న్యూఢిల్లీ: తాలిబన్లు తొలిసారి భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అఫ్గానిస్తాన్‌ను సొంతం చేసుకుని ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి తాలిబన్లు భారత్‌తో సత్సంబంధాలు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ దేశానికి విమాన రాకపోకలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. కాబూల్‌కి వాణిజ్య విమానయాన సేవలను తిరిగి ప్రారంభించాలని తాలిబన్ ప్రభుత్వం భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ని కోరింది. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వం ఒక లేఖ పంపించారని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల అఫ్గనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో కాబూల్‌కి అన్ని వాణిజ్య విమానాలను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే.
(చదవండి: లంచం ఇస్తే తీసుకోండి.. బలవంతంగా వసూలు చేయొద్దు)
ఈ మేరకు తాలిబన్లు విమానయానానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించామని, తమ వంతు సహకారం పూర్తిగా అందిస్తామని లేఖలో పేర్కొనట్లు ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఆర్థిక సంకోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గనిస్తాన్‌ని గట్టెక్కించే చర్యల్లో భాగంగా తాలిబన్ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. అయితే తాలిబన్ ప్రభుత్వం గతవారం కూడా పలు దేశాలతో విమానయన సేవలను పునరద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే భారత్‌కు కూడా లేఖ రాసింది.
ఈ విషయమై తాలిబన్ల ప్రతినిధి అబ్దుల్ కహార్ బాల్కి స్పందిస్తూ.. ‘అంతర్జాతీయ విమానయాన సేవలను నిలపివేయడంతో విదేశాల్లో చిక్కుకున్న అఫ్గన్‌లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రయాణాలు లేకపోతే ప్రజలకు ఉపాధి, చదువు సజావుగా కొనసాగదు’ అని స్పష్టం చేశారు. తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత అంతర్జాతీయ స్థాయిలో సెప్టెంబర్ 13వ తేదీన కాబూల్ వెళ్లిన మొదటి కమర్షియల్ విమానం పాకిస్తాన్‌కు చెందినదే కావడం గమనార్హం.
(చదవండి: ఒక్క టవరే కూల్చండి.. ప్లీజ్)
Comments
Please login to add a commentAdd a comment