టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో యాపిల్ కంపెనీ తన ఉత్పత్తుల్లో ఆధునిక ఫీచర్స్ తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న కొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్ల శ్రేణిని ఆపిల్ ఎట్టకేలకు వెల్లడించింది.
యాపిల్ కంపెనీ ప్రవేశపెట్టనున్న లేటెస్ట్ ఫీచర్లలో ఐ ట్రాకింగ్, మ్యూజిక్ హాప్టిక్స్, వోకల్ షార్ట్‌కట్స్, వెహికల్ మోషన్ క్యూస్ వంటివి ఉన్నాయి. visionOS కోసం మరిన్ని యాక్సెసిబిలిటీ అప్‌గ్రేడ్‌లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
'ఐ ట్రాకింగ్ ఫీచర్'
ఐ ట్రాకింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారు తమ కళ్ళతోనే ఐప్యాడ్‌లు, ఐఫోన్‌లను కంట్రోల్ చేయవచ్చు. ఈ ఫీచర్ ప్రత్యేకంగా శారీరక వైకల్యాలు ఉన్న వినియోగదారుల కోసం రూపొందించినట్లు సమాచారం.
ఎలా పని చేస్తుందంటే?
- ఐ ట్రాకింగ్‌ను సెటప్ చేయడానికి ముందువైపు కెమెరా ఉపయోగించబడుతుంది.
- ఐ ట్రాకింగ్ కోసం ఉపయోగించిన మొత్తం డేటా మీ డివైస్‌లో ఉంటుంది. ఇది Appleతో కూడా భాగస్వామ్యం చేయదు. కాబట్టి సమాచారం భద్రంగా ఉంటుంది.
- ఐప్యాడోస్, iOSలోని అన్ని యాప్‌లతో ఐ ట్రాకింగ్ పని చేస్తుంది. కాబట్టి అడిషినల్ హార్డ్‌వేర్ లేదా యాక్సెసరీలు అవసరం లేదు.
ఎలా ఉపయోగపడుతుందంటే?
- ఐ ట్రాకింగ్ సాయంతో యాప్‌లోని వివిధ భాగాలను చూడటం ద్వారా వాటి ద్వారా నావిగేట్ చేయవచ్చు.
- ఈ ఎలిమెంట్లను యాక్టివేట్ చేయడానికి డ్వెల్ కంట్రోల్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.
- ఐ ట్రాకింగ్ వినియోగదారులు భౌతిక స్పర్శ అవసరం లేకుండా (టచ్ చేయకుండా) కేవలం వారి కళ్లను ఉపయోగించి బటన్లను నొక్కడం, స్వైపింగ్ చేయడం వంటివి చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment