![MacBook Pro ipods launched Apple October event 2021 - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/19/home%20pod.jpg.webp?itok=_da58iCm)
సాక్షి, న్యూఢిల్లీ: మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్‌లు ఎన్ని ఉన్నా ఆపిల్, శాంసంగ్, గూగుల్ ఫోన్లకు ఉన్న హవానే వేరు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న ఈ దిగ్గజ కంపెనీలు నువ్వా నేనా అన్నట్టుగా లాంచ్ ఈవెంట్స్‌కు సిద్దమయ్యాయి. పోటీ మార్కెట్‌లో తమ ఉత్పత్తులతో మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వరుసగా లాంచ్ ఈవెంట్లతో స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ సమరంలో ఆపిల్ సరికొత్త ఆవిష్కరణలతో ముందు వరుసలో నిలిచింది.
ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో తిరిగి రెండోస్థానాన్ని కైవసం చేసుకున్న ఆపిల్ ఈ ఉత్సాహంలో మరింత దూకుడు మీద ఉంది. ‘అన్ లీష్‌డ్’ పేరుతో సోమవారం నిర్వహించిన స్పెషల్ ఈవెంట్‌లో ఆపిల్ మాక్‌బుక్ ప్రో, థర్డ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్, హోమ్‌ప్యాడ్ మినీతో సహా అనేక ఉత్పత్తులను లాంచ్ చేసింది. 3.3 రెట్ల వేగవంతమైన హై ఎండ్ పీసీ ఎం1 మాక్స్ చిప్‌నుకూడా తీసుకొచ్చింది.సరికొత్త ఫీచర్లతో కొత్త మ్యాక్‌బుక్ ప్రో, ఆపిల్‌నోట్‌బుక్ 22, 6 స్పీకర్ సిస్టమ్‌తో 16.2-అంగుళాల మాక్‌బుక్ ప్రో లాంటి పొడక్ట్స్‌ను తీసుకొచ్చింది.
కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ అధికారిక ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ రోజునుంచే ఆర్డర్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 26 నుండి స్టోర్లలో లభ్యం. 14 అంగుళాల కొత్త మాక్‌బుక్ ప్రో మోడల్ రూ .1,94,900, విద్యార్థులకు రూ .1,75,410 వద్ద ప్రారంభం.. 16 అంగుళాల మాక్‌బుక్ ప్రో మోడల్ ధర రూ .2,39,900, విద్యార్థులకు రూ .2,15,910. అలాగే మాక్ ఐవోఎస్ మాంటెరీ ఉచిత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అక్టోబర్ 25 సోమవారం నుంచి అందుబాటులో ఉంటుంది.
6 గంటల నాన్‌స్టాప్‌తో కొత్త ఎయిర్‌పాడ్స్‌ను అప్‌డేట్‌చేసింది ఆపిల్. చెవులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చిన్నగా, గట్టి ప్లాస్టిక్‌తో వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను తీసుకొచ్చింది. వాటి ధర దాదాపు రూ. 13,500గా ఉండనున్నాయి. కొత్త రంగుల్లో అంటే యల్లో, ఆరెంజ్, బ్లూ కలర్స్‌లో, సిరి వాయస్ సపోర్ట్‌తో ఆపిల్ హోమ్‌ప్యాడ్ మినీ స్పీకర్స్‌ను కలర్‌ఫుల్‌గా లాంచ్ చేసింది. మొత్తం 5 కలర్ ఆప్షన్‌లు ఇందులో అందుబాటులో ఉంటాయి. ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. సుమారు 7500 రూపాయలకే ఇవి అందుబాటులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment