జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ | TDP Petition Return On Janasena Glass Symbol, More Details Inside | Sakshi
Sakshi News home page

జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ

Published Thu, May 9 2024 10:45 AM | Last Updated on Thu, May 9 2024 12:18 PM

TDP Petition Return On Janasena Glass Symbol

హైకోర్టు అనుమతి మంజూరు

సాక్షి, అమరావతి: గాజుగ్లాసు గుర్తు విషయంలో తెలుగుదేశం పార్టీ వెనక్కితగ్గింది. తమ పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీచేస్తున్నాయని, అందు­వల్ల రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో గాజుగ్లాసు గుర్తును జన­సేన పార్టీకే రిజర్వ్‌ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను టీడీపీ ఉపసంహరించుకుంది. 

ఇప్పటికే ఓటింగ్‌ ప్రక్రియ మొద­­లైందని, ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి రాజ్యాంగం అంగీకరించ­­దంటూ ఎన్ని­కల సంఘం నివేదించడంతో హై­­కోర్టు ఆ దిశగా ఉత్తర్వులివ్వడానికి సిద్ధమైంది. దీంతో టీడీపీకి పరిస్థితి అర్థమైంది. తమ పిటి­షన్‌ను కొట్టేయడం ఖాయమన్న నిర్ణయా­నికి వచ్చింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకోవా­ల­ని నిర్ణ­యించి, హైకోర్టు అను­మతి కోరింది. 

వెంటనే హైకోర్టు పిటిషన్‌ ఉప­సంహరణకు అను­మతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ ఉత్తర్వులి­చ్చారు. పొత్తు నేపథ్యంలో గాజు­గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్య­ర్థులకుగానీ, గుర్తి­ంపులేని రిజిస్టర్డ్‌ పార్టీల­కుగానీ కేటాయించకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ మధ్య­ంతర ఉత్తర్వులు జారీచేయా­లంటూ టీడీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.రు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement