హైదరాబాద్: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తాజాగా రిటైల్, వ్యాపార వర్గాల కోసం రెండు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. యూపీఐ–ఏటీఎం, భారత్ కనెక్ట్ (గతంలో బీబీపీఎస్) ఫర్ బిజినెస్ వీటిలో ఉన్నాయి. కార్డ్‌లెస్ నగదు విత్‌డ్రాయల్, డిపాజిట్లకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) టెక్నాలజీ ఆధారిత ఆండ్రాయిడ్ క్యాష్ రీసైక్లర్‌గా యూపీఐ–ఏటీఎం పని చేస్తుంది. అకౌంటు తెరవడం,
క్రెడిట్ కార్డుల జారీ, డిపాజట్లు, రుణాలు, ఫారెక్స్ మొదలైన సరీ్వసులన్నీ కూడా ఒకే ప్లాట్‌ఫాం మీద అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని బ్యాంకు డిప్యుటీ ఎండీ రాజీవ్ ఆనంద్ తెలిపారు. మరోవైపు, వ్యాపార సంస్థలు సప్లై చెయిన్‌లోని వివిధ దశల్లో నిర్వహణ మూలధన అవసరాల కోసం, అకౌంట్ రిసీవబుల్స్–పేయబుల్స్‌ను సమర్ధవంతంగా క్రమబదీ్ధకరించుకునేందుకు భారత్ కనెక్ట్ ఫర్ బిజినెస్ ఉపయోగపడుతుంది. ఎన్‌పీసీఐలో భాగమైన భారత్ బిల్‌పే భాగస్వామ్యంతో దీన్ని రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment