కొరియన్ చర్మానికి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. పైగా అందుకు సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నాయి కూడా. అయితే అవన్నీ ఆ బ్రాండ్‌లకు తగ్గ రేంజ్ ధరల్లోనే ఉంటాయనేది తెలిసిందే. అలా కాకుండా మనకున్న అందుబాటులోని వనరులతో కూడా కొరియన్ గ్లాస్ చర్మాన్ని పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!
వెదుర రసంతో కొరియన్ల లాంటి గ్లాస్ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చక్కగా వారిలా ప్రకాశవంతమైన మచ్చలేని చర్మాన్ని సొంతం చేసుకోవచ్చట. వెదురు సారం ముఖాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తుందట. ఇందులో ఉండే సిలికాన్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఖనిజంలా పనిచేస్తుంది. చర్మాన్ని దృఢంగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్ది వచ్చే సిలికా స్థాయిలు తగ్గుతాయి.
ముడతలు వచ్చి చర్మం ఆకృతి మారిపోయి, వృధాప్య సంకేచ్చేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాంటివి రాకూడదంటే చర్మ సంరక్షణలో భాగంగా వెదురు సారాన్ని ముఖానికి అప్లై చేస్తే సిలికా స్థాయిలు పెరగడమే గాక యవ్వనవంతమైన మెరిసే చర్మ మీ సొంతం అవుతుంది. దీనిలో ఉండే హైడ్రేటింగ్, మాయిశ్చరైజింగ్ కారకాలు చర్మాన్ని బొద్దుగా , మృదువుగా చేస్తాయి.
ఇందులో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మంలోని తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ముడతలు, గీతలు వంటివి పడకుండా ఉండేలా రిపేర్ చేస్తుంది. పొడి చర్మం వారికి ఈ వెదురుసారం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే చర్మంపై ఉండే మంట, చికాకులను దూరం చేస్తుంది. వెదురుసారం శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను కలిగి ఉంది.
అకాల వృద్ధాప్యం, నీరసానికి దారితీసే కాలుష్యం, యూవీ కిరణాలు వంటి పర్యావరణ నష్టం నుంచి చర్మాన్ని రక్షించే యాంటీఆక్సిడిడెంట్లు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇది సహజ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. ఎర్రటి మెటిమలు, చికాకు వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతేగాదు వెదురుసారంలో ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్లు ఉన్నాయి. ఇవి నిస్తేజంగా అయిపోయిన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, కోమలంగా మారుస్తుంది.
ఈ వెదురుసారానికి హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, కలబంద వంటి ఇతర హైడ్రేటింగ్ పదార్థాలను జోడిస్తే మరింత తొందరగా కొరియన్ గ్లాస్ చర్మాన్ని పొందగలరని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఈ వెదురు సారం పొడిగా లేదా ద్రవ రూపంలో వినియోగించవచ్చు. దీన్ని మీకు ఇష్టమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులకు జోడించడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: అంతుపట్టని ఆ వ్యాధిని పది సెకన్లలో నిర్థారించిన పనిమనిషి..! షాక్‌లో వైద్యుడు)
Comments
Please login to add a commentAdd a comment