ఐఫోన్ 8 ప్రారంభ ధరెంతో తెలుసా?
న్యూఢిల్లీ : ఆపిల్ నుంచి తర్వాత రాబోతున్న ఐఫోన్ 8 పై ఇటు టెక్ లవర్స్ నుంచి అటు కంపెనీ పెట్టుబడిదారుల వరకు భారీ ఎత్తున్న ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే దీనిపై ఫుల్గా ప్రచారం జరుగుతోంది. ఆపిల్ ఉత్పత్తుల గురించి ఎప్పడికప్పుడూ ప్రజలకు ఎంతో కచ్చితమైన సమాచారం అందించే కేజీఐ సెక్యురిటీస్ అనలిస్ట్ మింగ్-చి కువో ఐఫోన్ 8కి సంబంధించిన కీ ఫీచర్లు, ధరను విడుదలచేశారు. పదేళ్ల సందర్భంగా తీసుకురాబోతున్న ఈ ఫోన్ ప్రారంభ ధర దాదాపు రూ.70000 వరకు ఉంటుందని కువో రిపోర్టు పేర్కొంది. ఓలెడ్ డిస్ ప్లేను కంపెనీ దీనికి పరిచయం చేయబోతున్నారని ఆయన తెలిపారు. ఆపిల్ ఇన్సైడర్ వెబ్సైట్ షేర్ చేసిన వివరాలతో కువో ఈ రిపోర్టు విడుదల చేశారు.
కువో ప్రకారం ఐఫోన్ 8లో ఉండే ఫీచర్లు.. 5.8 అంగుళాల ఓలెడ్ ప్యానెల్ను ఇది కలిగి ఉంటుందట. హోమ్ బటన్ కూడా డిస్ప్లేలోనే కలిసి ఉండి, హోమ్ బటన్కు ఇంటిగ్రేటెడ్ టచ్ ఐడీని అమర్చుతుందని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వచ్చిన అన్ని ఐఫోన్ల కంటే ఈ ఐఫోన్ 8 బ్యాటరీ పెద్దదిగా ఉండబోతుందట. ఐఫోన్7 ప్లస్ మాదిరిగా డ్యూయల్ కెమెరాను దీనికి అమర్చుతున్నారట. 3డీ లేజార్ స్కానింగ్ను వాడుతూ ముఖాన్ని గుర్తించే టెక్నాలజీ దీనిలో ఉన్న కీ ఫీచర్లలో ఒకటి. కువో చెప్పిన ప్రకారం ఈ ఫోన్ ప్రారంభ ధర 1000 డాలర్లట. అయితే ఉత్పత్తి ఖర్చులు కలుపుకుని ఈ ఫోన్ ధర 50-60 శాతం పెరుగుతుందని కువో పేర్కొన్నారు. మొత్తంగా ధర రూ.70000 పైనే ఉంటుందని తెలుస్తోంది. గతేడాది ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్లు ఎప్పటిలాగే రెగ్యులర్ ఎల్సీడీ స్క్రీన్లు కలిగిఉన్నాయి.