ఐఫోన్ 8 లాంచ్ డేట్ వచ్చేసింది..
ఐఫోన్ 8 లాంచ్ డేట్ వచ్చేసింది..
Published Fri, May 26 2017 7:00 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
న్యూఢిల్లీ : ఆపిల్ తర్వాత తీసుకురాబోయే ప్రతిష్టాత్మకమైన ఐఫోన్ 8పై గత కొన్ని నెలలుగా వస్తున్న రూమర్లు అన్నీ ఇన్నీ కావు. ఒకసారి ఇమేజెస్, మరోసారి ఫీచర్లు, ధర ఇలా ఒక్కోసారి ఒక్కో వివరాలు లీకేజీ రూపంలో బయటపడుతున్నాయి. కానీ వాటిలో నిజమెంతో తెలియాలంటే ఐఫోన్ 8 లాంచింగ్ కోసం వేచిచూడాల్సిందే. అయితే ఐఫోన్ 8 లాంచింగ్ ఎప్పుడూ అనుకుంటున్నారా? ఆ విషయం కూడా లీకైంది. ఆపిల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 8 ఇంకో నాలుగు నెలల్లోనే లాంచ్ కానుందట. ఐఫోన్ 8 స్మార్ట్ ఫోన్ల వివరాలను అదేపనిగా లీక్ చేస్తున్న బెంజామిన్ గెస్కిన్ అనే ట్విట్టర్ అకౌంట్ ప్రస్తుతం లాంచింగ్ తేదీలను రివీల్ చేసింది. సెప్టెంబర్ 17న ఐఫోన్ 8 లాంచ్ అవుతుందని, ఆ ఫోన్ తో పాటు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్ లు కూడా లాంచ్ అవుతాయని తెలిపింది.
అంతేకాక ఈ డివైజ్ ల అమ్మకాలు సెప్టెంబర్ 25 నుంచే ప్రారంభమవుతాయని కూడా వెల్లడించింది. అయితే ఈ తేదీలు అమెరికా లేదా ఇతర ప్రాంతాలకు సంబంధించిందా? అనే దానిపై స్పష్టత లేదు. వైబో కూడా ఇటీవలే ఈ ఫోన్లకు సంబంధించిన ఇమేజ్ లను లీక్ చేసింది. ఈ మూడు డివైజ్ ల ప్యానల్ డిజైన్లను ఈ ఇమేజెస్ లో చూపించింది. లుక్స్ పరంగా ఐఫోన్ 7ఎస్ ప్లస్ పొడవులో అతిపెద్దదిగా ఉండగా.. ఐఫోన్ 7ఎస్ చాలా చిన్నదిగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మధ్య స్థాయిలో ఐఫోన్ 8 ఉంది. ఐఫోన్ 7ఎస్ ప్లస్, సమాంతర డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉండగా.. ఐఫోన్ 7ఎస్ కు ఒక్కటే కెమెరా ఉంది. అదేవిధంగా ఐఫోన్ 8కు నిటారుగా రెండు వెనుక కెమెరాలు ఉన్నాయని లీకేజీలు చెబుతున్నాయి.
Advertisement
Advertisement