ఐఫోన్8కి బదులు డిటర్జెంట్ బార్ డెలివరీ
ఈ-కామర్స్ దిగ్గజాలు ఇటీవల ఒక వస్తువును ఆర్డర్ చేస్తే.. మరో వస్తువును పంపించడం లేదా రాళ్లు, రప్పలు డెలివరీ చేయడం చేస్తూ ఉన్నాయి. డెలివరీ అయిన తర్వాత వాటిని చూసుకుని వినియోగదారులు అవాక్కువతున్నారు. తాజాగా 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తబ్రేజ్ మెహబూబ్ నాగ్రాల్ కూడా అలాగే షాక్ తిన్నాడు. తనకు ఎంతో ఇష్టమైన ఐఫోన్ 8ను ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ చేస్తే.. తనకు దిమ్మతిరిగే షాకిచ్చింది ఆ కంపెనీ. ఐఫోన్ 8కి బదులు డిటర్జెంట్ బార్‌ను డెలివరీ చేసింది. ఐఫోన్ 8 కోసం ముందస్తుగానే అతను డబ్బలు కూడా చెల్లించాడు. ఫ్లిప్‌కార్ట్ చేసిన పనికి భారీగా నగదు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సెంట్రల్ ముంబైలోని బైకుల్లా పోలీసు స్టేషన్‌లో కంపెనీకి వ్యతిరేకంగా చీటింగ్ కేసు నమోదు చేశాడు.
తాను ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 8ను ఆర్డర్ చేశానని, దీని కోసం ఫుల్ పేమెంట్ రూ.55వేలను చెల్లించినట్టు తెలిపాడు. ఈ ప్రీమియం మొబైల్ ఫోన్ బదులు ఫ్లిప్‌కార్ట్ డిటర్జెంట్ బార్‌ను నావీ ముంబైకి పక్కన ఉన్న పన్వేల్‌లోని తన ఇంటికి జనవరి 22న డెలివరీ చేసినట్టు పేర్కొన్నాడు. ఫ్లిప్‌కార్ట్‌కు వ్యతిరేకంగా చీటింగ్ కేసు నమోదైనట్టు బైకుల్లా పోలీసు స్టేషన్ సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ అవినాష్ కూడా తెలిపారు. ఈ ఘటనపై తాము విచారణ జరుపుతున్నామని ఫ్లిప్‌కార్ట్ అధికార ప్రతినిధి కూడా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment