కొత్తకొత్త ఉత్పత్తులతో ఆపిల్ ఈవెంట్
కొత్తకొత్త ఉత్పత్తులతో ఆపిల్ ఈవెంట్
Published Tue, Mar 14 2017 1:30 PM | Last Updated on Mon, Aug 20 2018 3:07 PM
అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఈ నెలలో కొత్త కొత్త ఉత్పత్తులతో వినియోగదారుల ముందుకు రాబోతుంది. ఈ నెల చివర్లో ఆపిల్ ఓ ఈవెంట్ ను నిర్వహించబోతుందని, ఆ ఈవెంట్లో కొత్త ఐప్యాడ్ ప్రొను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. అంతేకాక 128జీబీ స్టోరేజ్ తో అతిపెద్ద ఐఫోన్ ఎస్ఈ మోడల్ ను, కొత్త ఆపిల్ వాచ్ బ్యాండ్స్ ను ఆవిష్కరించనున్నట్టు టెక్ వర్గాల టాక్. కొత్త ఐప్యాడ్ ప్రొ మోడల్స్ ని ఈ నెలలోనే ఆవిష్కరించబోతుందని రూమర్లు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. 9.7 అంగుళాల, 12.9 అంగుళాల వెర్షన్లను అప్ డేట్ చేసిన ఆపిల్, 10.5 అంగుళాల స్లిమర్ బెజిల్స్ తో ఈ కొత్త ఐప్యాడ్ ప్రొను తీసుకురాబోతుందని టెక్ వెబ్ సైట్ మ్యాక్రూమర్స్.కామ్ రిపోర్టు చేసింది.
అయితే ఈ ఐప్యాడ్ ప్రొలో హోమ్ బటన్ ఉండదట. హైయర్-రెజుల్యూషన్ డిస్ ప్లే, క్వాడ్ మైక్రోఫోన్స్ దీనిలో ఉంటాయని తెలుస్తోంది. అప్ డేట్ చేసిన 12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రొ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరాను, ప్రస్తుతమున్న 9.7 అంగుళాల మోడల్ మాదిరిగా ట్రూ టోన్ డిస్ ప్లేను కలిగి ఉంటుందని టాక్. అదేవిధంగా ఓమోలెడ్ డిస్ ప్లేతో 5.8 అంగుళాల సరికొత్త ఐఫోన్ 8 ను లాంచ్ చేయబోతున్నామని, మరో రెండు డివైజ్ లను తీసుకురాబోతున్నామని ఆపిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగతా రెండు డివైజ్ లు అప్ డేటడ్ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ లని తెలుస్తోంది. అయితే ఆపిల్ ప్రకటించిన ఈ ప్రొడక్ట్ లు కూడా ఈ ఈవెంట్లోనే వినియోగదారుల ముందుకు రావొచ్చని కొందరంటున్నారు. ఆపిల్ నిర్వహించే ఆ ఈవెంట్ మార్చి 20 సోమవారం, మార్చి 24 శుక్రవారం మధ్యలో ఉంటుందట.
Advertisement
Advertisement