విమానంలో పైలట్ల ఫైటింగ్‌.. తలకిందులైన ఫేట్‌ | Jet Airways sacks two pilots | Sakshi
Sakshi News home page

విమానంలో పైలట్ల ఫైటింగ్‌.. తలకిందులైన ఫేట్‌

Published Tue, Jan 9 2018 1:34 PM | Last Updated on Tue, Jan 9 2018 1:34 PM

Jet Airways sacks two pilots - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విమానంలో తన్నుకున్న ఇద్దరు సీనియర్‌ పైలట్లపై వేటు పడింది. వారిని ఉన్నఫలంగా విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ మంగళవారం ఓ ప్రకటన చేసింది. ఈ విషయాన్ని తాము సీరియస్‌గా పరిగణిస్తున్నామని, మరోసారి ఇలాంటి సంఘటనలకు అవకాశం ఇవ్వొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఏడాది(2018) కొత్త సంవత్సరం ప్రారంభం రోజున (జనవరి 1) లండన్‌ నుంచి ముంబయికి బయలు దేరిన జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్‌ విమానం 777 (9డబ్ల్యూ 119)లో ఓ సీనియర్‌ పైలట్‌, మరో సీనియర్‌ కోపైలట్‌ ఘర్షణకు దిగారు.

ఇద్దరు కాక్‌పీట్‌ను వదిలేసి తన్నుకుని ప్రయాణీకులను భయబ్రాంతులకు గురిచేశారు. చివరకు సిబ్బంది జోక్యంతో పైలట్లు శాంతించి విమానాన్ని ఎట్టకేలకు సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. అయితే, ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆదేశించింది. అదే సమయంలో ఈ ఘటనపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అధికారులు తీవ్రంగా స్పందించి ఆ ఇద్దరు పైలెట్ల లైసెన్స్‌లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక నుంచి వారు పైలట్లుగా కాకుండా ప్రయాణీకులుగా మాత్రమే విమానాల్లో వెళ్లేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement