
వినూత్న ఫీచర్లతో ఐఫోన్ 7ఎస్!
శాన్‌ఫ్రాన్సిస్కో: త్వరలో యాపిల్ అభిమానులను పలకరించనున్న ఐఫోన్ 7ఎస్, 7ఎస్ ప్లస్‌తోపాటు ఐఫోన్8 మోడళ్లలో వినూత్న ఫీచర్లు దర్శనమివ్వనున్నాయి. వీటికి సంబంధించి ఇవే ఫొటోలు అంటూ ఆన్‌లైన్‌లో కొన్ని దర్శనమిస్తున్నాయి. ఫోన్ల వెనుక భాగం గ్లాస్‌తోపాటు వీటిలో వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉండనుందని తెలుస్తోంది. ఈ 3 మోడళ్లను యాపిల్ వచ్చే నెలలో విడుదల చేయనుందన్న వార్తలు రాగా, 2018 ప్రారంభం వరకు రాకపోవచ్చన్న విరుద్ధ వార్తలు కూడా వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ వీటి విడుదలకు సంబంధించి సెప్టెంబర్ నాటికి స్పష్టత వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.