![Reliance into personal care products - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/24/RELIANCE-PERSONAL-CARE.jpg.webp?itok=OtleJCcr)
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ సెగ్మెంట్‌లో వేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్‌సీపీఎల్) తాజాగా గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించింది. గ్లిమర్ బ్యూటీ సోప్‌లు, ప్యూరిక్ హైజీన్ సబ్బులు, డోజో డిష్ వాష్ లిక్విడ్‌లు, హోమ్‌గార్డ్ టాయిలెట్.. ఫ్లోర్ క్లీనర్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి.
ఈ ఉత్పత్తులతో ఆయా విభాగాల్లో దిగ్గజాలైన హెచ్‌యూఎల్, పీ అండ్ జీ, రెకిట్ మొదలైన వాటితో రిలయన్స్ పోటీపడనుంది. నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా వీటిని ఆవిష్కరించినట్లు ఆర్‌సీపీఎల్ ప్రతినిధి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment