detergent soap
-
HUL Price Hike: ఇక ఇప్పుడు సబ్బులు, డిటర్జెంట్ల వంతు
ఇప్పటికే పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంట నూనెల ధరల పెంపుతో సతమతం అవుతున సామాన్యుడి నెత్తిన పడేందుకు మరో ధరల పిడుగు సిద్ధంగా ఉంది. పామాయిల్ కొరతతో ఎదురవుతున్న ఇబ్బందులు వంటగదిని దాటి బాత్రూమ్ని చేరాయి. ఇప్పటికే వంట నూనెల ధరతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు సబ్బులు మరో షాక్ ఇవ్వనున్నాయి. పామ్ ఆయిల్ ఎఫెక్ట్ సబ్బు తయారీలో పామ్ ఆయిల్ ఉత్పత్తులు ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా పామ్ ఆయిల్ దిగుబడి తగ్గిపోయింది. దీంతో పామ్ ఆయిల్ ఉత్పత్తుల రేట్లు పెరిగాయి. ఈ కారణాన్ని చూపుతూ స్నానపు సబ్బులు, బట్టల సబ్బులు, డిటర్జెంట్ పౌడర్ల ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. యూనీలీవర్ నిర్ణయం దేశంలోనే అతి పెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీ అయిన హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ తన ఉత్పత్తులపై రేట్లు పెంచాలని నిర్ణయించినట్టు సీఎన్‌బీసీ పేర్కొంది. స్నానపు సబ్బులు, డిటర్జెంట్ సబ్బులు, పౌడర్ల ధరలను కనీసం 3.5 శాతం నుంచి 14 శాతం వరకు పెంచేందుకు సిద్ధమైంది. గ్రాముల్లో తగ్గింపు ప్రీమియం కేటగిరి, ఎక్కుడ డిమాండ్ ఉన్న ఐటమ్స్ విషయంలో ధరలు పెంచేందుకు హిందూస్థాన్ యూనిలీవర్ మొగ్గుచూపుతుండగా సాచెట్స్, తక్కువ ధరకు లభించే ఐటమ్స్ విషయంలో ధరల పెంపుకు సుముఖంగా లేదు. అయితే ధరల పెంపుకు బదులు ఆయా వస్తువుల సైజు తగ్గించాలని నిర్ణయించింది. అల్పాదాయ వర్గాలకు చెందిన వినియోగదారుడిపై నేరుగా భారం పడకుండా గ్రాముల్లో కోత విధించనుంది. చదవండి: ఇకపై వాటిని మిల్క్ అంటే కుదరదు! ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక!! -
వాషింగ్‌పౌడర్ నిర్మా.. వెనుక పెను విషాదం
చనిపోయిన కూతురి జ్ఞాపకార్థం ఓ తండ్రి చేసిన ప్రయత్నం నలభై వేల కోట్ల విలువైన కంపెనీగా రూపుదిద్దుకుంది. ఇంతకీ ఆ పాప అసలు పేరు నిరుపమ.. ముద్దు పేరు నిర్మా... ఆమె తండ్రి పేరు కర్సన్భాయ్ పటేల్. సాక్షి, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగిగా మంచి జీతం, చదువుకు తగ్గట్టు ఓ చిన్న వ్యాపారం. చీకుచింత లేకుండా సాగిపోతున్న కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. కారు ప్రమాదం రూపంలో కన్న తండ్రికి కూతురిని దూరం చేసింది. అయితే కూతురి పేరు చిరస్థాయిగా నిలిచి పోయేందుకు ఆ తండ్రి చేసిన ప్రయత్నం ప్రపంచ రికార్డుకు కారణమైంది. నలభై వేల కోట్ల విలువైన కంపెనీ స్థాపనకు మూలమైంది. పద్నాలుగు వేలమందికి ఉపాధిని కల్పిస్తోంది. ఇంటి వెనుక షెడ్డులో రసాయన శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గుజరాత్ రాష్ట్ర మైనింగ్‌శాఖలో ఉద్యోగిగా కర్సన్భాయ్ పటేల్ చేరాడు. అయితే బుర్రంతా రసాయన శాస్త్రంతో నిండిపోవడంతో ఊరికే ఉండలేకపోయాడు. ఎప్పుడూ రసాయనాలతో కుస్తీ పడుతుండే వాడు. ఆ క్రమంలోనే 1969లో సోడా యాష్కి మరికొన్ని కెమికల్స్ కలిపితే మాసిన బట్టలను తళతళ మెరిసేలా చేయగలిగే పౌడర్ రూపుదిద్దుకుంది. ఇంటి వెనుకాల షెడ్డులోనే డిటర్జెంట్ పౌడర్ తయారీలో తలమునకలైపోయేవాడు కర్సన్భాయ్. ఎప్పుడైనా పని నుంచి విరామం దొరికితే కూతురు నిరుపమతో ఆటపాటలే అతని ప్రపంచం. ఊహించని విషాదం ఓవైపు గవర్నమెంటు ఉద్యోగం, మరోవైపు కెమికల్ ఇంజనీరుగా సరికొత్త డిటర్జెంట్ పౌడర్ ఆవిష్కరణ ... ముద్దులొలికే కూతురు... ఇలా సాఫీగా సాగిపోతున్న కర్సన్భాయ్ జీవితంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆయన ముద్దుల కూతురు నిరుపమ కారు యాక్సిడెంట్లో చనిపోయింది. ఒక్కసారిగా ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయింది. నిర్మాకు శ్రీకారం ఓవైపు తనలోని ప్రతిభతో ఎంట్రప్యూనర్‌గా ఎదగాలన్న తపన, మరోవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు దూరమైందన్న వేదన కర్సన్‌భాయ్‌ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు తనను చుట్టుముట్టిన రెండు ఆలోచనలను ఏకం చేసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన డిటర్జెంట్ పౌడర్‌కి తన ముద్దుల కూతురు నిరుపమ ముద్దు పేరైన నిర్మా పేరు పెట్టాడు. ఉద్యోగానికి రాజీనామా నిర్మాను ఎలాగైనా వృద్ధిలోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి వరకు కార్లలో తిరిగిన వాడు ఒక్కసారిగా సైకిల్‌పైకి మారిపోయి ఇంటింటికి తిరుగుతూ నిర్మా డిటర్జెంట్‌ని పరిచయం చేశాడు. అప్పటి వరకు మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న బహుళజాతి సంస్థకు చెందిన డిటర్జెంట్ పౌడర్‌లో మూడో వంతు ధరకే అంటే నిర్మా డిటర్జెంట్ పౌడర్‌ను కేజీ రూ.3 లకే అమ్మడం ప్రారంభించాడు. ధర తక్కువ, నాణ్యత ఎక్కువగా ఉండటంతో గుజరాత్లో నిర్మా బ్రాండ్ ఊహించని స్థాయికి ఎదిగింది. జింగిల్ మ్యాజిక్ ఎనభైవ దశకంలో దూరదర్శన్ ప్రసారాలు దేశమంతటా విస్తరించాయి. దీన్ని అనువుగా మార్చుకుని కర్సన్భాయ్ రూపొందించిన వాషింగ్ పౌడర్ నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ సాగే జింగిల్ (అడ్వర్టైజ్మెంట్) దేశాన్ని ఉప్పెనలా చుట్టేసింది. పాలలోని తెలుపు నిర్మాతో వస్తుందనే స్లోగన్ గృహిణిలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ జింగల్ ఎఫెక్ట్‌తో దేశంలోనే నంబర్ వన్ బ్రాండ్‌గా మారింది నిర్మా. మధ్య తరగతి ప్రజల ఇళ్లలో తప్పనిసరి ఐటమ్‌గా మారింది. కూతురిపై ప్రేమ నిర్మా అడ్వెర్టైజ్మెంట్ ఆ స్థాయిలో సక్సెస్ కావడానికి కారణం కూతురిపై కర్సన్‌భాయ్‌కి ఉన్న ప్రేమ. అప్పటికే నిర్మా పేరుతో జనం మధ్యన కనిపిస్తున్న తన కూతురు రూపం చిరస్థాయిగా నిలిచిపోయేలా యాడ్‌ను డిజైన్ చేశాడు. ముందుగా తెల్ల గౌనులో ఓ పాపను గుండ్రంగా తిప్పించి.. ఈ స్టిల్ ఫ్రీజ్ చేసే సమయంలో తన కూతురు చిత్రం వచ్చేలా ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ బాగా వర్క్అవుట్ అయ్యింది. ఓ దశలో నిర్మా పేరు తెలియని వారు, చదవడం రాని వారు కూడా పాప బొమ్మ ఉన్న డిటెర్జెంట్ పౌడర్ అడిగి మరీ కొనుక్కునేలా ఆ యాడ్ క్లిక్ అయ్యింది. నంబర్‌వన్ 2004 నాటికే దేశంలో నంబర్ వన్ బ్రాండ్‌గా కొనసాగుతూ సాలీనా 8 లక్షల టన్నుల డిటర్జెంట్ పౌడర్ తయారు చేస్తున్న సంస్థగా నిర్మా రికార్డు సృష్టించింది. నిర్మా కంపెనీ ప్రత్యక్షంగా 14 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. పరోక్షంగా లక్ష మందికి పైగా జీవనాధారం అయ్యింది. విద్యారంగంలో నిర్మా నిర్మా బ్రాండ్‌ని దేశంలోనే నంబర్ వన్‌గా మార్చిన తర్వాత తన కూతురి జ్ఞాపకాలను మరింత సజీవంగా ఉంచుకునేందుకు విద్యారంగంలోకి కర్సన్భాయ్ పటేల్ ఎంట్రీ ఇచ్చారు. అహ్మదాబాద్‌లో 1995లో నిర్మా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో ఫార్మసీ కాలేజీ స్థాపించారు. దీన్నే 2003లో నిర్మా యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేశారు. 40 వేల కోట్లకు పైమాటే ఫోర్బ్స్ వివరాల ప్రకారం 2019లో రూ, 42,000 కోట్ల రూపాయల ఆస్తులతో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో ఇండియా పరంగా 30వ స్థానంలో ప్రపంచ స్థాయిలో 775వ స్థానంలో కర్సన్భాయ్ నిలిచారు. 2010లో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. ప్రస్తుతం నిర్మా వ్యవహారాలను ఆయన కొడుకులు, కోడల్లు చూసుకుంటున్నారు. -
సబ్బు నీటితో చెలగాటం వద్దు
మొక్కజొన్న రైతులను అల్లాడిస్తున్న కత్తెర పురుగును చంపడానికి సబ్బు, డిటర్జెంట్ నీళ్లను సుడిలో పిచికారీ చేస్తే చాలు పురుగు ఖతం అని తెలియజెప్పే వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బట్టలుతికే సబ్బు పొడి కలిపిన నీటిని పోసీపొయ్యగానే కత్తెర పురుగు విలవిల్లాడుతూ నిమిషాలలో చనిపోతుండడంలోనూ ఎటువంటి సందేహం లేదు కూడా. కానీ, సబ్బుపొడి ద్రావణం పిచికారీ వలన కత్తెర పురుగుతో పాటు మొక్కజొన్న పంట కూడా మాడిపోతున్న వాస్తవం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బట్టలు ఉతకడానికి తయారు చేసిన సబ్బులు, సబ్బుపొడులను పంటలపై ప్రయోగించడం తగదని మెదక్ జిల్లాలోని డా. రామానాయుడు–ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డా. గున్నంరెడ్డి శ్యామ సుందర్‌రెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. బట్టలు ఉతకడానికి వాడే సబ్బులు, సబ్బు పొడుల తయారీలో వాడే రసాయనాలు మొక్కలపై తీవ్ర ప్రభావాలను చూపగలవన్నారు. సబ్బులు, సబ్బు పొడులను కీటకనాశనులుగా వాడటం దాదాపు 200 ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ, మొక్కలపై వాడే సబ్బు పొడుల తయారీలోనూ, ఎంపికలోనూ, వాడవలసిన మోతాదులోనూ ప్రత్యేకమైనవని గుర్తించాలి. కత్తెర పురుగు నివారణకు సబ్బు పొడి నీటిని వాడిన కొందరు రైతుల క్షేత్రాలలో మొక్కజొన్న మొక్కలు దెబ్బతినడం గమనించిన డా. శ్యామ సుందర్ రెడ్డి, కెవికె క్షేత్రంలోని మొక్కజొన్నపై లీటరు నీటికి 5 గ్రాముల సబ్బుపొడి నుంచి 50 గ్రాముల వరకు వివిధ మోతాదులలో ప్రయోగించి పరిశీలించారు. మోతాదు పెరుగుతున్నకొద్దీ.. మొక్కపై దుష్ప్రభావం కోలుకోలేనంత ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. సబ్బు ద్రావణం పిచికారీ చేసిన కొద్ది నిమిషాల తర్వాత సగం మొక్కలపై మంచి నీటిని పిచికారీ చేశారు. ఆ మొక్కల పరిస్థితి కొంచెం నయమనిపించినప్పటికీ, మిగతా మొక్కల పరిస్థితి ప్రమాదరకరంగానే ఉందని చెప్పారు. కాబట్టి, కత్తెర పురగు నివారణకు సబ్బు పొడి ద్రావణం వాడకపోవడం మంచిదనే అభిప్రాయం వెలిబుచ్చారు. మొక్కజొన్న సుడులను మట్టి, ఇసుక, రాతిపొడి, వరిపొట్టు వంటి మొక్కలకు హాని కలగని పదార్థాలతో నింపి, వాటిని మెటారైజియం లేదా ఇ.పి.ఎన్. లేదా బి.టి. బాక్టీరియా ద్రావణాలతో తడిపితే కత్తెర పురుగును సమర్థవంతంగా రసాయన రహితంగా నిర్మూలించవచ్చని గత ఏడాది తాము ప్రయోగ పూర్వకంగా నిరూపించిన విషయాన్ని డా. శ్యామ సుందర్ రెడ్డి(99082 24649) ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
ఐఫోన్ 8కి బదులు డిటర్జెంట్ బార్
ఈ-కామర్స్ దిగ్గజాలు ఇటీవల ఒక వస్తువును ఆర్డర్ చేస్తే.. మరో వస్తువును పంపించడం లేదా రాళ్లు, రప్పలు డెలివరీ చేయడం చేస్తూ ఉన్నాయి. డెలివరీ అయిన తర్వాత వాటిని చూసుకుని వినియోగదారులు అవాక్కువతున్నారు. తాజాగా 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తబ్రేజ్ మెహబూబ్ నాగ్రాల్ కూడా అలాగే షాక్ తిన్నాడు. తనకు ఎంతో ఇష్టమైన ఐఫోన్ 8ను ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ చేస్తే.. తనకు దిమ్మతిరిగే షాకిచ్చింది ఆ కంపెనీ. ఐఫోన్ 8కి బదులు డిటర్జెంట్ బార్‌ను డెలివరీ చేసింది. ఐఫోన్ 8 కోసం ముందస్తుగానే అతను డబ్బలు కూడా చెల్లించాడు. ఫ్లిప్‌కార్ట్ చేసిన పనికి భారీగా నగదు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెంట్రల్ ముంబైలోని బైకుల్లా పోలీసు స్టేషన్లో కంపెనీకి వ్యతిరేకంగా చీటింగ్ కేసు నమోదు చేశాడు. తాను ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 8ను ఆర్డర్ చేశానని, దీని కోసం ఫుల్ పేమెంట్ రూ.55వేలను చెల్లించినట్టు తెలిపాడు. ఈ ప్రీమియం మొబైల్ ఫోన్ బదులు ఫ్లిప్‌కార్ట్ డిటర్జెంట్ బార్‌ను నావీ ముంబైకి పక్కన ఉన్న పన్వేల్‌లోని తన ఇంటికి జనవరి 22న డెలివరీ చేసినట్టు పేర్కొన్నాడు. ఫ్లిప్‌కార్ట్‌కు వ్యతిరేకంగా చీటింగ్ కేసు నమోదైనట్టు బైకుల్లా పోలీసు స్టేషన్ సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ అవినాష్ కూడా తెలిపారు. ఈ ఘటనపై తాము విచారణ జరుపుతున్నామని ఫ్లిప్‌కార్ట్ అధికార ప్రతినిధి కూడా చెప్పారు. -
ట్యాబ్ కొంటే సబ్బు బిళ్ల పంపారు
యడ్లపాడు (గుంటూరు): ఆన్లైన్ షాపింగ్‌లో ట్యాబ్ బుక్ చేసుకుంటే సబ్బు బిళ్ల చేతికి వచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా యడ్లపాడు రాజీవ్‌గాంధీ సెంటర్‌కు చెందిన టైలర్ భాస్కర్ ఫిబ్రవరి 16న సోలో కంపెనీ ట్యాబ్‌ను స్నాప్‌డీల్ ద్వారా బుక్ చేశాడు. అది సరిగ్గా నాలుగు రోజులకు చిలకలూరిపేట బ్లూడార్ట్ కొరియర్ సెంటర్‌కు వచ్చింది. అదే నెల 21న బ్లూడాట్ సెంటర్లో రూ.4వేలు డబ్బులు చెల్లించిన భాస్కర్ అక్కడే బాక్స్ తెరిచి చేసి చూశాడు. అంతే... అందులో డిటర్జెంట్ సబ్బు ఉండటాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. సబ్బుతో పాటు ఇయర్ ఫోన్, బ్యాటరీ ఉన్నాయి కానీ ట్యాబ్ లేదు. ఇదేమని ప్రశ్నిస్తే కొరియర్ వారు తమకు సంబంధం లేదని చెప్పడంతో యడ్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... ఎస్సై ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దిగ్గజాలకు దడ పుట్టించారు...!
బహుళజాతి సంస్థలతో ‘ఈటా’ పోటీ తెలంగాణ, సీమ ఊళ్లలో ఇంటింటా ఆదరణ రాష్ట్రంలో తొలి సబ్బుల తయారీ కంపెనీ ఇదే రూ.10 లక్షల నుంచి 100 కోట్ల టర్నోవర్‌కు త్వరలో మరిన్ని రకాల కొత్త ఉత్పాదనలు భుజాన సబ్బుల సంచీతో ఓ దుకాణానికెళ్లాడాయన. తమ డిటర్జెంట్ సబ్బు అమ్మిపెడితే మంచి కమీషన్ ఇస్తానన్నాడు. ఆయన్ను ఎగాదిగా చూసిన దుకాణదారు.. ‘‘ఏమయ్యా ఎవరు కొంటారు మీ సబ్బుని? పెద్దపెద్ద బ్రాండ్లున్న ఈ రంగంలో, కొత్త పేరుతో వచ్చిన మీ సబ్బును బంగారు నాణెం పెట్టి అమ్మనా ఎవరూ కొనరు. తెలుసా?’’ అంటూ కటువుగా చెప్పాడు. కానీ ఆయన వెళ్లలేదు. దుకాణంలో టేబుల్ తుడిచే బట్ట తీసుకున్నాడు. నిండా మసిబారి ఉన్న ఆ బట్టను తమ సబ్బుతో తానే ఉతికి చూపించాడు. అప్పటికి దుకాణదారుకు అర్థమైంది ఆ సబ్బు నాణ్యత. అర్థమయ్యాక ఇక మాట్లాడలేదు. తన సబ్బు పనితనాన్ని చూపిన వ్యక్తి కిషోర్ చంద్ చోర్డియా. ఆ సబ్బు పేరు ఈటా. కిషోర్‌చంద్ చోర్డియాది రాష్ట్రానికి వచ్చి స్థిరపడిన మార్వాడీల కుటుంబం. 1981 దాకా ఆయన వివిధ కంపెనీల వస్తువులకు డీలర్‌గా ఉన్నారు. అప్పుడే ఆయనకో ఆలోచన వచ్చింది. ఉత్పాదక రంగంలోకి తానెందుకు అడుగు పెట్టకూడదని! రంగంలోకి దిగాడు. 1981లో ‘ఈటా’తో మార్కెట్లోకి వచ్చాడు. తొలి ఏడాది టర్నోవరు రూ.10 లక్షలు. ఇప్పుడది రూ.100 కోట్లను దాటిపోయింది. ఒకవైపు బహుళ జాతి కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులతో మార్కెట్లను ముంచెత్తుతూ, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నా... పెద్దగా ప్రచారార్భాటం లేకుండానే ‘ఈటా’ ఇంటింటి సబ్బుగా మారింది. పెద్ద బ్రాండ్లను దీటుగా ఎదుర్కొంది. రాష్ట్రంలో తెలంగాణ, రాయలసీమ పల్లెల్లో ఈ పేరు తెలియని కుటుంబం ఉండదంటే అతిశయోక్తి కాదు. పంపిణీ నుంచి మొదలై...: 1981లో ఈ కిషోర్‌సన్స్ డిటర్జెంట్స్ కంపెనీని స్థాపించారు చోర్డియా. హైదరాబాద్ సమీపంలోని తిమ్మాపూర్‌లో కంపెనీకి ప్లాంటుంది. ఈటా బ్రాండ్‌తో తొలుత డిటర్జెంట్లు తయారు చేసిన కంపెనీ... తరవాత కొబ్బరి నూనె, వాషింగ్ పౌడర్, డిష్ వాష్ బార్లను ఒ క్కొక్కటిగా తెచ్చింది. అంతర్గత వనరుల ద్వారా సంస్థను విస్తరి ంచారు. కిషోర్‌చంద్ కుమారులైన సురేందర్ చంద్, మహేందర్ చంద్, గౌతమ్ చంద్, నేమి చంద్, ధరమ్ చంద్, ప్రకాశ్ చంద్‌లు కంపెనీలో ఒక్కో విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు మూడో తరం ప్రవేశించింది. స్టీలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లోనూ అడుగు పెట్టారు. ప్రత్యక్షంగా వెళ్లి... మొదట్లో కిషోర్ చంద్ కుమారులు చిన్న చిన్న ఊళ్లకు నేరుగా వెళ్లేవారు. బట్టలు ఉతికి చూపించి మరీ తమ సబ్బు గురించి చెప్పేవారు. అలా అన్ని దుకాణాల కు ఈటా చేరింది. 1981లో 125 గ్రాముల ఈటా సబ్బు ధర రూ.2.20. ఇపుడది రూ.8. ‘‘దిగ్గజ కంపెనీల ప్రీమియం సబ్బులకు ఏమాత్రం తీసిపోని నాణ్యత కొనసాగిస్తున్నాం. ధర అంటారా...! పోటీ కంపెనీతో పోలిస్తే చాలా తక్కువ. నాణ్యతే మా బ్రాండ్ ఇమేజ్’’ అంటారు కంపెనీ డెరైక్టర్ గౌతమ్‌చంద్ జైన్. ‘‘ప్రీమియం బ్రాండ్‌తో పోటీపడ్డ తొలి భారతీయ కంపెనీ మాదే. రాష్ట్రంలో తొలి సబ్బుల తయారీ కంపెనీ కూడా మాదే. ముడి పదార్థాలను మేమే తయారు చేసుకుంటాం. తయారీ విధానం మాకు ప్రత్యేకం’’ అని మరో డెరైక్టర్ ప్రకాశ్ చంద్ వివరించారు. కొత్త విభాగాల్లోకి..: కంపెనీ ఉత్పత్తుల సంఖ ్య 2012 నాటికి 25 మాత్రమే. ఇప్పుడు 40కి పెరిగింది. ఈటాతో పాటు సూపర్ హిట్, ఫుల్ మూన్, న్యూ మూన్, హిట్ బ్రాండ్లు మార్కెట్లో హడావుడి చేస్తున్నాయి. రోజుకు 300 టన్నుల సబ్బులు, పౌడర్‌ను తయారు చేసే సామర్థ్యం కంపెనీకి ఉంది. నెలకు 80 టన్నుల కొబ్బరి నూనె విక్రయిస్తోంది. వినియోగ వస్తువుల రంగంలో కొత్త అవకాశాలను అందుకోవడానికి మూడవ తరం రంగంలోకి దిగింది. చందనం, నిమ్మ ఫ్లేవర్‌లో ఒంటి సబ్బులను ఫిబ్రవరిలో ప్రవేశపెడుతున్నట్టు సువ్రత్ చంద్ వెల్లడించారు. తిమ్మాపూర్‌లో రూ.3 కోట్లతో సబ్బుల తయారీ ప్లాంటును కొత్తగా ఏర్పాటు చేశారు. కిషోర్ చంద్ చోర్డియా ఐ సెంటర్ ద్వారా పేదలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు.