న్యూఢిల్లీ: కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ ఇండియా తాజాగా 2022కి సంబంధించి కొత్త ఉత్పత్తుల శ్రేణిని ఆవిష్కరించింది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఒవెన్లు, ఏసీలు మొదలైన వాటికి సంబంధించి 270 పైగా మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించిన స్మార్ట్ గృహోపకరణాలు వీటిలో ఉన్నాయి. ఏఐ డైరెక్ట్ డ్రైవ్ వాషింగ్ మెషీన్లు, ఇన్‌స్టావ్యూ ఫ్రిజ్‌లు, ప్యూరికేర్ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫయర్, విరాట్ ఏసీలు మొదలైనవి వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయని సంస్థ డైరెక్టర్ (హోమ్ అప్లయెన్స్, ఎయిర్ కండీషనర్స్) హ్యూంగ్ సుబ్జీ తెలిపారు.
ఈ ఏడాది 2022లో 30 శాతం వృద్ధి సాధించగలమని అంచనా వేస్తున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. పటిష్ట డిమాండ్, కొత్త ప్రొడక్టుల విడుదల నేపథ్యంలో హోమ్ అప్లయెన్సెస్, ఏసీ బిజినెస్ వేగవంత పురోగతిని సాధించే వీలున్నట్లు పేర్కొంది. గతేడాది (2021) ఈ విభాగాలలో 20% వృద్ధిని సాధించినట్లు తెలియజేసింది. దేశీయంగా అమ్మకాలలో 70% వాటా ఈ విభాగానిదేనని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వైస్‌ప్రెసిడెంట్ దీపక్ బన్సల్ పేర్కొన్నారు. 2021లో ఈ విభాగం అమ్మకాలు రూ. 15,000 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment