iPhone 7s
-
ఐఫోన్ 8 మెగా ఈవెంట్: ఆపిల్ ఆహ్వానం
సాక్షి, కాలిఫోర్నియా: ఐఫోన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించబోతున్న మెగా ఈవెంట్‌పై ఆపిల్ స్పందించింది. మార్కెట్లో ఎన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నా.. ఏం మాట్లాడకుండా నిశబ్దంగా ఉన్న ఆపిల్ సెప్టెంబర్ 12న జరుగబోతున్న ఈ మెగా ఈవెంట్‌ను గురువారం ధృవీకరించేసింది. ఈ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించి, ఆహ్వానాలు కూడా పంపుతోంది. కాలిఫోర్నియా, కూపర్టినోలోని తమ కొత్త క్యాంపస్‌లో స్టీవ్ జాబ్స్ థియేటర్లో ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్టు ఆపిల్ తన ఆహ్వాన పత్రికల్లో పేర్కొంది. సగం కొరికిన ఆపిల్ కలర్‌ఫుల్ లోగోతో పాటు మెసేజ్‌ను కంపెనీ అందిస్తోంది. ''మన ప్రదేశంలో కలుసుకుందాం.. స్టీవ్ జాబ్స్‌లో థియేటర్లో నిర్వహించబోతున్న తొలి ఈవెంట్‌కు అందరూ రావాలి'' అంటూ ఆహ్వానిస్తోంది. ఆహ్వాన పత్రిక కూడా చాలా సాధారణ రూపంలో ఉంది. ఈ లాంచ్ ఈవెంట్లోనే, ఐఫోన్ ప్రత్యేక వార్షికోత్సవ ఎడిషన్ ఐఫోన్ 8ను లాంచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఐఫోన్ 8తో పాటు, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ అప్డేటెడ్ స్మార్ట్ఫోన్లు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్‌లు లాంచ్ చేస్తున్నారని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఆపిల్ కొత్త వాచ్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఐఫోన్ 8 ఇలానే ఉండబోతుందట.... 5.8 అంగుళాల డిస్ప్లే ఓలెడ్ స్క్రీన్‌తో ఇది మార్కెట్లోకి వస్తుంది. ఈ ఐఫోన్లో అతిపెద్ద మార్పు ఇదే. హైఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు ఉన్న మాదిరిగా అత్యంత పలుచనైన బెజెల్స్ 3 జీబీ ర్యామ్.. 64, 256, 512 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్లు మెరుగైన కెమెరాలు, వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ 3డీ ఫేస్ రికగ్నైజేషన్ గతకొన్నేళ్లుగా ఐఫోన్స్‌లో వస్తున్న హోమ్ బటన్ ఇందులో ఉండదు. శాంసంగ్ ఎస్8, గూగుల్ పిక్సల్ మొబైళ్ల తరహాలో వర్చువల్ హోమ్ బటన్ ఉంటుంది. ఆపిల్ వాచ్, శాంసంగ్ హైఎండ్ మొబైల్స్‌లో ఉండే వైర్లెస్ ఛార్జింగ్ సౌకర్యాన్ని ఇందులో అందిస్తున్నారు. ఐఓఎస్11 ఆపరేటింగ్ సిస్టమ్ ధర సుమారు 1000 డాలర్లు ఉంటుందని అంచనా. -
వినూత్న ఫీచర్లతో ఐఫోన్ 7ఎస్!
శాన్ఫ్రాన్సిస్కో: త్వరలో యాపిల్ అభిమానులను పలకరించనున్న ఐఫోన్ 7ఎస్, 7ఎస్ ప్లస్‌తోపాటు ఐఫోన్8 మోడళ్లలో వినూత్న ఫీచర్లు దర్శనమివ్వనున్నాయి. వీటికి సంబంధించి ఇవే ఫొటోలు అంటూ ఆన్లైన్లో కొన్ని దర్శనమిస్తున్నాయి. ఫోన్ల వెనుక భాగం గ్లాస్‌తోపాటు వీటిలో వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉండనుందని తెలుస్తోంది. ఈ 3 మోడళ్లను యాపిల్ వచ్చే నెలలో విడుదల చేయనుందన్న వార్తలు రాగా, 2018 ప్రారంభం వరకు రాకపోవచ్చన్న విరుద్ధ వార్తలు కూడా వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ వీటి విడుదలకు సంబంధించి సెప్టెంబర్ నాటికి స్పష్టత వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఐఫోన్ 8 లాంచ్ డేట్ వచ్చేసింది..
న్యూఢిల్లీ : ఆపిల్ తర్వాత తీసుకురాబోయే ప్రతిష్టాత్మకమైన ఐఫోన్ 8పై గత కొన్ని నెలలుగా వస్తున్న రూమర్లు అన్నీ ఇన్నీ కావు. ఒకసారి ఇమేజెస్, మరోసారి ఫీచర్లు, ధర ఇలా ఒక్కోసారి ఒక్కో వివరాలు లీకేజీ రూపంలో బయటపడుతున్నాయి. కానీ వాటిలో నిజమెంతో తెలియాలంటే ఐఫోన్ 8 లాంచింగ్ కోసం వేచిచూడాల్సిందే. అయితే ఐఫోన్ 8 లాంచింగ్ ఎప్పుడూ అనుకుంటున్నారా? ఆ విషయం కూడా లీకైంది. ఆపిల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 8 ఇంకో నాలుగు నెలల్లోనే లాంచ్ కానుందట. ఐఫోన్ 8 స్మార్ట్ ఫోన్ల వివరాలను అదేపనిగా లీక్ చేస్తున్న బెంజామిన్ గెస్కిన్ అనే ట్విట్టర్ అకౌంట్ ప్రస్తుతం లాంచింగ్ తేదీలను రివీల్ చేసింది. సెప్టెంబర్ 17న ఐఫోన్ 8 లాంచ్ అవుతుందని, ఆ ఫోన్ తో పాటు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్ లు కూడా లాంచ్ అవుతాయని తెలిపింది. అంతేకాక ఈ డివైజ్ ల అమ్మకాలు సెప్టెంబర్ 25 నుంచే ప్రారంభమవుతాయని కూడా వెల్లడించింది. అయితే ఈ తేదీలు అమెరికా లేదా ఇతర ప్రాంతాలకు సంబంధించిందా? అనే దానిపై స్పష్టత లేదు. వైబో కూడా ఇటీవలే ఈ ఫోన్లకు సంబంధించిన ఇమేజ్ లను లీక్ చేసింది. ఈ మూడు డివైజ్ ల ప్యానల్ డిజైన్లను ఈ ఇమేజెస్ లో చూపించింది. లుక్స్ పరంగా ఐఫోన్ 7ఎస్ ప్లస్ పొడవులో అతిపెద్దదిగా ఉండగా.. ఐఫోన్ 7ఎస్ చాలా చిన్నదిగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మధ్య స్థాయిలో ఐఫోన్ 8 ఉంది. ఐఫోన్ 7ఎస్ ప్లస్, సమాంతర డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉండగా.. ఐఫోన్ 7ఎస్ కు ఒక్కటే కెమెరా ఉంది. అదేవిధంగా ఐఫోన్ 8కు నిటారుగా రెండు వెనుక కెమెరాలు ఉన్నాయని లీకేజీలు చెబుతున్నాయి. -
పెంపుడు కుక్కకు ఎనిమిది ఐఫోన్ 7ఎస్‌లు
బీజింగ్: ఐఫోన్ గిఫ్ట్ గా వస్తుందనగానే అబ్బ.. అని గబుక్కున మనసులో ఓ ఆశ పుడుతుంది. అలాంటిది ఏకంగా ఎనిమిది ఐఫోన్లు గిప్ట్గా వస్తున్నాయంటే ఇంకెలా ఉంటుంది. ఎగిరి గంతేయరు.. సాధారణంగా మనుషులైతే ఇలాగే చేస్తారు.. కానీ ఆ ఫోన్లు గిఫ్ట్‌గా వచ్చింది ఓ పెంపుడు కుక్కకు. అది కూడా కొత్త వెర్షన్ ఐఫోన్లు. ఈ మధ్య ఆపిల్ సంస్థ విడుదల చేసిన ఐఫోన్ 7ఎస్ ఫోన్లు. వాటిని దర్జాగా తన ముందు పెట్టుకొని హుందాగా సోఫాలో కూర్చుని తన యజమానికి తానంటే ఎంతిష్టమో ఓ స్టిల్ తో చెప్పేసింది ఆ కుక్క. ఇది చేసింది చైనాలోని అత్యంత ధనవంతుడైన వాంగ్ జియాన్లిన్ అనే వ్యక్తి కుమారుడు. వాంగ్ జియాన్ లిన్(61) అనే వ్యక్తి చైనాలో అతిపెద్ద కుభేరుడు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం అతడికి 30 బిలియన్ డాలర్ల ఆస్తితో చైనాలో మిక్కిలి ధనవంతుడిగా ఉన్నాడు. అతడికి వాంగ్ సికాంగ్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ తండ్రికి ఇతనొక్కడే కొడుకు. అతడిని ఎంత గారభంగా పెంచాడో ఈ కుర్రాడికి ఉన్న 'కోకో' అనే పెంపుడు కుక్క ఉంది. దానికోసం అతడు చేసే హంగామా అంతా ఇంత కాదు. దాని పుట్టిన రోజు వచ్చినా మరేదైనా సందర్భం వచ్చినా కనీసం మనుషులకు కూడా చేయనంత గొప్పగా ఆ కార్యక్రమం నిర్వహిస్తాడు. కోకోకు ప్రత్యేక డ్రెస్, ప్రత్యేక షూ, కళ్లజోడు, టోపీ, హ్యాండ్ బ్యాగ్, గోల్డ్ చైన్, ప్రత్యేక ఫుడ్ ఇలా చెప్పుకుంటూ వెళితే ఓ చాంతాడంత లిస్టే ఉంది. ఇంత రాజభోగాలు అనుభవిస్తున్న ఆ కుక్కకు ఈ మధ్యే ఆపిల్ విడుదల చేసిన ఎనిమిది ఐఫోన్ 7ఎస్‌లు గిఫ్ట్ గా ఇచ్చి ఆ ఫొటోలను ఆన్ లైన్ లో పెట్టగా అదిప్పుడు పెద్ద వైరల్ గా మారి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు ఈ కుక్కకు రెండు ఆపిల్ వాచ్‌లు కూడా ఉన్నాయి. దీని బాధ్యతలు చూసుకునేందుకు సిబ్బంది కూడా ఉన్నారట. ఓ అంఛనా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత విలువైన సేవలతో రాజభోగాలు అనుభవిస్తున్న పెంపుడు కుక్క ఇదేనని తెలుస్తోంది.