ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ! అదరగొడుతున్న బ్లింకిట్.. | Apple iPhone 15 Delivered Within 10 Minutes of Ordering Blinkit - Sakshi

ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ! అదరగొడుతున్న బ్లింకిట్..

Published Sat, Sep 23 2023 10:59 AM | Last Updated on Sat, Sep 23 2023 3:37 PM

iPhone 15 Delivered Within 10 Minutes of Ordering Blinkit - Sakshi

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మనకు ఏమి కావాలన్నా మనచెంతకే వచ్చేలా చేసుకుంటున్నాం. అలాంటి వాటి కోసమే కొన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇందులో ఒకటి 'బ్లింకిట్' (Blinkit). కిరాణా, ఆహార ఉత్పత్తుల వంటి నిత్యావసరాలను డెలివరీ చేసే ఈ ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం ఐఫోన్స్ కూడా డెలివరీ చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్‌కి డిమాండ్ భారీగా ఉంది. ఈ మొబైల్ సేల్స్ నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. యాపిల్ స్టోర్లు ఓపెన్ చేయక ముందు నుంచే కస్టమర్లు గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్లింకిట్ ఐఫోన్ డెలివరీలను ప్రారంభించింది.

ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్ సూపర్ కారు - ధర తెలిస్తే షాకవుతారు!

ఆర్డర్ చేసిన కేవలం 10 నిమిషాల్లో బ్లింకిట్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ డెలివరీ చేస్తున్నట్లు నెటిజన్లు ట్విటర్ ద్వారా పోస్ట్ చేస్తున్నారు. ఈ సదుపాయం ప్రస్తుతం ఢిల్లీ, ఎన్‌సీఆర్, ముంబై, పూణే, బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. దీని కోసం బ్లింకిట్ యాపిల్ ప్రీమియం రీసెల్లర్ యూనికార్న్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement