కాలాలతో సంబంధం లేకుండా చీకటి పడేసరికి చాలా ఇళ్లల్లో.. దోమలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. వాటికి చెక్ పెట్టడానికి దోమల చక్రాలు, దోమల అగరొత్తులు, ఆల్ ఔట్స్ వంటి ప్రొడక్ట్స్ వాటడం సర్వసాధారణం. అయితే కొన్ని మొండి దోమలు కాసేపటికే ఆ మత్తు నుంచి తేరుకుని.. తమ ప్రతాపాన్ని చూపెడుతుంటాయి. అందుకే చాలా మంది దోమల బ్యాట్ అందుకుని యుద్ధం చేస్తుంటారు. (అదరగొట్టిన పోరీలు..ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!)
ఈ డివైస్ ఇంట్లో ఉంటే.. బ్యాట్ తీసుకుని మూల మూలకు తిరగాల్సిన పనిలేదు. వాటంతట అవే ఆ మెషిన్ దగ్గరకు వచ్చి చటుక్కున చస్తాయి. దీని హైసింథైన్ ఎల్‌ఈడీ లైట్.. ఇరువైపుల నుంచి ప్రత్యేకమైన కాంతిని వెదజల్లుతూ దోమలను, కీటకాలను ట్రాప్ చేసి తనవైపు రప్పిస్తుంది. క్షణాల్లో లోపలకు లాగి.. లోపలున్న బాస్కెట్‌లో వేసేస్తుంది.
ఇది రసాయనాలు, విషపదార్థాలు, రేడియేషన్స్ జోలికి వెళ్లదు. ఈ మెషిన్ ఆన్‌లో ఉన్నప్పుడు.. పిల్లలు, పెంపుడు జంతువులు పొరబాటున తగిలినా.. విద్యుదాఘాతం వంటి ప్రమాదాలేం జరగవు. దీన్ని ఎక్కడికైనా సులభంగా వెంట తీసుకెళ్లొచ్చు. ఇది పనిచేస్తున్నప్పుడు ఎలాంటి శబ్దం చేయదు. మరునాడు ఉదయాన్నే బాస్కెట్‌ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దీని ధర 10 డాలర్లు మాత్రమే. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 824. (ఆకాష్ అంబానీ-శ్లోక లిటిల్ ప్రిన్సెస్ పేరు: పండితులు ఏమంటున్నారంటే?)
ఇదీ చదవండి: ఒకప్పుడు రెస్టారెంట్‌లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో
Comments
Please login to add a commentAdd a comment