
సాక్షి, ముంబై: ఆపిల్ ఐఫోన్ ధర మరోసారి తగ్గింది. తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 8 భారీ తగ్గింపుతో ఇ-కామర్స్ సైట్ అమెజాన్ లో లభిస్తోంది. రూ.9వేల డిస్కౌంట్ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్ ఇపుడు రూ.54,999 లకే లభ్యం కానుంది. గత సెప్టెంబర్‌లో లాంచ్ అయిన దీని అసలు ధర రూ. 64 వేలు.
గత రెండు వారాల్లో ఐ ఫోన్లపై ఇది రెండవ అతి భారీ తగ్గింపని టెక్ నిపుణులు భావిస్తున్నారు. గత వారం కిందటే ఐఫోన్ ఎస్‌ఈ (32జీబీ)ని రూ.8వేల తగ్గింపు ధరతో రూ.17,999 కు అమెజాన్ అందించింది. కాగా ఇప్పుడీ ఫోన్ ధర అమెజాన్‌లో రూ.18,899గా ఉంది. మరోవైపు విదేశీ మొబైల్స్‌పై దిగుమతి సుంకం పెంచడంతో ఇటీవల ఆపిల్ ఐ ఫోన్ 8, 8ప్లస్, ఐ ఫోన్ ఎక్స్ ఫోన్ల రేట్లను పెంచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment