iPhone 8
-
బంపర్ ఆఫర్: ఐఫోన్లపై భారీ తగ్గింపు
2018 కొత్త ఐఫోన్ మోడల్స్... ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్ లాంచింగ్ సందర్భంగా, పాత ఐఫోన్ వేరియంట్లపై భారీగా ధరలు తగ్గించింది ఆపిల్. దేశీయ మార్కెట్లోనూ, గ్లోబల్‌గా కూడా వీటి ధరలు తగ్గాయి. దేశీయ మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 6ఎస్ 32జీబీ వేరియంట్ ధర రూ.29,900కే లభ్యమవుతుంది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ బేస్ వేరియంట్ ధర కూడా 34,900 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ కొత్త ధరలను ఆపిల్ తన వెబ్సైట్లో అప్డేట్ చేసింది. అయితే ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ 10 లను అమెరికాలో నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. కానీ భారత్‌లో కేవలం ఐఫోన్ ఎస్ఈ నే నిలిపివేసింది. మిగతా మూడు ఐఫోన్లను తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ మోడల్ కొత్త ధర పాత ధర ఐఫోన్10 (256 జీబీ) రూ.1,06,900 రూ.1,08,930 ఐఫోన్10 (64 జీబీ) రూ.91,900 రూ.95,390 ఐఫోన్ 8 (64జీబీ) రూ.59,900 రూ.67,940 ఐఫోన్ 8 (256జీబీ) రూ.74,900 రూ.81,500 ఐఫోన్ 8 ప్లస్ (64జీబీ) రూ.69,900 రూ.77,560 ఐఫోన్ 8 ప్లస్ (256జీబీ) రూ.84,900 రూ.91,110 ఐఫోన్ 7 (32జీబీ) రూ.39,900 రూ.52,370 ఐఫోన్ 7 (128జీబీ) రూ.49,900 రూ.61,560 ఐఫోన్ 7 ప్లస్ (32జీబీ) రూ.49,900 రూ.62,840 ఐఫోన్ 7 ప్లస్ (128జీబీ) రూ.59,900 రూ.72,060 ఐఫోన్ 6ఎస్ (32జీబీ) రూ.29,900 రూ.42,900 ఐఫోన్ 6ఎస్ (128జీబీ) రూ.39,900 రూ.52,100 ఐఫోన్ 6ఎస్ ప్లస్ (32జీబీ) రూ.34,900 రూ.52,240 ఐఫోన్ 6ఎస్ ప్లస్ (128జీబీ) రూ.44,900 రూ.61,450 -
ఆపిల్‌కు గుడ్‌న్యూస్ : ఆ ఫోన్ దంచికొట్టింది
టెక్ దిగ్గజం ఆపిల్‌కు గుడ్‌న్యూస్ వెలువడింది. ఈ వారంలో ప్రకటించిన త్రైమాసికపు ఫలితాల్లో ఐఫోన్ ఎక్స్ బెస్టింగ్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ ఎక్స్ విక్రయాల్లో ఎలా ఉంటుందో అని మార్కెట్ విశ్లేషకులు, కంపెనీ పలు సందేహ పడింది. కానీ వారందరి సందేహాలను బద్దలు కొడుతూ.. 2018 తొలి క్వార్టర్లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ ఎక్స్ నిలిచినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 16 మిలియన్ యూనిట్ల ఐఫోన్ ఎక్స్‌లను రవాణా చేసినట్టు సీనెట్ రిపోర్టులు పేర్కొన్నాయి. ఐఫోన్ ఎక్స్‌తో పాటు లాంచ్ చేసిన ఐఫోన్ 8 కేవలం 12.5 మిలియన్ యూనిట్లు మాత్రమే రవాణా జరుగగా.. ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 8.3 మిలియన్ యూనిట్లు రవాణా జరిగింది. ఆపిల్ ప్రకటించిన ఈ ఫలితాలు వాల్‌స్ట్రీట్ అంచనాలను కూడా బీట్ చేశాయి. అయితే భారత మార్కెట్లో మాత్రం ఆపిల్ మార్కెట్ షేరు తగ్గింది. 2018 తొలి క్వార్టర్లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో శాంసంగ్ కంపెనీ ఆధిపత్యంలో నిలిచినట్టు రెండు మార్కెట్ రీసెర్చ్ రిపోర్టులు పేర్కొన్నాయి. అదనంగా సీబీఐ(పూర్తిగా నిర్మించిన యూనిట్లు)పై దిగుమతి డ్యూటీలను పెంచడం, భారత్‌లో ఐఫోన్ ధరలపై ప్రభావం పడింది. భారత మార్కెట్లో తన ఉత్పత్తిని పెంచుకోవడం కోసం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించడం కోసం ఆపిల్, ప్రభుత్వంతో చర్చించింది. కాగ, గత క్వార్టర్లో ఐఫోన్ ఎక్స్, ఐఫోన్8, 8 ప్లస్ లాంచ్‌తో ఆపిల్ టాప్‌లో నిలిచింది. కానీ కంపెనీ నుంచి భారత్‌కు సరుకు రవాణా 74 శాతం తగ్గింది. -
సెల్పీ కొట్టు.. ఐఫోన్ పట్టు
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్లు మరి ఇంతగా అభివృద్ధి చెందక ముందు ఫోటో దిగాలంటే...ఒకటి మన దగ్గరైనా కెమెరా ఉండాలి లేదంటే ఫోటో స్టూడియోకైనా వెళ్లాలి. మరి ఇప్పుడో...ఈ పరిస్థితి పూర్తిగా మారింది. స్మార్ట్ ఫోన్లలో ఫ్రంట్ కెమరా అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరు ఓ కెమెరామాన్ అయ్యారు. ఒక నివేదిక ప్రకారం ప్రతిరోజు కొన్నిలక్షల మంది సెల్ఫీల కోసం దాదాపు ఏడు నిమిషాల సమయం కేటాయిస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఇలాంటి వారందరికి ఒక శుభవార్త... సెల్పీలు తీసుకోవడంలో మీకు మంచి ప్రావీణ్యం ఉన్నట్లయితే ఆపిల్ ఐ ఫోన్‌ను ఉచితంగా పొందవచ్చు. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ ఈ ఐపీఎల్ సీజన్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ‘టీ20ఆన్‌ఎయిర్‌టెల్4జీ’ పోటీని నిర్వహిస్తుంది. అయితే ఈ అవకాశం కేవలం ఎయిర్టెల్ సబ్‌స్ర్కైబర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా... 1. ఎయిర్టెల్ 4జీ సిమ్‌ను తీసుకోవాలి. 2. తర్వాత ఆ సిమ్‌కార్డ్ కనిపించేలా పట్టుకొని ఒక సెల్ఫీ దిగాలి. 3. అనంతరం ఆ సెల్ఫీని సోషల్ మీడియా చానల్స్ అయిన ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో టీ20ఆన్‌ఎయిర్‌టెల్4జీ హాష్‌టాగ్‌లో పోస్టు చేయాలి. 4. ఎయిర్టెల్ ఇండియాను, మరో ముగ్గురు స్నేహితులను కూడా టాగ్ చేసి వారిని కూడా ఇదే విధంగా చేయమని చెప్పండి. వచ్చిన ఎంట్రీలలో నుంచి కంపెనీ ఏడుగురు విజేతలను ఎంపిక చేస్తుంది. వారిలో రోజుకు ఒక విజేతకు ఆపిల్ ఐఫోన్ 8ను అందించనుంది. విజేతలకు సంబంధించిన వివరాలను ఎయిర్టెల్ తన అధికారిక వెబ్‌పేజీలో ప్రకటించనుంది. విజేతలను ప్రకటించిన అనంతరం వారు 24 గంటలలోపే స్పందించి, తమ వివరాలను అందించాలి. అలా చేయని పక్షంలో డ్రాలో ఎంపికైన తరువాతి వ్యక్తికి ఐ ఫోన్8ను గెలుచుకునే అవకాశం కల్పించనున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. -
ఐఫోన్ 8కి బదులు డిటర్జెంట్ బార్
ఈ-కామర్స్ దిగ్గజాలు ఇటీవల ఒక వస్తువును ఆర్డర్ చేస్తే.. మరో వస్తువును పంపించడం లేదా రాళ్లు, రప్పలు డెలివరీ చేయడం చేస్తూ ఉన్నాయి. డెలివరీ అయిన తర్వాత వాటిని చూసుకుని వినియోగదారులు అవాక్కువతున్నారు. తాజాగా 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తబ్రేజ్ మెహబూబ్ నాగ్రాల్ కూడా అలాగే షాక్ తిన్నాడు. తనకు ఎంతో ఇష్టమైన ఐఫోన్ 8ను ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ చేస్తే.. తనకు దిమ్మతిరిగే షాకిచ్చింది ఆ కంపెనీ. ఐఫోన్ 8కి బదులు డిటర్జెంట్ బార్‌ను డెలివరీ చేసింది. ఐఫోన్ 8 కోసం ముందస్తుగానే అతను డబ్బలు కూడా చెల్లించాడు. ఫ్లిప్‌కార్ట్ చేసిన పనికి భారీగా నగదు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెంట్రల్ ముంబైలోని బైకుల్లా పోలీసు స్టేషన్లో కంపెనీకి వ్యతిరేకంగా చీటింగ్ కేసు నమోదు చేశాడు. తాను ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 8ను ఆర్డర్ చేశానని, దీని కోసం ఫుల్ పేమెంట్ రూ.55వేలను చెల్లించినట్టు తెలిపాడు. ఈ ప్రీమియం మొబైల్ ఫోన్ బదులు ఫ్లిప్‌కార్ట్ డిటర్జెంట్ బార్‌ను నావీ ముంబైకి పక్కన ఉన్న పన్వేల్‌లోని తన ఇంటికి జనవరి 22న డెలివరీ చేసినట్టు పేర్కొన్నాడు. ఫ్లిప్‌కార్ట్‌కు వ్యతిరేకంగా చీటింగ్ కేసు నమోదైనట్టు బైకుల్లా పోలీసు స్టేషన్ సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ అవినాష్ కూడా తెలిపారు. ఈ ఘటనపై తాము విచారణ జరుపుతున్నామని ఫ్లిప్‌కార్ట్ అధికార ప్రతినిధి కూడా చెప్పారు. -
ఐ ఫోన్ 8పై భారీ డిస్కౌంట్
సాక్షి, ముంబై: ఆపిల్ ఐఫోన్ ధర మరోసారి తగ్గింది. తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 8 భారీ తగ్గింపుతో ఇ-కామర్స్ సైట్ అమెజాన్ లో లభిస్తోంది. రూ.9వేల డిస్కౌంట్ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్ ఇపుడు రూ.54,999 లకే లభ్యం కానుంది. గత సెప్టెంబర్‌లో లాంచ్ అయిన దీని అసలు ధర రూ. 64 వేలు. గత రెండు వారాల్లో ఐ ఫోన్లపై ఇది రెండవ అతి భారీ తగ్గింపని టెక్ నిపుణులు భావిస్తున్నారు. గత వారం కిందటే ఐఫోన్ ఎస్ఈ (32జీబీ)ని రూ.8వేల తగ్గింపు ధరతో రూ.17,999 కు అమెజాన్ అందించింది. కాగా ఇప్పుడీ ఫోన్ ధర అమెజాన్‌లో రూ.18,899గా ఉంది. మరోవైపు విదేశీ మొబైల్స్‌పై దిగుమతి సుంకం పెంచడంతో ఇటీవల ఆపిల్ ఐ ఫోన్ 8, 8ప్లస్, ఐ ఫోన్ ఎక్స్ ఫోన్ల రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. -
ఐఫోన్ 8, 8 ప్లస్‌పై పేటీఎం భారీ క్యాష్‌బ్యాక్
న్యూఢిల్లీ : ఆపిల్ ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లు కొన్ని రోజుల క్రితమే భారత మార్కెట్లోకి లాంచ్ అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 29 నుంచి ఇవి విక్రయానికి వచ్చాయి. లాంచ్ అయిన వెంటనే ఈ స్మార్ట్ఫోన్లపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు పలు ఆఫర్లను తీసుకొచ్చాయి. తాజాగా పేటీఎం కూడా ఈ కొత్త ఐఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్లను కొనుగోలుచేసిన కస్టమర్లకు 15 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఐఫోన్ 8, 8 ప్లస్ ఏది కొనుగోలు చేసినా తొలుత ఫ్లాట్ రూ.9,000 క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. యస్ బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికైతే అదనంగా మరో రూ.6000 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం ఆఫర్ చేయనుంది. ఈ ఆఫర్ కేవలం పేటీఎం వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. నిన్నటి నుంచి వాలిడ్‌లో ఉన్న ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్, రేపటి(అక్టోబర్ 12) వరకు ఉండనుంది. క్యాష్ బ్యాక్‌లో తొలుత రూ.9000ను కొనుగోలు చేసిన 24 గంటల్లోగా వినియోగదారుల పేటీఎం అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. అనంతరం నవంబర్ 20 లేదా అంతకంటే ముందు వరకు మిగిలిన రూ.6,000 క్యాష్ బ్యాక్ రీఫండ్ అవనుంది. పేటీఎంలో రూ.61,700గా లిస్టు అయిన ఐఫోన్ 8 64జీబీ వేరియంట్ ధర రూ.9000 క్యాష్‌బ్యాక్ అనంతరం రూ.52,700గా ఉంది. అదేవిధంగా 64జీబీ వేరియంట్ ఐఫోన్ 8 ప్లస్ ధర రూ.9000 క్యాష్‌బ్యాక్ అనంతరం 61,195 రూపాయలు. 256జీబీ వేరియంట్ ఐఫోన్ 8, 8 ప్లస్ స్మార్ట్ఫోన్లు క్యాష్‌బ్యాక్ అనంతరం రూ.65,870గా, రూ.76,749గా ఉన్నాయి. ఒకవేళ యూజర్లు యస్ బ్యాంక్ యూజర్లు అయితే ఆ ధరలపై మరో 6,000 రూపాయలు తగ్గుతాయి. -
రికార్డ్స్ : ఐఫోన్ 8ను దాటేసింది
న్యూఢిల్లీ : ఐఫోన్ 8, 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్‌లు గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ అయిన రోజే, శాంసంగ్ తన గెలాక్సీ నోట్ 8ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ రిజిస్ట్రేషన్లలోనే దుమ్మురేపింది. ప్రస్తుతం విక్రయాల్లోనూ దూసుకుపోతుంది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ మించిపోయి గెలాక్సీ నోట్ 8 విక్రయాలు జరుగుతున్నాయని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. డీలర్స్ సమాచారం మేరకు ఐఫోన్ 8, 8 ప్లస్లతో పోల్చి చూస్తే గెలాక్సీ నోట్ 8 స్మార్ట్ఫోనే ముందంజలో ఉన్నట్టు తెలిసింది. 100 గెలాక్సీ నోట్ 8 ఫోన్లను వినియోగదారులు కొనుగోలు చేస్తుంటే, కేవలం 60 నుంచి 70 వరకు ఐఫోన్ 8, 8 ప్లస్‌లు అమ్ముడుపోతున్నట్టు దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ డీలర్ చెప్పారు. ఐఫోన్ 8కు, నోట్ 8కు మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉన్నట్టు మొబైల్ డివైజస్, ఎకోసిస్టమ్స్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పథక్, కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. గెలాక్సీ నోట్8, ఐఫోన్ 8 మధ్య తీవ్ర పోటీ నెలకొందని, ఒకవేళ ఐఫోన్ ఎక్స్ మార్కెట్లోకి వస్తే పరిస్థితి మారవచ్చని, ప్రస్తుతానికైతే నోట్8 భారత్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నట్టు పథక్ తెలిపారు. ఆపిల్ యూజర్లు ఐఫోన్ ఎక్స్ కోసం వేచిచూస్తున్నారన్నారు. సెప్టెంబర్ 29 నుంచి కొత్త ఐఫోన్ 8, 8 ప్లస్‌లు మార్కెట్లోకి వచ్చాయి. పెద్దగా మార్పులేమీ లేకుండా వీటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 10వ వార్షికోత్సవ సందర్భంగా తీసుకొచ్చిన స్పెషల్ ఐఫోన్ ఎక్స్ వచ్చే నెలలో మార్కెట్లోకి వస్తుంది. ఐఫోన్ 8 64జీబీ ధర రూ.64వేల కాగ, 256జీబీ వేరియంట్ ధర రూ.77వేలు. అదేవిధంగా ఐఫోన్ 8 ప్లస్ ప్రారంభ ధర రూ.73వేలుగా ఉంది. కొత్త ఆవిష్కరణలు ఏం లేకుండా వచ్చిన ఈ ఫోన్లకు అంత మొత్తంలో ధరలు పెట్టడానికి వినియోగదారులు శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్8 అమ్మకాలతో రికార్డు సృష్టించాలని చూస్తోంది. ఒకవేళ నోట్8 అమ్మకాలు ఇదే స్థాయిలో దూసుకెళ్తే శాంసంగ్‌కు ఈ ఏడాది 'రికార్డు ఇయర్' గ్యారెంటీ అని విశ్లేషకులు చెబుతున్నారు. -
స్నాప్‌డీల్ సేల్: డిస్కౌంట్లో కొత్త ఐఫోన్లు
ఈ-కామర్స్ కంపెనీల్లో ఫెస్టివల్ సీజన్ ఇంకా నడుస్తూనే ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తర్వాత స్నాప్‌డీల్ తన 'అన్‌బాక్స్ దివాలి సేల్''ను కొనసాగిస్తోంది. రెండో రౌండ్ నిర్వహిస్తున్న ఈ సేల్ నేటితో ముగియనుంది. ఈ సేల్‌లో భాగంగా ఆపిల్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఐఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులతో కొత్త ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్‌లను కొనుగోలు చేస్తే, తక్షణ డిస్కౌంట్ కింద రూ.13వేల వరకు స్నాప్‌డీల్ అందిస్తోంది. పరిమిత యూనిట్లపై ఈ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నట్టు స్నాప్‌డీల్ చెప్పింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్‌లో డిస్కౌంట్‌ను అందుబాటులో ఉంచింది. అదనంగా స్టాండర్డ్ ఛార్టడ్, యస్ బ్యాంకు కార్డులపై రూ.2500 కంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేపడితే, ఫ్లాట్ 20 శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. ప్రతికార్డుపైనా రూ.1500 వరకు డిస్కౌంట్‌ను స్నాప్‌డీల్ ఆఫర్ చేస్తోంది. అంతేకాక గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌ను 58వేల రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.22వేల వరకు ఆదాచేసుకోవచ్చు. సేల్ డేస్‌లో ఆఫర్లకు అదనంగా ఇండస్ఇండ్ బ్యాంకు హోల్డర్స్‌కు అక్టోబర్ 3 నుంచి ప్రతి మంగళవారం ఫ్లాట్ 10 శాతం తగ్గింపును ఇవ్వనుంది. అయితే రూ.1500 కంటే మించి కొనుగోలు చేపడితేనే ఈ తగ్గింపును స్నాప్‌డీల్ ఆఫర్ చేస్తుంది. -
ఐఫోన్ 8, 8 ప్లస్ బ్యాటరీలో లోపాలు
-
చౌక ధరకే.. ఐఫోన్ 8!
ఆపిల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లు భారత్‌లో రేపటి నుంచి విక్రయానికి రాబోతున్నాయి. ఈ స్మార్ట్ఫోన్లను ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ రేపు నావి ముంబైలోని లాంచ్ చేయబోతున్నారు. వీటి ప్రీ-ఆర్డర్లు కూడా దేశవ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అమెజాన్, రిలయన్స్ జియోలు ఈ రెండు హ్యాండ్సెట్లపై ఇప్పటికే ధరలను తగ్గించినట్టు ప్రకటించగా... తాజాగా ఫ్లిప్‌కార్ట్ కూడా వీటి జాబితాలో చేరిపోయింది. ఫ్లిప్‌కార్ట్ కూడా ఐఫోన్ 8 బేస్ మోడల్‌ను అత్యంత తక్కువకు రూ.31,100కే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా రూ.40,100కు తగ్గించింది. ఐఫోన్ 8 ఆఫర్లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను రూ.23 వేల వరకు అందిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ 7 ఉండి ఉంటే, దాన్ని కొత్త దానితో అప్‌గ్రేడ్ చేసుకుంటే, ధరపై రూ.20వేల ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఐఫోన్ 7 ప్లస్‌తో ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.23వేల డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఐఫోన్ 7ప్లస్‌తో ఎక్స్చేంజ్ చేసుకున్న వారికి రూ.64వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్ 8(64జీబీ వేరియంట్) రూ.41వేలకే లభ్యం కానుంది. పాత హ్యాండ్‌సెట్‌ను తీసుకున్నందుకు పికప్ ఛార్జీలుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా సిటీ క్రెడిట్ లేదా వరల్డ్ డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే, మరో 10 వేల రూపాయల క్యాష్‌బ్యాక్ లభించనుంది. అయితే ఈ ఆఫర్ కార్పొరేట్ కార్డులకు అందుబాటులో ఉండదు. ఈ ఆఫర్ కూడా ప్రీ-ఆర్డర్ లావాదేవీలకు సెప్టెంబర్ 29 సాయంత్రం 5:59 వరకు మాత్రమే వాలిడ్‌లో ఉండనుంది. 2017 డిసెంబర్ 30 కంటే వరకు ఈ క్యాష్‌బ్యాక్ మొత్తం అకౌంట్లో క్రెడిట్ అవుతుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్ ఆఫర్లన్నింటిన్నీ తీసుకుంటే, ఐఫోన్ 8 బేస్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.31,100కు, ఐఫోన్ 8 ప్లస్ బేస్ వేరియంట్ రూ.40,100కు లభ్యం కానున్నాయి. అదేవిధంగా 256జీబీ ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ వేరియంట్లు కూడా రూ.44,100కు, రూ.53,100కు కొనుగోలుచేసుకోవచ్చు. ఈ ఫోన్లను కొనుగోలు చేసే అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వ్, సిటీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, కొటక్ బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకు, స్టాండర్డ్ ఛార్టడ్, ఎస్బీఐ, యస్ బ్యాంకుల వినియోగదారులకు 12 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. అమెజాన్ కూడా ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లపై రూ.12,100 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో కూడా సిటీ బ్యాంకు కార్డులపై రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. క్యాష్‌బ్యాక్‌తో పాటు బైబ్యాక్ గ్యారెంటీని ప్రకటించింది. -
ఐఫోన్ 8, 8 ప్లస్‌ను లాంచ్ చేసేది ఎవరో తెలుసా?
సాక్షి, ముంబై : తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కంపెనీలో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన కొత్త ఐఫోన్లను భారత్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లను శుక్రవారం మధ్యాహ్నం నావి ముంబైలోని టెల్కో ప్రధాన కార్యాలయంలో ఆకాశ్ అంబానీ ఆవిష్కరించనున్నట్టు తెలిసింది. ఈ కొత్త టెల్కో జియోతో, రిలయన్స్ రిటైల్‌తో ఆపిల్ భాగస్వామ్యం ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ఐఫోన్లను ఆకాశ్ అంబానీ ఆవిష్కరిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నెలకు 799 జియో కనెక్షన్‌తో ఈ కొత్త ఐఫోన్లను కొనుగోలుచేసిన వారికి, బైబ్యాక్ గ్యారెంటీ అందుబాటులో ఉంటుంది. అంటే ఒక సంవత్సరం తర్వాత తిరిగి ఇస్తే.. వీటి అసలు కొనుగోలు ధరలో 70 శాతం తిరిగి ఇవ్వనున్నట్టు రిలయన్స్ డిజిటల్ వెల్లడించింది. అయితే కస్టమర్లు కచ్చితంగా జియో కనెక్షన్‌ను వాడాల్సి ఉంటుంది. నెలకు రూ.799తో రీఛార్జ్ చేయించుకోవాల్సిందే. ఈ కొత్త ఐఫోన్ ప్లాన్ కింద నెలకు 90జీబీ డేటాను జియో ఆఫర్ చేయనుంది. ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ కస్టమర్లందరికీ ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండింట్లోనూ ఆపిల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. రిలయన్స్ డిజిటల్, అమెజాన్ రెండు ఐఫోన్లను అధికారికంగా విక్రయిస్తున్నాయి. ఈ కొత్త ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు జియో తన కస్టమర్లకు తన వెబ్సైట్లోనూ, జియో స్టోర్‌లోనూ ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. సెప్టెంబర్ 22 -29వ తేదీల మధ్య రిలయన్స్ డిజిటల్ ద్వారా ఈ స్మార్ట్ఫోన్లను ప్రీ బుకింగ్ చేస్తే రూ.10వేల క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను జియో ప్రకటించింది. సెప్టెంబర్ 29 లాంచింగ్ సందర్భంగా ఈ క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రమే లభ్యం. -
ఐఫోన్ 8 తయారీకి ఖర్చెంత అయిందంటే...
ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐఫోన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఐఫోన్ ఎక్స్ అనే స్పెషల్ ఫోన్‌తో పాటు వీటిని కూడా ఆపిల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఐఫోన్ ఎక్స్‌తో పాటు ఈ రెండు ఐఫోన్లు కూడా చాలా ఖరీదైనవి. ధర పరంగే కాక, తయారీ విషయంలోనూ ఈ ఫోన్లు చాలా ఖర్చుతో కూడుకున్నవని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వీటిని తయారుచేయడానికి ఆపిల్ భారీ ఎత్తున్న ఖర్చు చేసినట్టు పేర్కొన్నాయి.మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ అధ్యయన రిపోర్టు ప్రకారం ఐఫోన్ ఖర్చుగా ఆపిల్ 247.51 డాలర్లను, ఐఫోన్ 8 ప్లస్ ఖర్చుగా 288.08 డాలర్లుగా వెచ్చించినట్టు తెలిసింది. అంటే దేశీయ కరెన్సీ ప్రకారం ఐఫోన్ 8 తయారీ కోసం సుమారు రూ.16వేలు, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ కోసం రూ.19వేలను ఖర్చుచేసినట్టు వెల్లడైంది. ఇది కేవలం ఈ కొత్త ఐఫోన్ల కోసం ఆపిల్ వెచ్చించిన ఖర్చులో సగ భాగం మాత్రమేనని తెలిపింది. ప్రస్తుత అధ్యయనంలో లేబర్, మార్కెటింగ్, రీసెర్చ్ వ్యయాలను కలుపలేదు. పాపులర్ హై-ఎండ్ ఫోన్ల తయారీ ఖర్చుపై ఈ అధ్యయనాన్ని ప్రతేడాది మార్కిట్ రీసెర్చ్ చేపడుతోంది. ఐఫోన్ 8 స్మార్ట్‌ఫోన్‌ను రూ.64వేల నుంచి ఆపిల్ విక్రయిస్తుండగా... ఐఫోన్ 8 ప్లస్ ధర రూ.73వేలు ఉంది. గ్లోబల్ మార్కెట్లలో అమ్మకానికి వచ్చిన ఈ రెండు స్మార్ట్ఫోన్ల ప్రీ-బుకింగ్‌లు భారత్‌లో సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్ 29 నుంచి ఇవి విక్రయానికి వస్తున్నాయి. ఐఫోన్ ఎక్స్ కూడా భారత్‌లో నవంబర్ 3 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89వేలు. అయితే ఐఫోన్ ఎక్స్ తయారీ ఖర్చును మాత్రం ఐహెచ్ఎస్ గణించలేదు. ఐఫోన్ ఎక్స్ తయారీ కోసం ఆపిల్ భారీ మొత్తంలో ఖర్చు చేసి ఉంటుందని మాత్రం ఐహెచ్ఎస్ మార్కిట్ చెప్పింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8కు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనావేస్తోంది. అంతకముందు ఐహెచ్ఎస్ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం గెలాక్సీ ఎస్8 మొత్తం తయారీ ఖర్చు 307 డాలర్లు. -
కొత్త ఐఫోన్ల ధరలు భారత్‌లో ఎంతెక్కువ?
ఐఫోన్ 10వ వార్షికోత్సవ స్పెషల్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మరో రెండు ఐఫోన్లను ఆపిల్ అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకొచ్చేసింది. మరికొన్ని రోజుల్లో కొత్త ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్‌లు భారత మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. భారత్‌లో అత్యంత ఖరీదైన ఫోన్లలో తొలిసారి ఐఫోన్ ఎక్స్ సరికొత్త బెంచ్‌మార్కును సృష్టించబోతుంది. ఈ ఫోన్ 256జీబీ వేరియంట్ ధర లక్ష మార్కును దాటేయబోతుంది. ఈ ఫోన్‌కు ముందు భారత్‌లోకి వచ్చిన ఐఫోన్ 7ఎస్ ప్లస్ 256జీబీ వేరియంటే ఇప్పటివరకు అత్యధిక ధర ట్యాగ్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం దాన్ని ఐఫోన్ ఎక్స్ దాటేస్తోంది. అయితే అమెరికాతో పోలిస్తే, భారత్‌లో ఐఫోన్ ఎక్స్ ఖరీదు చాలా ఎక్కువని తెలిసింది. ఒక్క ఐఫోన్ ఎక్స్ మాత్రమే కాక, దాంతో పాటు వచ్చిన ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ ధరలు కూడా ఆపిల్ స్వదేశ మార్కెట్‌తో పోలిస్తే, భారత్‌లో చాలా ఎక్కువని వెల్లడైంది. అమెరికాలో పన్నులు కలుపకపోవడంతో, ధరలు తక్కువగా ఉంటున్నాయని, కానీ భారత్‌లో పన్నులు వేయడం వల్ల వీటి ధరలు పెరుగుతున్నాయని రిపోర్టులు పేర్కొన్నాయి. ఐఫోన్ ఎక్స్ ధర భారత్‌లో, అమెరికాలో... ఐఫోన్ ఎక్స్ 64జీబీ వేరియంట్ ధర అమెరికాలో 999 డాలర్లు. భారత్‌లో దీని ధర 89వేల రూపాయలు. భారత్ ధరను అమెరికా డాలర్ల ప్రకారం లెక్కిస్తే 1,388 డాలర్లు. అంటే అక్కడ కంటే ఇక్కడ 39 శాతం ఎక్కువ. అదే 256జీబీ వేరియంట్‌ను తీసుకుంటే, భారత్‌లో దీని ధర రూ.1,02,000. అమెరికా 1,149 డాలర్లు. అంటే ఈ వేరియంట్ ధర కూడా 39 శాతం అధికం. ఐఫోన్ 8, ఐఫోన్8 ప్లస్ ధరలు భారత్‌లో, అమెరికాలో... ఐఫోన్ 8, 64జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర అమెరికాలో 699 డాలర్లు. భారత్‌లో 64వేలు. భారత్ ధరను అమెరికా డాలర్ల ప్రకారం లెక్కిస్తే 998 డాలర్లన్నమాట. అంటే అక్కడితో పోలిస్తే ఇక్కడ 43 శాతం అధికమని తెలిసింది. ఐఫోన్ 8, 256 జీబీ వేరియంట్‌ను తీసుకుంటే, ఈ స్మార్ట్‌ఫోన్ ధర అమెరికాలో 849 డాలర్లు, భారత్‌లో 77వేలుగా ఉంది. భారత్ ధరను అమెరికా డాలర్ల ప్రకారం లెక్కిస్తే 1200 డాలర్లు. అంటే ఈ ఫోన్‌కూడా 41 శాతం ఎక్కువని వెల్లడవుతోంది. ఆఖరికి ఐఫోన్ 8 ప్లస్ 64 జీబీ వేరియంట్ ధర అమెరికాలో 799 డాలర్లు. ఈ హ్యాండ్సెట్ భారత్‌లో రూ.73వేలుగా ఉండబోతుంది. దీన్ని కూడా అమెరికా డాలర్ల ప్రకారం లెకిస్తే 1,139 డాలర్లు. అంటే ఈ ఐఫోన్ కూడా అమెరికాతో పోలిస్తే భారత్‌లో 43 శాతం అత్యధికం. ఇక 256జీబీ వేరియంట్‌ను తీసుకుంటే, ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు అమెరికాలో 949 డాలర్లు. భారత్‌లో 86వేలు. ఈ ధర కూడా అమెరికాతో పోలిస్తే, భారత్‌లో 41 శాతం అధికంగా ఉందని తెలిసింది. ఐఫోన్ 8 మోడల్స్ ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్29న ఈ మోడల్స్ భారత్‌లో లాంచ్ కాబోతున్నాయి. ఇక అత్యంత ఖరీదైన ఐఫోన్ ఎక్స్ అక్టోబర్ 27 నుంచి ప్రీ-ఆర్డర్‌కు వచ్చి, నవంబర్ 8 నుంచి విక్రయానికి వస్తుంది. -
కొత్త ఐఫోన్లు భారత్‌లోకి వచ్చేది అప్పుడే!
ఎన్నో లీకేజీలు, మరెన్నో రూమర్ల అనంతరం ఆపిల్ తన సరికొత్త ఐఫోన్లను మంగళవారం రాత్రి కూపర్టినోలోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో ఆవిష్కరించింది. ఐఫోన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఐఫోన్X తో పాటు ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లను తన అభిమానుల ముందుకు తీసుకొచ్చింది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ అప్డేటెడ్ వెర్షన్లగా ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లు వచ్చాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లు త్వరలోనే భారత్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. ఉత్తర, తూర్పు భారతంలోని అధికారిక స్టోర్లలో సెప్టెంబర్ 17 నుంచి వీటి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయని రిటైల్ దిగ్గజం బ్రైట్‌స్టార్ ఇండియా బుధవారం రిపోర్టు చేసింది. సెప్టెంబర్ 29 నుంచి ఈ కొత్త ఐఫోన్ మోడల్స్ అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఫేసియల్ రిక్నైజేషన్‌తో వచ్చిన హైఎండ్ ఐఫోన్X, ప్రీఆర్డర్లు అక్టోబర్ 27 నుంచి ప్రారంభమవుతాయని బ్రైట్‌స్టార్ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ కూడా నవంబర్3 నుంచి స్టోర్లలోకి వస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. హైఎండ్ ఫోన్‌గా ఆవిష్కరణ అయిన ఐఫోన్ X ప్రారంభ ధర భారత్‌లో రూ.89వేలుగా ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్ల ప్రారంభ ధర రూ.64వేలని తెలిసింది. గ్లోబల్‌గా ఐఫోన్8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లు సెప్టెంబర్ 22 నుంచి విక్రయానికి వస్తున్నాయి. ఐఫోన్ 8, 64జీబీ ధర రూ.64వేలు ఐఫోన్ 8, 256 జీబీ వేరియంట్ ధర రూ.77వేలు ఐఫోన్ 8 ప్లస్, 64జీబీ వేరియంట్ ధర రూ.73వేలు ఐఫోన్ 8 ప్లస్, 256జీబీ వేరియంట్ ధర రూ.86వేలు -
ఐఫోన్ 8 ధర లక్షపైనేనా..?
ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన వార్షికోత్సవ ఎడిషన్‌గా ఐఫోన్ 8ను సెప్టెంబర్ 12న లాంచ్ చేయబోతుంది. ఈ లాంచ్ ఈవెంట్‌ను ధృవీకరించిన ఆపిల్, ఆహ్వాన పత్రికలను కూడా పంపుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ ఐఫోన్ తన అభిమానుల ముందుకు వస్తున్న సందర్భంగా ధరలు లీకయ్యాయి. కూల్ ఫీచర్లతో కూల్ ధరలో ఐఫోన్ 8 మార్కెట్లోకి వస్తుందంటూ తాజాగా రిపోర్టులు పేర్కొన్నాయి. ఐఫోన్ ప్రారంభ ధర 999 డాలర్లు ఉంటుందని, దీనిలో టాప్ ఎండ్ వేరియంట్ ఖరీదు 1199 డాలర్లని రిపోర్టులు తెలిపాయి. మూడు వేరియంట్లలో ఇది లాంచ్ కాబోతుందని ముందస్తుగానే రిపోర్టులు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో 64జీబీ వేరియంట్ ధర 999 డాలర్లు, 256జీబీ వెర్షన్ 1099 డాలర్లు, 512జీబీ వేరియంట్ ధర 1199 డాలర్లని సమాచారం. ప్రస్తుతం విడుదలైన ఈ రిపోర్టులే కనుక నిజమైతే, భారత్‌లో ఐఫోన్ 8 ధర లక్షను మించి ఉంటుందని తెలుస్తోంది. గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్ఫోన్ల ప్రారంభ ధర భారత్‌లో 60వేల రూపాయలు. అంటే ఒక్కో డాలర్ 92 రూపాయల చొప్పున లెక్కించారు. ఈ సారి కూడా ఇదేమాదిరి ధరలను తీసుకుంటే ఐఫోన్ 64జీబీ వేరియంట్ ధర భారత్‌లో 92వేల రూపాయలు, టాప్ వేరియంట్ ధర రూ.1,10,000 పైనే ఉంటుంది. ఆపిల్ ఏడాది ఐఫోన్ 10వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగానే స్పెషల్ ఎడిషన్‌గా ఐఫోన్ 8ను లాంచ్ చేస్తోంది. ఐఫోన్ 8లో ఉండబోతున్న ఫీచర్లు... 5.8 అంగుళాల డిస్ప్లే ఓలెడ్ స్క్రీన్‌తో ఇది మార్కెట్లోకి వస్తుంది. ఈ ఐఫోన్లో అతిపెద్ద మార్పు ఇదే. హైఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు ఉన్న మాదిరిగా అత్యంత పలుచనైన బెజెల్స్ 3 జీబీ ర్యామ్.. 64, 256, 512 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్లు మెరుగైన కెమెరాలు, వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ 3డీ ఫేస్ రికగ్నైజేషన్ గతకొన్నేళ్లుగా ఐఫోన్స్‌లో వస్తున్న హోమ్ బటన్ ఇందులో ఉండదు. శాంసంగ్ ఎస్8, గూగుల్ పిక్సల్ మొబైళ్ల తరహాలో వర్చువల్ హోమ్ బటన్ ఉంటుంది. ఆపిల్ వాచ్, శాంసంగ్ హైఎండ్ మొబైల్స్‌లో ఉండే వైర్లెస్ ఛార్జింగ్ సౌకర్యాన్ని ఇందులో అందిస్తున్నారు. ఐఓఎస్11 ఆపరేటింగ్ సిస్టమ్ -
ఐఫోన్ 8 మెగా ఈవెంట్: ఆపిల్ ఆహ్వానం
సాక్షి, కాలిఫోర్నియా: ఐఫోన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించబోతున్న మెగా ఈవెంట్‌పై ఆపిల్ స్పందించింది. మార్కెట్లో ఎన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నా.. ఏం మాట్లాడకుండా నిశబ్దంగా ఉన్న ఆపిల్ సెప్టెంబర్ 12న జరుగబోతున్న ఈ మెగా ఈవెంట్‌ను గురువారం ధృవీకరించేసింది. ఈ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించి, ఆహ్వానాలు కూడా పంపుతోంది. కాలిఫోర్నియా, కూపర్టినోలోని తమ కొత్త క్యాంపస్‌లో స్టీవ్ జాబ్స్ థియేటర్లో ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్టు ఆపిల్ తన ఆహ్వాన పత్రికల్లో పేర్కొంది. సగం కొరికిన ఆపిల్ కలర్‌ఫుల్ లోగోతో పాటు మెసేజ్‌ను కంపెనీ అందిస్తోంది. ''మన ప్రదేశంలో కలుసుకుందాం.. స్టీవ్ జాబ్స్‌లో థియేటర్లో నిర్వహించబోతున్న తొలి ఈవెంట్‌కు అందరూ రావాలి'' అంటూ ఆహ్వానిస్తోంది. ఆహ్వాన పత్రిక కూడా చాలా సాధారణ రూపంలో ఉంది. ఈ లాంచ్ ఈవెంట్లోనే, ఐఫోన్ ప్రత్యేక వార్షికోత్సవ ఎడిషన్ ఐఫోన్ 8ను లాంచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఐఫోన్ 8తో పాటు, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ అప్డేటెడ్ స్మార్ట్ఫోన్లు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్‌లు లాంచ్ చేస్తున్నారని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఆపిల్ కొత్త వాచ్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఐఫోన్ 8 ఇలానే ఉండబోతుందట.... 5.8 అంగుళాల డిస్ప్లే ఓలెడ్ స్క్రీన్‌తో ఇది మార్కెట్లోకి వస్తుంది. ఈ ఐఫోన్లో అతిపెద్ద మార్పు ఇదే. హైఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు ఉన్న మాదిరిగా అత్యంత పలుచనైన బెజెల్స్ 3 జీబీ ర్యామ్.. 64, 256, 512 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్లు మెరుగైన కెమెరాలు, వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ 3డీ ఫేస్ రికగ్నైజేషన్ గతకొన్నేళ్లుగా ఐఫోన్స్‌లో వస్తున్న హోమ్ బటన్ ఇందులో ఉండదు. శాంసంగ్ ఎస్8, గూగుల్ పిక్సల్ మొబైళ్ల తరహాలో వర్చువల్ హోమ్ బటన్ ఉంటుంది. ఆపిల్ వాచ్, శాంసంగ్ హైఎండ్ మొబైల్స్‌లో ఉండే వైర్లెస్ ఛార్జింగ్ సౌకర్యాన్ని ఇందులో అందిస్తున్నారు. ఐఓఎస్11 ఆపరేటింగ్ సిస్టమ్ ధర సుమారు 1000 డాలర్లు ఉంటుందని అంచనా. -
ఆపిల్ ఐఫోన్ 8 వచ్చేస్తోంది..
-
ఆపిల్ ఐఫోన్ 8 వచ్చేస్తోంది..
శాన్ఫ్రాన్సిస్కో : ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా ఆపిల్ ఎంతో గ్రాండ్ నిర్వహించబోతున్న ఈవెంట్ తేదీలు లీకయ్యాయి. సెప్టెంబర్ 12న ఆపిల్ ఈ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. ఈ ఈవెంట్లోనే టెక్ వర్గాలు, ఐఫోన్ ఫ్యాన్స్ ఎప్పడినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 8ను ఎంతో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. మూడు డివైజ్లతో ఆపిల్ ఈ ఈవెంట్లో మన ముందుకు వస్తుందని, ఒకటి ఐఫోన్ 8 కాగ, మిగతా రెండు ఐఫోన్ 7, 7 ప్లస్ అప్డేటెడ్ వెర్షన్ స్మార్ట్ఫోన్లు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్ అని వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పలు లీక్స్ ప్రకారం ఐఫోన్ 8కు భారీ డిస్ప్లేనే ఉండబోతుందని టాక్. అంతేకాక మూడు స్టోరేజ్ ఆప్షన్లలో ఇది లాంచ్ కాబోతుందని, దానిలో అత్యధికంగా 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ను ఇది కలిగి ఉంటుందట. మిగతా రెండు 64జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లను తెలిసింది. రియర్ డ్యూయల్ కెమెరా సిస్టమ్‌కు దీనికి ప్రత్యేకతగా నిలువబోతుంది. శాంసంగ్ కొత్త గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్లకు గట్టిపోటీగా ఇది మార్కెట్లోకి రాబోతుందని తెలుస్తోంది. అత్యంత ఖరీదైన ఐఫోన్ డివైజ్ కూడా ఇదే కాబోతుందట. దీని ధర 1000 డాలర్ల నుంచి ప్రారంభమవుతుందని ఇప్పటికే పలు రిపోర్టులు పేర్కొన్నాయి. పెప్టెంబర్ 12న లాంచ్ అయ్యే ఈ ఫోన్ సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. -
512జీబీ స్టోరేజ్‌తో ఐఫోన్ 8
ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్‌లో జరుగబోతున్న ఈవెంట్‌పై ఆపిల్ ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ చేయకుండా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆగస్టు మరికొన్ని రోజుల్లో ముగుస్తుండటంతో ఆపిల్ నిర్వహించబోయే ఈవెంట్‌పై టెక్ వర్గాల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఆపిల్ తన సంప్రదాయాన్ని కొనసాగిస్తుందని, సెప్టెంబర్ తొలి లేదా రెండో వారంలో నిర్వహించబోయే ఈవెంట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐఫోన్ 8ను లాంచ్చేస్తుందని టెక్ వర్గాలు నుంచి అంచనాలు వెలువడుతున్నాయి.. ఐఫోన్ 8తో పాటు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్ స్మార్ట్ఫోన్లు కూడా ఐఫోన్ అభిమానుల ముందుకు వస్తాయని పేర్కొంటున్నాయి. మరోవైపు ఐఫోన్ 8పై వస్తున్న అంచనాలు కూడా అన్నీ ఇన్నీ కావు. తాజాగా విడుదలైన లీకేజీలో ఐఫోన్ 8 గురించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఓలెడ్ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 12న లాంచ్ చేస్తారని, మూడు స్టోరేజ్ ఆప్షన్లలో ఇది మార్కెట్లలోకి వస్తుందని తెలుస్తోంది. చైనీస్ టిప్‌స్టర్ గీక్బార్ ప్రకారం ఐఫోన్ 8 స్మార్ట్‌ఫోన్ 64జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉంటుందని తెలిసింది. బేస్ వేరియంట్ స్టోరేజ్ గతేడాది లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ కంటే రెండింతలు ఎక్కువ. 64జీబీ, 256జీబీ చిప్స్ తోషిబా, శాన్డిస్క్ కు చెందినవి కాగ, 512జీబీ చిప్స్ శాంసంగ్, హైనిక్స్వి అయి ఉంటాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 12నే ఆపిల్ ఐఫోన్ 8 ఈవెంట్‌ను నిర్వహించబోతుందని మ్యాక్4ఎవర్ రిపోర్టు చెప్పింది. అదేవారంలో మూడు ఫోన్లు ప్రీ-ఆర్డర్లకు వస్తాయని తెలుస్తోంది. సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి వస్తాయట. ఇవన్నీ నిజమైతే మరికొన్ని రోజుల్లోనే ఐఫోన్ 8 మన ముందుకు రాబోతుందన్నమాట. -
ఐఫోన్ 8.. మరో ఆసక్తికర ఫోటో
ఆపిల్ ఐఫోన్8.. తన 10 వార్షికోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి విడుదల కాబోతున్న స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల గురించి టెక్ వర్గాలు, ఐఫోన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓ వైపు నుంచి ఐఫోన్ 8 పై వస్తున్న లీకేజీలు అన్నీ ఇన్నీ కావు. రోజుకో వార్త ఐఫోన్ ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంపొందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్‌తో వస్తుందంటూ ఆ సంస్థ ప్రతినిధి గతేడాది పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫోన్‌కు పవర్ అందించే వైర్లెస్ ఛార్జింగ్ మెకానిజానికి సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. చైనాలోని మోస్ట్ పాపులర్ మీడియా సైట్ వైబో ఈ ఫోటోలను విడుదల చేసింది.. డివైజ్ గ్లాస్ వెనుకాల ఈ వైర్లెస్ ఛార్జర్ కాంపొనెంట్ ఉంటుందట. ఇది డివైజ్‌కు, తన ప్లాట్‌ఫామ్‌కు మధ్య ప్రేరక శక్తిని బదిలీచేస్తుందని తెలుస్తోంది. మార్కెట్లోకి రాబోతున్న ఐఫోన్ 8తో పాటు అప్‌గ్రేడ్ కాబోతున్న ఐఫోన్ 7కు, ఐఫోన్ 7ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు కూడా వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఉండబోతుందట. ఈ ఏడాది రాబోతున్న ఐఫోన్లన్నింటికీ వైర్లెస్ ఛార్జింగ్ సామర్థ్యాలను ఆపిల్ కల్పిస్తుందని కూడా వెల్లడవుతోంది. సెప్టెంబర్‌లో జరుగబోయే స్పెషల్ ఈవెంట్లో ఆపిల్, తన ఐఫోన్ 8ను ప్రవేశపెట్టబోతుంది. దాంతో పాటు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్ స్మార్ట్ఫోన్లు కూడా లాంచ్ కాబోతున్నాయి. -
భారీ డిస్ప్లేతో ఐఫోన్ 8
ఐఫోన్ 8.. ఎంతోకాలం నుంచి ఆపిల్ ఊరిస్తున్న తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్‌పై లీకేజీలు వస్తున్న అన్నీ ఇన్నీ కావు. 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆపిల్ ఈ ఐఫోన్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఆపిల్ స్మార్ట్ఫోన్లలో మున్నుపెన్నడూ లేని సరికొత్త ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తుందని ఇప్పటికే టెక్ వర్గాలు సిగ్నల్స్ ఇచ్చేశాయి. తాజాగా మరో లీకేజీ ఈ ఫోన్‌పై మరింత ఆసక్తిని రేపుతోంది. అది ఐఫోన్ 8 స్క్రీన్ సైజు. భారీ డిస్ప్లేతో ఇది ఆపిల్ అభిమానులను అలరించబోతుందట. ప్రస్తుతమున్న ఐఫోన్ 7 స్మార్ట్‌ఫోన్ 4.7 అంగుళాల డిస్ప్లే, 5.8 అంగుళాల డిస్ప్లేలకు 1.1 అంగుళాల మేర పైకి జంప్ చేస్తుందని ఆపిల్ నుంచే ఈ లీకేజీ వచ్చేసింది. కంపెనీ సొంత సాఫ్ట్వేర్ కూడా ఈ ఊహాగానాలకు ఆమోదం తెలుపుతోంది. ఐఓఎస్ డెవలపర్ థ్రోటన్-స్మిత్ తాజాగా చేసిన ట్వీట్లో కచ్చితమైన ఐఫోన్ సైజు వివరాలను రివీల్ చేశారు. అయితే ఇది కేవలం స్క్రీన్ పాయింట్లేనని, పిక్సెల్స్ కావని కొందరంటున్నారు. ఎడ్జ్-టూ-ఎడ్జ్ ఐఫోన్‌పై స్టేటస్ బార్ వాడే మెట్రిక్స్గా ఆయన వీటిని పేర్కొన్నారు. అయితే స్మిత్ లీకేజీలను కొట్టిపారేయడానికి లేదు. ఇతను ఐఓఎస్ డెవలపర్‌గా ఉన్నారు. దీంతో తొలిసారి ఐఫోన్8 గురించి అధికారికంగా ఆపిల్ నుంచి వచ్చిన ప్రకటన ఇదేనని టెక్ వర్గాలంటున్నాయి. ఐఫోన్ 7 కంటే మాత్రం ఇది కచ్చితంగా చాలా పెద్ద డిస్ప్లేనే కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో ఎడ్జ్-టూ-ఎడ్జ్ ఐఫోన్ ప్లస్ మోడల్‌ను విడుదల చేస్తే, దాని డిస్ప్లే 7 అంగుళాలకు దగ్గర్లో ఉంటుందని కూడా సమాచారం. కాగ, ఐఫోన్ తాజాగా తీసుకురాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లో వర్చ్యువల్ హోమ్ బటన్ ఉంటుంది. -
ఐఫోన్ 8 లాంచ్ డేట్ వచ్చేసింది..
న్యూఢిల్లీ : ఆపిల్ తర్వాత తీసుకురాబోయే ప్రతిష్టాత్మకమైన ఐఫోన్ 8పై గత కొన్ని నెలలుగా వస్తున్న రూమర్లు అన్నీ ఇన్నీ కావు. ఒకసారి ఇమేజెస్, మరోసారి ఫీచర్లు, ధర ఇలా ఒక్కోసారి ఒక్కో వివరాలు లీకేజీ రూపంలో బయటపడుతున్నాయి. కానీ వాటిలో నిజమెంతో తెలియాలంటే ఐఫోన్ 8 లాంచింగ్ కోసం వేచిచూడాల్సిందే. అయితే ఐఫోన్ 8 లాంచింగ్ ఎప్పుడూ అనుకుంటున్నారా? ఆ విషయం కూడా లీకైంది. ఆపిల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 8 ఇంకో నాలుగు నెలల్లోనే లాంచ్ కానుందట. ఐఫోన్ 8 స్మార్ట్ ఫోన్ల వివరాలను అదేపనిగా లీక్ చేస్తున్న బెంజామిన్ గెస్కిన్ అనే ట్విట్టర్ అకౌంట్ ప్రస్తుతం లాంచింగ్ తేదీలను రివీల్ చేసింది. సెప్టెంబర్ 17న ఐఫోన్ 8 లాంచ్ అవుతుందని, ఆ ఫోన్ తో పాటు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్ లు కూడా లాంచ్ అవుతాయని తెలిపింది. అంతేకాక ఈ డివైజ్ ల అమ్మకాలు సెప్టెంబర్ 25 నుంచే ప్రారంభమవుతాయని కూడా వెల్లడించింది. అయితే ఈ తేదీలు అమెరికా లేదా ఇతర ప్రాంతాలకు సంబంధించిందా? అనే దానిపై స్పష్టత లేదు. వైబో కూడా ఇటీవలే ఈ ఫోన్లకు సంబంధించిన ఇమేజ్ లను లీక్ చేసింది. ఈ మూడు డివైజ్ ల ప్యానల్ డిజైన్లను ఈ ఇమేజెస్ లో చూపించింది. లుక్స్ పరంగా ఐఫోన్ 7ఎస్ ప్లస్ పొడవులో అతిపెద్దదిగా ఉండగా.. ఐఫోన్ 7ఎస్ చాలా చిన్నదిగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మధ్య స్థాయిలో ఐఫోన్ 8 ఉంది. ఐఫోన్ 7ఎస్ ప్లస్, సమాంతర డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉండగా.. ఐఫోన్ 7ఎస్ కు ఒక్కటే కెమెరా ఉంది. అదేవిధంగా ఐఫోన్ 8కు నిటారుగా రెండు వెనుక కెమెరాలు ఉన్నాయని లీకేజీలు చెబుతున్నాయి. -
ధరలతో తలపడబోతున్న స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు
పోటాపోటీగా మార్కెట్లో దూసుకెళ్తున్న స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు మరోమారు ధరలతో హోరాహోరీగా తలపడబోతున్నాయి. ఐఫోన్ కిల్లర్ గా దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ వారం క్రితమే గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ల ధర 840 డాలర్ల నుంచి 850 డాలర్ల మధ్యలో ఉండేలా అంటే దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.54,045 నుంచి రూ.54,707 వరకు నిర్ణయించింది. ప్రస్తుతం శాంసంగ్ తన కొత్త గెలాక్సీలను రంగంలోకి దింపగా.. ఆపిల్ సైతం తన కొత్త ఐఫోన్ ను త్వరలోనే తీసుకురాబోతున్నట్టు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్ ధర కూడా శాంసంగ్ కొత్త గెలాక్సీలకు సమానంగా ఉండేలా నిర్ణయిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓలెడ్ డిస్ ప్లేతో లాంచ్ కాబోతున్న హై-ఎండ్ ఐఫోన్ 8, 64జీబీ మోడల్ ప్రారంభధర ధర 850 డాలర్ల నుంచి 900 డాలర్ల మధ్యలో ఉంటుందని మ్యాక్రూమర్స్.కామ్ తెలిపింది. అంటే దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు 54,707 రూపాయల నుంచి 57,925 రూపాయలు. అదేవిధంగా ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ప్రారంభ ధరలు కూడా 649 డాలర్లు, 749 డాలర్ల వరకు నిర్ణయించనుందని పేర్కొంది. వైర్ లెస్ ఛార్జింగ్, నో ఫిజికల్ హోమ్ బటన్, 3డీ ఫేసియల్ రికగ్నైజేషన్, లేదా ఐరిస్ స్కానింగ్ ఈ కొత్త ఐఫోన్8లో ప్రత్యేకతలు. ''ట్రూ కలర్ ఐప్యాడ్ ప్రొ'' స్క్రీన్ టెక్నాలజీని కూడా మొదటిసారి వాడబోతుందని తెలుస్తోంది. అంతకముందు కూడా శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గెలాక్సీ నోట్ 7 తీసుకొచ్చిన తర్వాతనే, ఐఫోన్ తన కొత్త ఐఫోన్ 7ను రంగంలోకి దించింది. గెలాక్సీ నోట్7 పేలుళ్ల ఘటనతో తీవ్ర ఇరకాటంలో కూరుకుపోవడం, ఐఫోన్ 7కు భారీ ఎత్తున కలిసివచ్చింది. -
కొత్తకొత్త ఉత్పత్తులతో ఆపిల్ ఈవెంట్
అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఈ నెలలో కొత్త కొత్త ఉత్పత్తులతో వినియోగదారుల ముందుకు రాబోతుంది. ఈ నెల చివర్లో ఆపిల్ ఓ ఈవెంట్ ను నిర్వహించబోతుందని, ఆ ఈవెంట్లో కొత్త ఐప్యాడ్ ప్రొను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. అంతేకాక 128జీబీ స్టోరేజ్ తో అతిపెద్ద ఐఫోన్ ఎస్ఈ మోడల్ ను, కొత్త ఆపిల్ వాచ్ బ్యాండ్స్ ను ఆవిష్కరించనున్నట్టు టెక్ వర్గాల టాక్. కొత్త ఐప్యాడ్ ప్రొ మోడల్స్ ని ఈ నెలలోనే ఆవిష్కరించబోతుందని రూమర్లు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. 9.7 అంగుళాల, 12.9 అంగుళాల వెర్షన్లను అప్ డేట్ చేసిన ఆపిల్, 10.5 అంగుళాల స్లిమర్ బెజిల్స్ తో ఈ కొత్త ఐప్యాడ్ ప్రొను తీసుకురాబోతుందని టెక్ వెబ్ సైట్ మ్యాక్రూమర్స్.కామ్ రిపోర్టు చేసింది. అయితే ఈ ఐప్యాడ్ ప్రొలో హోమ్ బటన్ ఉండదట. హైయర్-రెజుల్యూషన్ డిస్ ప్లే, క్వాడ్ మైక్రోఫోన్స్ దీనిలో ఉంటాయని తెలుస్తోంది. అప్ డేట్ చేసిన 12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రొ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరాను, ప్రస్తుతమున్న 9.7 అంగుళాల మోడల్ మాదిరిగా ట్రూ టోన్ డిస్ ప్లేను కలిగి ఉంటుందని టాక్. అదేవిధంగా ఓమోలెడ్ డిస్ ప్లేతో 5.8 అంగుళాల సరికొత్త ఐఫోన్ 8 ను లాంచ్ చేయబోతున్నామని, మరో రెండు డివైజ్ లను తీసుకురాబోతున్నామని ఆపిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగతా రెండు డివైజ్ లు అప్ డేటడ్ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ లని తెలుస్తోంది. అయితే ఆపిల్ ప్రకటించిన ఈ ప్రొడక్ట్ లు కూడా ఈ ఈవెంట్లోనే వినియోగదారుల ముందుకు రావొచ్చని కొందరంటున్నారు. ఆపిల్ నిర్వహించే ఆ ఈవెంట్ మార్చి 20 సోమవారం, మార్చి 24 శుక్రవారం మధ్యలో ఉంటుందట. -
ఐఫోన్ 8 ప్రారంభ ధరెంతో తెలుసా?
న్యూఢిల్లీ : ఆపిల్ నుంచి తర్వాత రాబోతున్న ఐఫోన్ 8 పై ఇటు టెక్ లవర్స్ నుంచి అటు కంపెనీ పెట్టుబడిదారుల వరకు భారీ ఎత్తున్న ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే దీనిపై ఫుల్‌గా ప్రచారం జరుగుతోంది. ఆపిల్ ఉత్పత్తుల గురించి ఎప్పడికప్పుడూ ప్రజలకు ఎంతో కచ్చితమైన సమాచారం అందించే కేజీఐ సెక్యురిటీస్ అనలిస్ట్ మింగ్-చి కువో ఐఫోన్ 8కి సంబంధించిన కీ ఫీచర్లు, ధరను విడుదలచేశారు. పదేళ్ల సందర్భంగా తీసుకురాబోతున్న ఈ ఫోన్ ప్రారంభ ధర దాదాపు రూ.70000 వరకు ఉంటుందని కువో రిపోర్టు పేర్కొంది. ఓలెడ్ డిస్ ప్లేను కంపెనీ దీనికి పరిచయం చేయబోతున్నారని ఆయన తెలిపారు. ఆపిల్ ఇన్సైడర్ వెబ్సైట్ షేర్ చేసిన వివరాలతో కువో ఈ రిపోర్టు విడుదల చేశారు. కువో ప్రకారం ఐఫోన్ 8లో ఉండే ఫీచర్లు.. 5.8 అంగుళాల ఓలెడ్ ప్యానెల్‌ను ఇది కలిగి ఉంటుందట. హోమ్ బటన్ కూడా డిస్‌ప్లేలోనే కలిసి ఉండి, హోమ్ బటన్‌కు ఇంటిగ్రేటెడ్ టచ్ ఐడీని అమర్చుతుందని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వచ్చిన అన్ని ఐఫోన్ల కంటే ఈ ఐఫోన్ 8 బ్యాటరీ పెద్దదిగా ఉండబోతుందట. ఐఫోన్7 ప్లస్ మాదిరిగా డ్యూయల్ కెమెరాను దీనికి అమర్చుతున్నారట. 3డీ లేజార్ స్కానింగ్‌ను వాడుతూ ముఖాన్ని గుర్తించే టెక్నాలజీ దీనిలో ఉన్న కీ ఫీచర్లలో ఒకటి. కువో చెప్పిన ప్రకారం ఈ ఫోన్ ప్రారంభ ధర 1000 డాలర్లట. అయితే ఉత్పత్తి ఖర్చులు కలుపుకుని ఈ ఫోన్ ధర 50-60 శాతం పెరుగుతుందని కువో పేర్కొన్నారు. మొత్తంగా ధర రూ.70000 పైనే ఉంటుందని తెలుస్తోంది. గతేడాది ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లు ఎప్పటిలాగే రెగ్యులర్ ఎల్సీడీ స్క్రీన్లు కలిగిఉన్నాయి. -
ఐ ఫోన్ 8 ఫీచర్లపై కొత్త రూమర్లు
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ మేకర్ యాపిల్ తరువాతి ఫోన్ ఐ ఫోన్ 8 పై అనేక అంచనాలు ఇప్పటికే మార్కెట్లో నెలకొన్నాయి. ఫోన్ లవర్స్ లో విపరీతమైన ఆసక్తి రేపుతున్న ఐ ఫోన్ 8 ఫీచర్స్ పై తాజాగా మరిన్ని విశేషాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఐ ఫోన్లతో హల్ చల్ చేస్తున్న యాపిల్ వార్షికోత్సవ ఎడిషన్‌గా మూడు మోడల్స్ ఐ ఫోన్లను లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఐ ఫోన్ 8 లేదా ఐ ఫోన్ ఎక్స్ తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం తాజా యాపిల్ స్మార్ట్‌ఫోన్ 7తో పోలిస్తే వీటిని మరింత పవర్ ఫుల్ గా రూపొందిస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్స్‌తో తీసుకురానుంది. ఈ ఫీచర్లు ఇప్పుడు ఆన్లైన్లో జోరుగా వైరల్ అవుతున్నాయి. వైర్లెస్ చార్జర్ , అరగంట పాటునీళ్లలో నానినా పాడుకాని వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో పాటు కొత్తగా 3డీ టచ్ మాడ్యుల్ జోడించనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎడిషనల్ గ్రాఫైట్ షీట్ ను అదనపు ఫీచర్ గా చేర్చింది. ఓవర్ హీటింగ్ నుంచి ఫోన్ ను కాపాడేందుకుగాను ఎడిషనల్ గ్రాఫైట్ షీట్ తో ఐ ఫోన్ 8 ను డిజైన్ చేసిందట. కాగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం కొత్త ఆఫిల్ ఐ ఫోన్ -8 ఫీచర్స్ మొత్తం గ్లాస్ బాడీ, హై క్వాలిటీ గొరిల్లా గ్లాస్ , లిక్విడ్ మెటల్ ఫ్రేమ్ 6.9 ఎంఎం మందం 5.8 అంగుళాల ఓఎల్ఈడీ ఎడ్జ్ డిస్ప్లే, వైర్లెస్ చార్జింగ్, టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ రీడర్ టెక్నాలజీ, స్మార్ట్ కనెక్టర్ డ్యూయల్ 12 మెగా పిక్సల్ యాంగిల్, టెలీఫోటో లెన్స్ 3డీ కెమేరా టెక్నాలజీ పొందుపర్చినట్టు తెలుస్తోంది. అయితే ఇతర ఐ ఫోన్లతో పోలిస్తే వైర్ లెస్ చార్జర్ ఫీచర్ మరింత ఆకర్షణీయంగా మారనుంది. వైర్ లెస్ చార్జింగ్ ప్లేట్ ద్వారా దాదాపు 15 అడుగుల దూరంనుంచి దీన్ని చార్జ్ చేసుకోవచ్చని ఇటీవల రూమర్లువచ్చాయి. ఇదే నిజమైతే బ్యాటరీ పేలుళ్లతో బెంబేలెత్తుతున్న వినియోగదారులకు 3డీ టచ్ మాడ్యూల్ ఫీచర్ నిజంగా శుభవార్తే. అలాగే వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ పెద్ద విశేషంగా నిలవనుంది. -
చక్కర్లు కొడుతున్న ఐఫోన్8 ఫీచర్స్
ఆపిల్ కొత్త ఫోన్ ఐఫోన్7 ఇలా వచ్చిందో లేదో.. అప్పుడే ఐఫోన్8పై రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తర్వాత వచ్చే ఐఫోన్ ఎలా ఉండబోతుందో అప్పుడే టెక్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. వచ్చే ఏడాది ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకోబోతుందట. ఈ వార్షికోత్సవం సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండాలని ఆపిల్ ప్లాన్ చేస్తుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త డిజైన్‌లో ఐఫోన్8 లాంచ్ చేస్తుందని, వాటిలో పొందుపరిచే ఫీచర్లు చాలామటుకు కొత్తగా ఉండబోతున్నాయని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజా రూమర్ ప్రకారం తర్వాత వచ్చే ఐఫోన్లో పిజికల్ హోమ్ బటన్ ఆపిల్ తొలగిస్తుందట. ఇప్పటికే ఐఫోన్7లో ఫిజికల్ హోమ్ బటన్ పనిచేయని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా ఓ వర్చ్యువల్ బటన్‌ను ఆపిల్ పొందుపరిచింది. దీంతో వచ్చే ఐఫోన్8లో పూర్తిగా హోమ్ బటన్ తీసివేయాలని ఆపిల్ ప్లాన్ చేస్తుందట. అలాగే ఈ ఫోన్ 5 అంగుళాల స్కీన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ఐఫోన్7 స్క్రీన్ 4.7 అంగుళాలు కాగ, పెద్ద వెర్షన్ ఐఫోన్7 ప్లస్ స్క్రీన్ 5.5 అంగుళాలు. కొత్త రూమర్ల ప్రకారం ఐఫోన్ 8 మూడు స్క్రీన్ సైజుల్లో మార్కెట్లోకి అడుగు పెడుతుందట. అవి 4.7 అంగుళాలు, 5 అంగుళాలు, 5.5 అంగుళాలుగా ఉండబోతున్నాయని సమాచారం. ఆపిల్ న్యూస్‌లను ఎప్పడికప్పుడూ అప్డేట్గా పేర్కొనే ఇన్సైడర్లు మాత్రం ఈ రూమర్లను ఖండిస్తున్నారు. ఎప్పుడూరెండు సైజుల ఫోన్లనే విడుదలచేసే ట్రెండ్‌ను ఆపిల్ అలానే ఫాలోఅవుతుందని పేర్కొంటున్నారు. గత రిపోర్టుల ముందస్తు సూచనల ప్రకారం ఐఫోన్8 ఓలెడ్ డిస్ప్లేను కలిగి, అల్యూమినియంకు బదులు మొత్తం గ్లాస్‌తో డిజైన్ చేస్తున్నారని తెలిసింది. ఐఫోన్7 ముందే ఈ విషయాన్ని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది తీసుకొచ్చే ఐఫోనే, అల్యూమినియం బాడీతో రూపొందే చివరి ఫోన్ అని పేర్కొన్నాయి. -
న్యూ రీ-డిజైన్డ్ ఐఫోన్ ఎప్పుడొస్తుందో తెలుసా?
లాస్ ఏంజెల్స్ : యాపిల్ నుంచి సెప్టెంబర్‌లో రాబోతున్న రీడిజైన్ కొత్త ఐఫోన్ కోసం వేచిచూస్తున్నారా..? అయితే మీరు మరికొంత కాలం పాటు వేచిచూడాల్సిందే. ఐఫోన్ 10వ వార్షికోత్సవాన్ని యాపిల్ 2017లో జరుపుకోబోతుందంట. ఆ సెలబ్రేషన్స్ లోనే కొత్తగా రీడిజైన్ చేసిన ఫోన్‌ను ప్రవేశపెడతారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సెప్టెంబర్‌లో తీసుకొచ్చే ఫోన్, ఐఫోన్7 కాదంట. చిన్న చిన్న మార్పులతోనే ఐఫోన్ 6ఎస్ఈని మార్కెట్లోకి తీసుకొస్తారని ఓ జర్మన్ వెబ్సైట్ పేర్కొంటోంది. అయితే కంప్లీట్ రీడిజైన్ ప్రొడక్ట్‌ను యాపిల్ తన 10వ వార్షికోత్సవంలోనే ఆవిష్కరిస్తుందని యాపిల్ అనలిస్టు క్రియేటివ్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ టిమ్ బజరిన్ తెలిపారు. అయితే దాన్ని పేరు కూడా ఐఫోన్8గా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ బిగ్ రీడిజైన్ ఫోన్లో చాలా కొత్త ఫీచర్లుంటాయని, వైర్లెస్ చార్జింగ్, గ్లాస్ బాడీ అరౌండ్ మెటల్ ఫ్రేమ్, కెమెరా ఇంఫ్రూవ్‌మెంట్, ఎక్కువ మెమరీ, అమోలెడ్ 4కే స్క్రీన్లు ఈ బిగ్ రీ-డిజైన్ ప్రొడక్ట్‌లో ఉండబోతున్నాయని చెబుతున్నారు. 2017 రిలీజ్ ఐఫోన్, రెండేళ్ల మేజర్ డిజైన్ అప్ గ్రేడ్స్ కు అంతరాయం కల్గిస్తుందని పేర్కొంటున్నారు. 2014లో ఐఫోన్6తో యాపిల్ లాస్ట్ అప్ గ్రేడ్ చేపట్టింది. ఐఫోన్లలో ఇదే బెస్ట్ సెల్లింగ్ ఐఫోన్ గా నిలిచింది. తర్వాత ఏడాదిన్నరకి అదేమాదిరి డిజైన్‌తో మరో ఐఫోన్ 6ఎస్‌ను లాంచ్ చేసింది. డిజైన్‌లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, కొన్ని కొత్త ఫీచర్లను ఈ ఫోన్‌కు యాపిల్ జోడించింది. మరోవైపు యాపిల్ బిగ్ రీ-డిజైన్ 2017కు పోస్ట్ పోన్ అయిందని చైనీస్ తయారీదారులు సూచిస్తున్నట్టు జర్మన్ యాపిల్ న్యూస్ సైట్ పేర్కొంది. అదేవిధంగా ప్రొడక్ట్ అప్ గ్రేడ్ కాలం కూడా ఇక మూడేళ్లు కాబోతుందని నిక్కీ ఆసియన్ రివ్యూ రిపోర్టు పేర్కొంది. సెప్టెంబర్ 16న ఐఫోన్ 6ఎస్ఈ ప్రవేశపెడతారని, దాంతో పాటు కొత్త ఐప్యాడ్, యాపిల్ వాచ్, ఐఓఎస్10ను ఆవిష్కరిస్తుందని తెలుస్తోంది. తర్వాత రాబోతున్న ఐఫోన్లన్నీ యాపిల్ ఏ10 ప్రాసెసర్, 2/4జీ ర్యామ్ వేరియంట్లు, బిగ్గర్ బ్యాటరీస్లతో ఉంటాయట. అలాగే సెప్టెంబర్‌లో వచ్చే ఫోన్ రెండు వేరియంట్లలో కాదంట. మూడు వేరియంట్లలో ఈ ఫోన్ వస్తుందట.