సాక్షి, కాలిఫోర్నియా: ఐఫోన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించబోతున్న మెగా ఈవెంట్‌పై ఆపిల్ స్పందించింది. మార్కెట్‌లో ఎన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నా.. ఏం మాట్లాడకుండా నిశబ్దంగా ఉన్న ఆపిల్ సెప్టెంబర్ 12న జరుగబోతున్న ఈ మెగా ఈవెంట్‌ను గురువారం ధృవీకరించేసింది. ఈ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించి, ఆహ్వానాలు కూడా పంపుతోంది. కాలిఫోర్నియా, కూపర్టినోలోని తమ కొత్త క్యాంపస్‌లో స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్టు ఆపిల్ తన ఆహ్వాన పత్రికల్లో పేర్కొంది. సగం కొరికిన ఆపిల్ కలర్‌ఫుల్ లోగోతో పాటు మెసేజ్‌ను కంపెనీ అందిస్తోంది.
- 5.8 అంగుళాల డిస్‌ప్లే
- ఓలెడ్ స్క్రీన్‌తో ఇది మార్కెట్‌లోకి వస్తుంది. ఈ ఐఫోన్‌లో అతిపెద్ద మార్పు ఇదే.
- హైఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు ఉన్న మాదిరిగా అత్యంత పలుచనైన బెజెల్స్
- 3 జీబీ ర్యామ్.. 64, 256, 512 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్లు
- మెరుగైన కెమెరాలు, వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్
- 3డీ ఫేస్ రికగ్నైజేషన్
- గతకొన్నేళ్లుగా ఐఫోన్స్‌లో వస్తున్న హోమ్ బటన్ ఇందులో ఉండదు. శాంసంగ్ ఎస్8, గూగుల్ పిక్సల్ మొబైళ్ల తరహాలో వర్చువల్ హోమ్ బటన్ ఉంటుంది.
- ఆపిల్ వాచ్, శాంసంగ్ హైఎండ్ మొబైల్స్‌లో ఉండే వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యాన్ని ఇందులో అందిస్తున్నారు.
- ఐఓఎస్11 ఆపరేటింగ్ సిస్టమ్
- ధర సుమారు 1000 డాలర్లు ఉంటుందని అంచనా.