేలపై కూర్చుని భోజనంచేసిన ఘటనలో ఇండిగో విమానయాన సంస్థ, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ఆగ్రహం వ్యక్తంచేసి జరిమానా విధించాయి. ప్రయాణికుల అసౌకర్యానికి కారణమైన ఇండిగో సంస్థపై రూ.1.5 కోట్ల జరిమానా, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై రూ.90 లక్షల జరిమానా విధించాయి. ఒక పౌరవిమానయాన సంస్థపై ఇంతటి భారీ జరిమానా పడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారికావడం గమనార్హం. జనవరి 15వ తేదీన గోవా నుంచి బయల్దేరిన విమానం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పొగమంచు కారణంగా ఢిల్లీకి బదులు ముంబైలో దిగింది. చాలాసేపు విమానంలోనే వేచి ఉన్న ప్రయాణికులు విసిగిపోయి కిందకు దిగొచ్చి రన్‌వే పక్కనే కూర్చుని భోజనాలు చేశారు. ఈ ఘటనను పౌరవిమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. బీసీఏఎస్ అడిగేదాకా ఈ విషయంలో ఇండిగో వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. రన్‌వేపై ప్రయాణికుల కదలికలను నియంత్రించకుండా ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించారని డీజీసీఏ ఆక్షేపించింది. -
ఆగస్ట్‌లో 1.24 కోట్ల మంది విమాన ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఈ ఏడాది ఆగస్ట్‌లో 1.24 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2022 ఆగస్ట్‌తో పోలిస్తే ఇది 22.81 శాతం అధికమని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. 63.3 శాతం వాటాతో ఇండిగో విమానాల్లో 78.67 లక్షల మంది రాకపోకలు సాగించారు. టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిర్ ఇండియా 9.8 శాతం వాటాతో 12.12 లక్షలు, ఏఐఎక్స్ కనెక్ట్ 7.1 శాతం వాటాతో 9.78 లక్షల మంది ప్రయాణించారు. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త భాగస్వామ్య కంపెనీ అయిన విస్తారా 9.8 శాతం వాటాతో 12.17 లక్షల మందికి సేవలు అందించింది. -
జూన్‌లో విమానయానం జూమ్..
దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య జూన్‌లో 1.25 కోట్లుగా నమోదైంది. గతేడాది జూన్‌లో నమోదైన 1.05 కోట్లతో పోలిస్తే 19 శాతం పెరిగింది. గో ఫస్ట్ కార్యకలాపాలు నిలి్చపోయిన నేపథ్యంలో ఇండిగో, ఎయిరిండియా, విస్తార, ఎయిర్‌ఏíÙయా ఇండియా, ఆకాశ ఎయిర్ తమ తమ మార్కెట్ వాటాలను పెంచుకున్నాయి. అయితే, స్పైస్‌జెట్ మార్కెట్ వాటా మాత్రం మరింత తగ్గింది. ఈ ఏడాది జనవరిలో ఇది 7.3 శాతంగా ఉండగా జూన్‌లో 4.4 శాతానికి పడిపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 79 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా ఇండిగో.. 63.2 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిరిండియా, ఎయిర్‌ఏíÙయా ఇండియా (ప్రస్తుతం ఏఐఎక్స్ కనెక్ట్‌గా పేరు మారింది) విమానాల్లో వరుసగా 12.37 లక్షలు, 10.4 లక్షల మంది ప్రయాణం చేశారు. ఎయిరిండియా మార్కెట్ వాటా 9.7 శాతంగాను, ఎయిర్‌ఏíÙయా ఇండియా వాటా 8 శాతంగాను ఉంది. 10.11 లక్షల మంది ప్రయాణికులతో విస్తార 8.1 శాతం, 6.18 లక్షల ప్యాసింజర్లతో ఆకాశ ఎయిర్ 4.9 శాతం వాటాను దక్కించుకున్నాయి. అటు స్పైస్‌జెట్ 5.55 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. మరోవైపు, సమయ పాలన విషయంలో 88.3 శాతం ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్తో (ఓటీపీ) విస్తార అగ్రస్థానంలో నిల్చింది. ఇండిగో, ఆకాశ ఎయిర్ (చెరి 87.6 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కీలకమైన హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో డేటా ఆధారంగా ఓటీపీని లెక్కించారు. -
విమాన ప్రయాణాల జోరు..
ముంబై: గత నెల దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 1.32 కోట్లుగా నమోదైంది. గతేడాది మే నెలలో నమోదైన 1.14 కోట్లతో పోలిస్తే 15 శాతం పెరిగింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్రకారం ఇండిగో మార్కెట్ వాటా ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో 57.5 శాతం నుంచి 61.4 శాతానికి పెరిగింది. మొత్తం 81 లక్షల మందిని ఇండిగో గమ్యస్థానాలకు చేర్చింది. టాటా గ్రూప్ కంపెనీలైన ఎయిరిండియా, ఎయిర్ఏషియా ఇండియా, విస్తారాల మార్కెట్ వాటా వరుసగా 9.4 శాతం, 7.9 శాతం, 9 శాతంగా నిల్చింది. ఎయిరిండియా 12.44 లక్షల మందిని, విస్తారా 11.95 లక్షల మందిని, ఎయిర్ఏషియా ఇండియా 10.41 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ఈ మూడింటికి కలిపి 26.3 శాతం మార్కెట్ వాటా లభించింది. గతేడాది ఆగస్టులో ప్రారంభమైన ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా ఏప్రిల్‌తో పోలిస్తే 4 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న గో ఫస్ట్ సంస్థ మే 3 నుంచి విమాన సర్వీసులు నిలిపివేసింది. సమయపాలన విషయంలో ఆకాశ ఎయిర్ అగ్ర స్థానంలో (92.6 శాతం) నిల్చింది. -
Go First bankruptcy: 30 రోజుల్లో పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వండి
న్యూఢిల్లీ: కార్యకలాపాల పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికను 30 రోజుల్లోగా సమర్పించాలంటూ విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సూచించింది. అందుబాటులో ఉన్న విమానాలు .. పైలట్లు ..ఇతర సిబ్బంది, నిర్వహణ ఏర్పాట్లు, నిధులు .. వర్కింగ్ క్యాపిటల్, లీజుదార్లతో ఒప్పందాలు తదితర వివరాలు అందులో పొందుపర్చాలని డీజీసీఏ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రణాళికను సమీక్షించిన తర్వాత డీజీసీఏ తగు నిర్ణయం తీసుకోవచ్చని వివరించాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ మే 2న స్వచ్ఛందంగా దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా మే 3, 4 తారీఖుల్లో రద్దు చేసిన విమాన సేవలను ఆ తర్వాత మరిన్ని రోజులకు పొడిగించింది. ఈలోగా సర్వీసుల నిలిపివేతపై డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో మారటోరియం వ్యవధిని ఉపయోగించుకుని పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించేందుకు సమయం ఇవ్వాలంటూ గో ఫస్ట్ తన సమాధానంలో కోరింది. మరోవైపు లీజుదార్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. గో ఫస్ట్ దివాలా పరిష్కార పిటిషన్‌ను అనుమతించాలని ఎన్సీఎల్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ మే 22న జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఉత్తర్వులు జారీ చేసింది. -
గర్ల్ ఫ్రెండ్‌ను కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లిన ఎయిరిండియా పైలట్..
న్యూఢిల్లీ: విమానాల్లో కొందరు ప్రయాణికుల పిచ్చి చేష్టలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. తోటి ప్రయాణికులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వార్తలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రయాణికులే అనుకుంటే తాజాగా ఎయిరిండియా విమానంలో ఓ పెలైట్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దుబాయి-ఢిల్లీ విమానంలో ప్రయాణిస్తున్న తన స్నేహితురాలిని పైలట్ కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లడమే గాక.. ప్రయాణ సమయమంతా ఆమెను పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఫిబ్రవరి 27 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. దుబాయి నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో పైలట్ స్నేహితురాలు కూడా ప్రయాణిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పైలట్.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించాడు. చదవండి: వ్యక్తి ప్రాణాలు తీసిన వందేభారత్-ఆవు ప్రమాదం.. చూస్తుండగానే.. అంతేగాక విమానం ఢిల్లీకి చేరుకునేంతవరకు అంటే.. దాదాపు మూడు గంటల పాటు ఆ మహిళను కాక్‌పిట్‌లోనే ఫస్ట్ అబ్జర్వర్ సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. అయితే ఈ విషయంపై క్యాబిన్ సభ్యుల్లో ఒకరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయటపడింది. దీంతో మహిళా స్నేహితురాలిని పైల్ కాక్‌పిట్‌లోకి అనుమతించిన ఘటనపై పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) శుక్రవారం దర్యాప్తును చేపట్టింది. పైలట్ చర్యలు భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించడమే కాకుండా, విమాన ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెట్టేసిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, దాని బట్టి పైలట్‌పై సస్పెన్షన్ లేదాలైసెన్స్‌ను రద్దు చేయడంతో సహా క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల వేళ.. డీకే శివకుమార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ -
విమాన ప్రయాణికులు @ 12.73 కోట్లు
ముంబై: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య డిసెంబర్లో 12.73 కోట్లుగా నమోదైంది. అంతక్రితం డిసెంబర్‌తో పోలిస్తే దాదాపు 14 శాతం వృద్ధి చెందింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం విడుదల చేసిన నెలవారీ గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2021 డిసెంబర్లో 11.20 కోట్ల మందిని దేశీ ఎయిర్‌లైన్స్ గమ్యస్థానాలకు చేర్చాయి. తాజాగా గత నెలలో ఇండిగో ద్వారా 69.97 లక్షల మంది ప్రయాణించారు. ఎయిరిండియా 11.71 లక్షల ప్యాసింజర్లను, విస్తారా 11.70 లక్షలు, ఎయిర్ఏషియా 9.71 లక్షలు, స్పైస్‌జెట్ 9.64 లక్షలు, గో ఫస్ట్ 9.51 లక్షలు, ఆకాశ ఎయిర్ 2.92 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. మార్కెట్ వాటా పరంగా చూస్తే ఇండిగోకు 55.7 శాతం, ఎయిరిండియాకు 9.1 శాతం, విస్తారాకు 9.2 శాతం, ఎయిర్‌ఏషియాకు 7.6 శాతం, ఆకాశ ఎయిర్‌కు 2.3 శాతం ఉంది. నాలుగు కీలకమైన మెట్రో ఎయిర్‌పోర్టుల్లో సమయ పాలనలో ఇండిగో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. -
ప్రయాణికుడు చేసిన తప్పిదం..విమానం టేకాఫ్‌కు ముందే..
గత కొద్దిరోజులుగా విమానంలో ప్రయాణికుల వరుస అనుచిత ప్రవర్తనల ఘటనలు గురించి వింటునే ఉన్నాం. అదే తరహాలో ఒక ప్రయాణికుడు ఒక పొరపాటు చేశాడు. ఏకంగా విమానం బయలుదేరే సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట డోర్‌ని ఓపెన్ చేశాడు. ఐతే ఆ తప్పిదాన్ని ఎయిర్‌లైన్స్ సకాలంలో గుర్తించింది కాబట్టి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్త లేదు. ఈ ఘటన గతేడాది డిసెంబర్ 10న ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజీసీఏ) అధికారికంగా వెల్లడించింది. అంతేగాదు ఈ ఘటనపై సత్వరమే విచారణకు ఆదేశించడంతో ఫ్లైట్ రెగ్యులేటర్ స్పష్టమైన నివేదిక ఇచ్చినట్లు కూడా పేర్కొంది.ఆ విమానం చెన్నై నుంచి త్రివేండ్రమ్ వెళ్లున్నప్పుడూ ఈ ఘటన జరిగినట్లు డీజీసీఏ పేర్కొంది. ప్రయాణికులను దించేసిన అనంతరం ఆ విమానం తిరుచిరాపల్లికి బయలుదేరినట్లు కూడ తెలిపింది. అయితే ఈ ఘటన గురించి సదరు ఎయిర్ లైన్స్ డీజీసీఏకి వివరణ ఇస్తూ.. "ఆ రోజు ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు పొరపాటున ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోరును తెరిచాడు.ఐతే తాము విమానం టేకాఫ్‌కు ముందే ఆ విషయాన్ని గమనించాం. తాము వెంటనే డోర్‌ని మళ్లీ ఇన్స్టాల్ చేసి, విమానంలో గాలి ఒత్తిడి ఎంత మేర ఉందో తనఖీ చేశాం. అంతేగాదు సేఫ్టీ ప్రోటోకాల్స్ విషయంలో రాజీపడకుండా తనిఖీలు నిర్వహించాం. అందువల్లే ఎలాంటి అవాంఛీనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు." అని ఎయిర్‌లైన్స్ స్పష్టంగా వివరణ ఇచ్చిందని డీజీసీఏ అధికారులు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. (చదవండి: పట్టపగలే దారుణం..వృద్ధుడిని బైక్‌తో ఈడ్చుకెళ్లి..) -
Pee Gate Row: రెచ్చిపోతే ఇకపై ఊరుకోరు!
న్యూఢిల్లీ: విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన ప్రయాణికుడి ఘటన.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన నెల తర్వాత వృద్ధురాలు ఫిర్యాదు చేయడం, ముంబైకి చెందిన శంకర్ మిశ్రా పరారీలో ఉండడం, ఈ మధ్యలో జరిగిన రాజీ యత్నాలు వాట్సాప్ ఛాటింగ్ రూపంలో.. నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ వ్యవహారంలో!. అయితే.. ఇదొక్కటే కాదు.. స్వల్ఫ వ్యవధిలో ఇలాంటి వికృత ఘటనలు చోటు చేసుకోవడంతో కీలక ఆదేశాలు వెలువడ్డాయి. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో అలాంటి ప్రయాణికుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని, ఇకపై కఠినంగానే వ్యవహరించాలని విమానయాన నియంత్రణ సంస్థ నిర్ణయించుకుంది. విమానాల్లో ఇష్టానుసారం, పద్ధతి లేకుండా ప్రవర్తించే ప్రయాణికులను నిలువరించాల్సిన బాధ్యత పూర్తిగా సిబ్బందిదేనని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్‌లైన్స్ సంస్థలతో పేర్కొంది. అలాంటి ప్రయాణికులను నిలువరించేందుకు విమానంలోని సిబ్బంది సామరస్యంగా ప్రయత్నించాలి. పరిస్థితిని అంచనా వేయడం, సెంట్రల్ కంట్రోల్‌కు సమాచారం అందించాల్సిన బాధత్య పైలట్‌ది. ఒకవేళ..వాళ్లు(రెచ్చిపోయి ఇష్టానుసారం ప్రవర్తించే ప్రయాణికులు) వినలేని పరిస్థితులు గనుక ఎదురైతే ప్రత్యేక పరికరాలను ఉపయోగించాలని డీజీసీఏ.. ఎయిర్‌లైన్స్ సంస్థలకు సూచించింది. బేడీలు లేదంటే బెల్టుల తరహా పరికరాలను ఉపయోగించాలని, వాటిని విమానంలో ఎప్పుడూ ఉంచాలని చెబుతూ.. అవి ఎలా ఉండాలో కూడా పలు సూచనలు చేసింది డీసీసీఏ. నవంబర్‌లో(26వ తేదీన) జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో బిజినెస్ క్లాస్ సెక్షన్లో ఓ వ్యక్తి.. ఓ వృద్ధురాలిపై మూత్రం పోశాడు. ఆ సమయంలో సిబ్బంది ఆమెకు సర్దిచెప్పి.. అతన్ని అక్కడి నుంచి పంపించేశారు విమాన సిబ్బంది. అయితే విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా ఆ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా సదరు వ్యక్తి అక్కడి నుంచి ఏం జరగనట్లు వెళ్లిపోయాడు. అయితే.. ఈ ఘటన విషయంలో ఇరుపార్టీలు రాజీకి వచ్చి ఉంటాయని ఎయిర్ ఇండియా ఇంతకాలం భావించిందట!. కానీ, తాజాగా ఆ వృద్ధురాలు ఏకంగా ఎయిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాయడంతో వ్యవహారం మీడియాకు ఎక్కింది. ఇక ఇది జరిగిన పదిరోజులకే.. అంటే డిసెంబర్ నెలలో మరోకటి జరిగింది. ప్యారిస్-ఢిల్లీ విమానంలో తప్పతాగిన ఓ వ్యక్తి తోటి మహిళా ప్రయాణికురాలి బ్లాంకెట్‌లో మూత్రం పోశాడు. అయితే విమానం దిగాక ఆ వ్యక్తితో లేఖ రాసి పంపించేశారు విమాన సిబ్బంది. ఇలా.. స్వల్ప కాలిక వ్యవధిలో జరిగిన ఘటనలు విమానయాన సంస్థల తీరు మీద విమర్శలు చెలరేగేలా చేశాయి. -
విమానంలో మూత్ర విసర్జన: రాజీ కుదిరిందని ఫిర్యాదు చేయలేదు
ఎయిర్ ఇండియాలోని బిజినెస్ క్లాస్‌లో జరిగిన మూత్ర విసర్జన ఘటనపై బాధితురాలు టాటా గ్రూప్ చైర్మన్‌కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై డైరక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఎయిర్ ఇండియాని వివరణ కోరగా..వారి మధ్య రాజీ కుదరడంతో ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. తమ విమాన సిబ్బంది బాధిత మహిళకు సదరు వ్యక్తితో క్షమాపణలు చెప్పించినట్లు తెలిపింది. అంతేగాక సదరు వ్యక్తి తాను ఫ్యామిలీ మ్యాన్నంటూ అరెస్టు చేయొద్దని ఆమెను వేడుకోవడంతో ఆమె ఫిర్యాదు ఉపసంహరించుకున్నారని, అందువల్లే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా...నవంబర్ 27ను న్యూయార్క్ నుంచి ఢిల్లీ విమానంలో జరిగిన ఘటనపై బాధిత మహిళ లేఖ రాయడంతో.. ఎయిర్ ఇండియా జనవరి 4న మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు ఫిర్యాదు చేసింది. పైగా ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ముంబై వ్యాపారవేత్త శంకర్ మిశ్రాగా వెల్లడించింది. ఆ వ్యక్తి విషయమై ఎయిర్‌పోర్ట్‌లో ఎలర్ట్ ప్రకటించిడమే గాకుండా పోలీసులు ఆ వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపింది. అంతేగాదు ఎఫ్ఐఆర్లో భాగమైన ఆ లేఖలో భాధిత మహిళ.. విమాన సిబ్బంది సదరు వ్యక్తితో క్షమాపణలు చెప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ అతనితో మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలిపింది. పైగా అతన్ని సిబ్బంది తన వద్దకు తీసుకువచ్చారని...అతను ఏడుస్తూ..క్షమాపణలు చెప్పడమే గాక తనకు కుటుంబం ఉందని, తన భార్య, బిడ్డ బాధపడకూడదంటే.. మీరు ఫిర్యాదు చేయకూడదంటూ తనని వేడుకున్నాడని తెలిపారు. వికృత ఘటనకు పాల్పడిన ఆ వ్యక్తితో చర్చించేలా చేయడంతో.. తాను దిక్కుతోచని స్థితిలో పడిపోయానని చెప్పింది. అతను అలా కన్నీళ్లు పెట్టుకోవడంతో..తాను అరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేయలేకపోయానని లేఖలో తెలిపింది. ఐతే అతను చేసింది క్షమించరాని నేరం అని, అలాగే విమాన సిబ్బంది సరైన అవగాహన లేనివారని, అందువల్లే ప్రయాణికుల భద్రత కాపాడటంలో విఫలమయ్యారని ఆరోపణలు చేశారు. అంతేగాదు విమానంలో ప్రయాణికులకు ఎంత మోతాదు వరకు ఇవ్వాలే సరైన నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. ఈ సున్నితమై ఘటనపై క్రియాశీలకంగా వ్యవహరించడంలో కూడా విఫలమైందటూ ఆమె లేఖలో వివరించారు. (చదవండి: నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..!) -
టికెట్ డౌన్‌గ్రేడ్ చేస్తే పరిహారం చెల్లించాలి
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఇకపై ప్రయాణికుల టికెట్లను ఇష్టానుసారంగా డౌన్‌గ్రేడ్ చేస్తే పరిహారం చెల్లించుకోవాల్సి రానుంది. పన్నులు సహా టికెట్ పూర్తి విలువను ప్యాసింజర్‌కి తిరిగి ఇవ్వడంతో పాటు సదరు ప్రయాణికులను తదుపరి అందుబాటులో ఉన్న తరగతిలో ఉచితంగా తీసుకెళ్లాల్సి రానుంది. ఇందుకు సంబంధించి ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రస్తుత నిబంధనలను సవరించే పనిలో ఉంది. సంబంధిత వర్గాలతో సంప్రదింపులు ముగిశాక తుది నిబంధనలను జారీ చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒక తరగతిలో బుక్ చేసుకున్న టికెట్లను విమానయాన సంస్థలు ఇష్టారీతిగా కింది తరగతికి డౌన్‌గ్రేడ్ చేస్తున్నాయంటూ తరచుగా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ మేరకు చర్యలు చేపట్టింది. విమాన సేవలను వేగవంతంగా విస్తరించాల్సి వస్తుండటం, ప్యాసింజర్ ట్రాఫిక్ భారీగా పెరిగిపోవడం వంటి అంశాల వల్ల కొన్ని సందర్భాల్లో ఎయిర్‌లైన్స్ ఇలా చేయాల్సి వస్తోంది. ‘ఉదాహరణకు ప్రయాణికులు .. ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ లేదా ప్రీమియం ఎకానమీలో టికెట్ బుక్ చేసుకుని ఉండవచ్చు. అయితే, సీట్లు అందుబాటులో లేకపోవడం లేదా విమానాన్ని మార్చాల్సి రావడం వంటి కారణాల వల్ల చెకిన్ సమయంలో వారి టికెట్లను దిగువ తరగతికి డౌన్‌గ్రేడ్ చేసే పరిస్థితి ఉంటోంది. అయితే, ఇలా డౌన్‌గ్రేడ్ చేస్తే ప్రయాణికులకు ఎయిర్‌లైన్ టికెట్ పూర్తి విలువ రీఫండ్ చేయడంతో పాటు తదుపరి అందుబాటులో ఉన్న తరగతిలో ఉచితంగా తీసుకెళ్లేలా ప్రతిపాదిత సవరణ ఉపయోగపడుతుంది‘ అని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత నిబంధనలు ఇలా.. బోర్డింగ్‌ను నిరాకరించినా, ఫ్లయిట్ రద్దయినా విమాన ప్రయాణికులకు పరిహారం లభించేలా ప్రస్తుతం నిబంధనలు ఉన్నాయి. బుకింగ్ కన్ఫర్మ్ అయినా బోర్డింగ్‌ను నిరాకరిస్తే, ప్రత్యామ్నాయంగా సదరు విమానం బైల్దేరే షెడ్యూల్ తర్వాత గంట వ్యవధిలోగా మరో ఫ్లయిట్లో సీటు కల్పించగలిగితే ఎలాంటి పరిహారం చెల్లించనక్కర్లేదు. అదే 24 గంటల వరకూ పడితే వన్ వే ఛార్జీ, ఇంధన చార్జీలకు 200 శాతం అధికంగా పరిహారం చెల్లించాలి. గరిష్టంగా రూ. 10,000 పరిమితి ఉంటుంది. ఒకవేళ 24 గంటలు దాటేశాక సీటు కల్పిస్తే రూ. 20,000 గరిష్ట పరిమితికి లోబడి 400 శాతం వరకూ పరిహారం చెల్లించాలి. వీటితో పాటు ఫ్లయిట్ రద్దవడం తదితర అంశాలకు సంబంధించి వివిధ మార్గదర్శకాలు ఉన్నాయి. -
1.16 కోట్ల మంది విమాన ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 నవంబర్‌లో 1.16 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2021 నవంబర్‌తో పోలిస్తే ఈ సంఖ్య 11.06 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. 2022 అక్టోబర్‌లో దేశీయంగా 1.14 కోట్ల మంది విహంగ వీక్షణం చేశారు. కోవిడ్ మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న తరువాత.. దేశంలోని పౌర విమానయాన రంగం రికవరీ బాటలో ఉంది. ఇటీవలి కాలంలో దేశీయంగా సగటున ప్రతిరోజు 4 లక్షల పైచిలుకు మంది విమాన ప్రయాణం చేస్తున్నారు. నవంబరులో నమోదైన మొత్తం ప్రయాణికుల్లో 55.7 శాతం వాటాతో ఇండిగో తొలి స్థానంలో నిలిచింది. విస్తారా 9.3 శాతం వాటాతో 10.87 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. ఎయిర్ ఇండియా 9.1 శాతం, ఏయిర్‌ఏషియా ఇండియా 7.6, గో ఫస్ట్, స్పైస్‌జెట్ చెరి 7.5 శాతం వాటాను దక్కించుకున్నాయి. టాటా గ్రూప్ కంపెనీలైన ఎయిర్ ఇండియా, విస్తారా, ఎయిర్ఏషియా సంయుక్తంగా 26 శాతం వాటాతో 30.35 లక్షల మందికి విమాన సేవలు అందించాయి. 92 శాతం అధిక ఆక్యుపెన్సీతో స్పైస్‌జెట్ ముందంజలో ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో రాకపోకల విషయంలో సగటున 92 శాతం ఇండిగో విమానాలు నిర్ధేశిత సమయానికి సేవలు అందించాయి. -
దివ్యాంగ బాలుడి కేసులో... ఇండిగోకు రూ.5 లక్షల ఫైన్
న్యూఢ్లిల్లీ: మానసిక వైకల్యమున్న బాలుడిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ మీద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీరియస్ అయింది. విమానయాన నిబంధనల్ని ఉల్లంఘించిందంటూ శనివారం రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ నెల 7న రాంచీ విమానాశ్రయంలో తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ విమానం ఎక్కబోతుండగా సదరు బాలున్ని సిబ్బంది అడ్డుకోవడం, అది వివాదానికి దారి తీయడం తెలిసిందే. ఆ సమయంలో బాలుడు ఎవరి మాటా వినకుండా ఉన్మాదంగా ప్రవర్తించాడన్న ఇండిగో వాదనను డీజీసీఏ తోసిపుచ్చింది. -
సీఎం మమతా బెనర్జీ విమానానికి కుదుపులు
కోల్‌కతా: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం తీవ్ర కుదుపులకు లోనుకావడంపై నివేదిక ఇవ్వాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోరింది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వారణాసి వెళ్లిన సీఎం మమత శుక్రవారం సాయంత్రం చార్టర్డ్ విమానంలో తిరిగి వస్తున్నారు. ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు వీయడంతో ఆ విమానం తీవ్ర కుదుపులకు లోనయింది. దీంతో పైలట్ అప్రమత్తమై సుభా‹ష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అకస్మాత్తుగా విమానం పైకి, కిందికి ఊగిసలాడటంతో మమతా బెనర్జీ వెన్నెముకకు గాయమైంది. ఈ ఘటనను బెంగాల్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవడానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని డీజీసీఏను కోరింది. ఈ మేరకు రిపోర్టు సిద్ధం చేస్తున్నట్లు డీజీసీఏ అధికారి ఒకరు వెల్లడించారు. సీఎం మమత భద్రతపై అధికార టీఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె ప్రయాణిస్తున్న విమానాలు గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాయని, దర్యాప్తు చేపట్టాలంది. -
జనవరిలో తగ్గిన విమాన ప్రయాణికులు
న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గత నెలలో గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత డిసెంబర్లో మొత్తం 1.12 కోట్ల మంది ప్రయాణించగా.. జనవరిలో 43 శాతం తక్కువగా 64.08 లక్షల మంది విమాన సేవలను వినియోగించుకున్నారు. ఈ గణాంకాలను పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ విడుదల చేసింది. స్పైస్‌జెట్ లోడ్ ఫ్యాక్టర్ (ప్రయాణికుల భర్తీ) 73.4 శాతంగా ఉంది. ఇండిగో 66.6 శాతం, విస్తారా 61.6 శాతం, గోఫస్ట్ 66.7శాతం. ఎయిర్ ఇండియా 60.6 శాతం, ఎయిరేషియా 60.5 శాతం చొప్పున లోడ్ ఫ్యాక్టర్ సాధించాయి. ఇండిగో అత్యధికంగా 35.57 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. దేశీయంగా 55.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. స్పైస్‌జెట్ 6.8 లక్షల మంది, ఎయిర్ ఇండియా (6.56 లక్షలు), గోఫస్ట్ (6.35 లక్షలు), విస్తారా (4.79 లక్షలు), ఎయిరేషియా ఇండియా (2.95 లక్షలు), అలియన్స్ ఎయిర్ 0.80 లక్షల మంది చొప్పున ప్రయాణికులను తీసుకెళ్లాయి. మెట్రో నగరాల నుంచి 94.5 శాతం మేర సకాలంలో విమాన సేవలను అందించి గో ఫస్ట్ ముందుంది. ఇండిగో 93.9 శాతం, విస్తారా 93.6 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పౌర విమానాల సర్వీసుల్ని డిసెంబర్ 15 నుంచి పునరుద్ధరిస్తున్నట్టుగా కేంద్ర విమానయాన శాఖ శుక్రవారం ప్రకటించింది. కోవిడ్ సంక్షోభంతో గత ఏడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని కేంద్రం పూర్తిగా దానిని ఎత్తేసింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సంబంధించిన అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలంటూ ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్ (డీసీజీఏ)కి కేంద్ర విమానయాన శాఖ లేఖ రాసింది. ‘డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. ఈ సర్వీసుల్ని పునరుద్ధరణ కోసం హోంశాఖ, విదేశాంగ శాఖ, ఆరోగ్య శాఖలతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నాం’ అని విమానయాన శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించినప్పటికీ గత ఏడాది జూలై నుంచి వందే భారత్ పేరుతో కొన్ని ప్రత్యేక విమానాలను నడిపిస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న 28 దేశాలకు ఈ ప్రత్యేక విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని విమానాలను పునరుద్ధరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. -
భారత్‌కు తొలిసారి తాలిబన్ల లేఖ: విమానాలు నడపాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ: తాలిబన్లు తొలిసారి భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అఫ్గానిస్తాన్‌ను సొంతం చేసుకుని ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి తాలిబన్లు భారత్‌తో సత్సంబంధాలు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ దేశానికి విమాన రాకపోకలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. కాబూల్‌కి వాణిజ్య విమానయాన సేవలను తిరిగి ప్రారంభించాలని తాలిబన్ ప్రభుత్వం భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ని కోరింది. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వం ఒక లేఖ పంపించారని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల అఫ్గనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో కాబూల్‌కి అన్ని వాణిజ్య విమానాలను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. (చదవండి: లంచం ఇస్తే తీసుకోండి.. బలవంతంగా వసూలు చేయొద్దు) ఈ మేరకు తాలిబన్లు విమానయానానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించామని, తమ వంతు సహకారం పూర్తిగా అందిస్తామని లేఖలో పేర్కొనట్లు ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఆర్థిక సంకోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గనిస్తాన్‌ని గట్టెక్కించే చర్యల్లో భాగంగా తాలిబన్ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. అయితే తాలిబన్ ప్రభుత్వం గతవారం కూడా పలు దేశాలతో విమానయన సేవలను పునరద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే భారత్‌కు కూడా లేఖ రాసింది. ఈ విషయమై తాలిబన్ల ప్రతినిధి అబ్దుల్ కహార్ బాల్కి స్పందిస్తూ.. ‘అంతర్జాతీయ విమానయాన సేవలను నిలపివేయడంతో విదేశాల్లో చిక్కుకున్న అఫ్గన్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రయాణాలు లేకపోతే ప్రజలకు ఉపాధి, చదువు సజావుగా కొనసాగదు’ అని స్పష్టం చేశారు. తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత అంతర్జాతీయ స్థాయిలో సెప్టెంబర్ 13వ తేదీన కాబూల్ వెళ్లిన మొదటి కమర్షియల్ విమానం పాకిస్తాన్‌కు చెందినదే కావడం గమనార్హం. (చదవండి: ఒక్క టవరే కూల్చండి.. ప్లీజ్) -
మాస్క్ సరిగా ధరించకుంటే ఫైన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) విమానాశ్రయాలు, విమానయాన సంస్థలను అప్రమత్తం చేసింది. ప్రయాణికులు కోవిడ్ ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరింది. మాస్క్ సరిగా ధరించని వారిని, భౌతిక దూరం పాటించని వారిని గుర్తించి అక్కడికక్కడే జరిమానా విధించడం వంటి చర్యలు చేపట్టాలని కోరింది. ఈ మేరకు మార్చి 13వ తేదీన డీజీసీఏ అన్ని విమానాశ్రయాలకు, విమానయాన సంస్థలకు ఈ మేరకు సూచనలు చేసింది. అయితే, కొన్ని విమానాశ్రయాల్లో కోవిడ్–19 ప్రొటోకాల్స్ ఉల్లంఘనలు ఇంకా కొనసాగుతున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ మంగళవారం తాజాగా మరో సర్క్యులర్ జారీ చేసింది. ‘ప్రయాణికులు ముక్కు, నోరు కవరయ్యేలా ముఖానికి మాస్క్‌ను సరిగ్గా ధరించడం మొదలుకొని విమానాశ్రయ పరిసరాల్లో భౌతిక దూరం పాటించడం వంటి అన్ని నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేలా విమానాశ్రయాల అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు నిఘాను మరింత పెంచాలి’అని అందులో కోరింది. ‘నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం అక్కడికక్కడే జరిమానా విధించడం వంటి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో స్థానిక పోలీసు అధికారుల సహకారం తీసుకోవాలి’అని సూచించింది. పదేపదే హెచ్చరించినా కోవిడ్–19 ప్రొటోకాల్‌ను పాటించని ప్రయాణికులను విమా నాశ్రయాల అధికారులు వెంటనే భద్రతా సిబ్బం దికి అప్పగించాలని మార్చి 13వ తేదీ నాటి సర్క్యులర్‌లో తెలిపింది. దీంతోపాటు, పలుమార్లు హెచ్చరించినా నిబంధనలను పాటించడానికి నిరాకరించే ప్రయాణికులను విమానం నుంచి దించివేయాలని, అటువంటి వారిని నిబంధనలు పాటించని ప్రయాణికులుగా గుర్తించాలని కూడా సూచించింది. ఇలా గుర్తించిన ప్రయాణికులపై విమానయాన సంస్థలు మూడు నుంచి 24 నెలల వ రకు ప్రయాణ నిషేధం విధించవచ్చని డీజీసీఏ నిబంధనలు చెబుతున్నాయి. మార్చి 15 నుంచి 23వ తేదీ వరకు దేశీయ విమానయాన సంస్థల విమానాల్లో ప్రయాణించిన 15 మంది ప్రయా ణికు లు కోవిడ్–19 నిబంధనలను పాటించలేదన్న విష యాన్ని అధికారులు గుర్తించారు. వీరిపై 3 నెలల ప్రయాణ నిషేధం విధించే అవకాశం ఉందని డీజీ సీఏ ఉన్నతాధికారులు తెలిపారు. విమానం లోపల ఉన్న సమయంలో మాస్క్ ధరించేందుకు కొందరు నిరాకరిస్తుండగా, మధ్యసీట్లలో కూర్చునే వారు తప్పనిసరిగా పీపీఈ కిట్ ధరించాలనే నిబంధనను మరికొందరు పట్టించుకోవడం లేదని తెలిపారు. -
అంతర్జాతీయ విమాన సర్వీస్‌ల రద్దు పొడిగింపు
న్యూఢిల్లీ: నవంబర్ 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు తెలిపారు. అయితే ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలను పరిస్థితులను బట్టి సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి భారత్ అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. మే నెల నుంచి ‘వందే భారత్’ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన దేశాలకు, జూలై నుంచి కొన్ని ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీస్‌లను నడుపుతున్నారు. ఇప్పటి వరకు అమెరికా, బ్రిటన్ వంటి 18 దేశాలతో భారత్ అంతర్జాతీయ సర్వీస్‌లను నడపడానికి ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. ముంబై విమానాలను అనుమతించం: హాంకాంగ్ గత వారం ముంబై నుంచి వచ్చిన విమానంలో కొంత మంది ప్రయాణికులకు కోవిడ్ ఉన్నట్టు తేలటంతో నవంబర్ 10 వరకు ముంబై నుంచి వచ్చే ఎయిర్ ఇండియా విమానాలను అనుమతించబోమని హాంకాంగ్ ప్రభుత్వాధికారులు తెలిపారు. ప్రయాణానికి 72 గంటల ముందు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్తో మాత్రమే భార తీయులు హాంకాంగ్‌కి ప్రయాణిం చవచ్చునని హాకాంగ్ ప్రభుత్వం వెల్లడించింది. -
అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు
న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం మరోసారి నిషేధాన్ని పొడిగించింది. జూలై 15 అర్ధరాత్రి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే కార్గో సర్వీసులు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని డీజీసీఏ స్పష్టం చేసింది. (విమానయాన సంస్థలకు భారీ ఊరట) కాగా, మార్చి చివరి వారంలో కరోనా లాక్డౌన్ విధించడానికి కొద్ది రోజుల ముందే అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే మే 25 నుంచి పలు రూట్లలో దేశీయ విమాన సర్వీసులకు కేంద్రం అనుమతించింది. అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులపై మాత్రం నిషేధాన్ని కొనసాగించారు. కొద్ది రోజుల కిందట కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్.. కరోనా కేసుల సంఖ్యను బట్టి జూలై నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను అనుమతించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతోనే విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకన్నట్టుగా సమాచారం. మరోవైపు లాక్‌డౌన్‌తో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వందేభారత్ మిషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. pic.twitter.com/qDqtyit14Q — DGCA (@DGCAIndia) June 26, 2020 -
విమాన సిబ్బందికి డ్రగ్ పరీక్షలు!
న్యూఢిల్లీ: విమానాలు నడిపే పైలట్లకు, ఇతర సిబ్బందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రతిపాదించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. నియమ నిబంధలన్నీ అమల్లోకి వస్తే విమానంలో పనిచేసే సిబ్బందితోపాటు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకూ ఈ పరీక్షలు నిర్వహిస్తామని వారు చెప్పారు. తొలిదశలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో ఈ పరీక్షలను చేపడతారు. రెండు దశల్లో జరిగే ఈ పరీక్షలో ఒకటి విమానాశ్రయం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కాంప్లెక్స్‌లలో జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్‌ను వీడియోలో రికార్డు చేస్తారు. గంజాయి, ఓపియం తదితర మత్తుమందులు తీసుకున్నట్లు స్క్రీనింగ్ టెస్ట్‌లో బయటపడితే, మళ్లీ నిర్ధారణకు ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. డీజీసీఏ అధికారుల నేతృత్వంలో ఏటా ఒక్కో సంస్థ సిబ్బందిలో పదిశాతం మందికి ఈ పరీక్షలు చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో మత్తుమందులు తీసుకున్నట్లు తెలిస్తే ఆ ఉద్యోగిని భద్రత వంటి కొన్నిరకాల విధుల నుంచి తప్పిస్తారు. తదుపరి పరీక్షల్లోనూ మత్తుమందులు తీసుకున్నట్లు రూఢి అయితే తగిన రీహాబిలిటేషన్ సెంటర్లకు పంపుతారు. -
విమానంలో పైలట్ల ఫైటింగ్.. తలకిందులైన ఫేట్
సాక్షి, న్యూఢిల్లీ : విమానంలో తన్నుకున్న ఇద్దరు సీనియర్ పైలట్లపై వేటు పడింది. వారిని ఉన్నఫలంగా విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు జెట్ ఎయిర్వేస్ మంగళవారం ఓ ప్రకటన చేసింది. ఈ విషయాన్ని తాము సీరియస్‌గా పరిగణిస్తున్నామని, మరోసారి ఇలాంటి సంఘటనలకు అవకాశం ఇవ్వొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఏడాది(2018) కొత్త సంవత్సరం ప్రారంభం రోజున (జనవరి 1) లండన్ నుంచి ముంబయికి బయలు దేరిన జెట్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ విమానం 777 (9డబ్ల్యూ 119)లో ఓ సీనియర్ పైలట్, మరో సీనియర్ కోపైలట్ ఘర్షణకు దిగారు. ఇద్దరు కాక్‌పీట్‌ను వదిలేసి తన్నుకుని ప్రయాణీకులను భయబ్రాంతులకు గురిచేశారు. చివరకు సిబ్బంది జోక్యంతో పైలట్లు శాంతించి విమానాన్ని ఎట్టకేలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే, ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన జెట్ ఎయిర్వేస్ ఆదేశించింది. అదే సమయంలో ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు తీవ్రంగా స్పందించి ఆ ఇద్దరు పైలెట్ల లైసెన్స్‌లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక నుంచి వారు పైలట్లుగా కాకుండా ప్రయాణీకులుగా మాత్రమే విమానాల్లో వెళ్లేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. -
విమానంలో హోలీ; స్పైట్ జెట్‌కు నోటీసులు
న్యూఢిల్లీ: మలేసియా విమానం గగనతలం నుంచి కనిపించకుండాపోయి మిస్టరీగా మారితే.. మరోపక్క భారత విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడింది. హోలీ రోజున జరిగిన ఈ బాగోతం ఆలస్యంగా వెలుగు చూడడంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పైస్ జెట్‌కు షోకాజ్ నోటీసు జారీచేసింది. గోవా నుంచి బెంగళూరు వెళుతున్న విమానంలో స్పైస్ జెట్ సిబ్బంది రంగుల పండుగ జరుపుకున్నారు. భద్రతను గాలికి వదిలేసి బాలీవుడ్ పాటలకు స్టెప్పులేస్తూ ప్రయాణికులను ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియాలు ఇంటర్నెట్లో కనిపించడంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించింది. లైసెన్స్ రద్దు చేయకూడదో చెప్పాలని స్పైస్ జెట్‌కు షోకాజ్ జారీ చేసింది. కేవలం ఆ విమానంలోనే కాకుండా, మిగతా స్పైస్ జెట్ విమానాల్లోనూ హోలీ డాన్సుల హంగామా సాగిందని విచారణలో తేలింది. దీంతో డీజీసీఏ స్పైస్ జెట్‌పై కారాలు మిరియాలు నూరుతోంది. మరోవైపు ఈ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.