టెక్ దిగ్గజం ఆపిల్‌కు గుడ్‌న్యూస్ వెలువడింది. ఈ వారంలో ప్రకటించిన త్రైమాసికపు ఫలితాల్లో ఐఫోన్ ఎక్స్ బెస్టింగ్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్ ఎక్స్ విక్రయాల్లో ఎలా ఉంటుందో అని మార్కెట్ విశ్లేషకులు, కంపెనీ పలు సందేహ పడింది. కానీ వారందరి సందేహాలను బద్దలు కొడుతూ.. 2018 తొలి క్వార్టర్‌లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ ఎక్స్ నిలిచినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 16 మిలియన్ యూనిట్ల ఐఫోన్ ఎక్స్‌లను రవాణా చేసినట్టు సీనెట్ రిపోర్టులు పేర్కొన్నాయి. ఐఫోన్ ఎక్స్‌తో పాటు లాంచ్ చేసిన ఐఫోన్ 8 కేవలం 12.5 మిలియన్ యూనిట్లు మాత్రమే రవాణా జరుగగా.. ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 8.3 మిలియన్ యూనిట్లు రవాణా జరిగింది.
ఆపిల్ ప్రకటించిన ఈ ఫలితాలు వాల్‌స్ట్రీట్ అంచనాలను కూడా బీట్ చేశాయి. అయితే భారత మార్కెట్‌లో మాత్రం ఆపిల్ మార్కెట్ షేరు తగ్గింది. 2018 తొలి క్వార్టర్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో శాంసంగ్ కంపెనీ ఆధిపత్యంలో నిలిచినట్టు రెండు మార్కెట్ రీసెర్చ్ రిపోర్టులు పేర్కొన్నాయి. అదనంగా సీబీఐ(పూర్తిగా నిర్మించిన యూనిట్లు)పై దిగుమతి డ్యూటీలను పెంచడం, భారత్‌లో ఐఫోన్ ధరలపై ప్రభావం పడింది. భారత మార్కెట్‌లో తన ఉత్పత్తిని పెంచుకోవడం కోసం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించడం కోసం ఆపిల్, ప్రభుత్వంతో చర్చించింది. కాగ, గత క్వార్టర్‌లో ఐఫోన్ ఎక్స్, ఐఫోన్8, 8 ప్లస్ లాంచ్‌తో ఆపిల్ టాప్‌లో నిలిచింది. కానీ కంపెనీ నుంచి భారత్‌కు సరుకు రవాణా 74 శాతం తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment