విమానంలో హోలీ; స్పైట్ జెట్కు నోటీసులు
న్యూఢిల్లీ: మలేసియా విమానం గగనతలం నుంచి కనిపించకుండాపోయి మిస్టరీగా మారితే.. మరోపక్క భారత విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడింది. హోలీ రోజున జరిగిన ఈ బాగోతం ఆలస్యంగా వెలుగు చూడడంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పైస్ జెట్‌కు షోకాజ్ నోటీసు జారీచేసింది. గోవా నుంచి బెంగళూరు వెళుతున్న విమానంలో స్పైస్ జెట్ సిబ్బంది రంగుల పండుగ జరుపుకున్నారు. భద్రతను గాలికి వదిలేసి బాలీవుడ్ పాటలకు స్టెప్పులేస్తూ ప్రయాణికులను ఉత్సాహపరిచారు.
దీనికి సంబంధించిన వీడియాలు ఇంటర్నెట్లో కనిపించడంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించింది. లైసెన్స్ రద్దు చేయకూడదో చెప్పాలని స్పైస్ జెట్‌కు షోకాజ్ జారీ చేసింది. కేవలం ఆ విమానంలోనే కాకుండా, మిగతా స్పైస్ జెట్ విమానాల్లోనూ హోలీ డాన్సుల హంగామా సాగిందని విచారణలో తేలింది. దీంతో డీజీసీఏ స్పైస్ జెట్‌పై కారాలు మిరియాలు నూరుతోంది. మరోవైపు ఈ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.