iPhone 8 Plus
-
ఆపిల్‌కు గుడ్‌న్యూస్ : ఆ ఫోన్ దంచికొట్టింది
టెక్ దిగ్గజం ఆపిల్‌కు గుడ్‌న్యూస్ వెలువడింది. ఈ వారంలో ప్రకటించిన త్రైమాసికపు ఫలితాల్లో ఐఫోన్ ఎక్స్ బెస్టింగ్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ ఎక్స్ విక్రయాల్లో ఎలా ఉంటుందో అని మార్కెట్ విశ్లేషకులు, కంపెనీ పలు సందేహ పడింది. కానీ వారందరి సందేహాలను బద్దలు కొడుతూ.. 2018 తొలి క్వార్టర్లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ ఎక్స్ నిలిచినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 16 మిలియన్ యూనిట్ల ఐఫోన్ ఎక్స్‌లను రవాణా చేసినట్టు సీనెట్ రిపోర్టులు పేర్కొన్నాయి. ఐఫోన్ ఎక్స్‌తో పాటు లాంచ్ చేసిన ఐఫోన్ 8 కేవలం 12.5 మిలియన్ యూనిట్లు మాత్రమే రవాణా జరుగగా.. ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 8.3 మిలియన్ యూనిట్లు రవాణా జరిగింది. ఆపిల్ ప్రకటించిన ఈ ఫలితాలు వాల్‌స్ట్రీట్ అంచనాలను కూడా బీట్ చేశాయి. అయితే భారత మార్కెట్లో మాత్రం ఆపిల్ మార్కెట్ షేరు తగ్గింది. 2018 తొలి క్వార్టర్లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో శాంసంగ్ కంపెనీ ఆధిపత్యంలో నిలిచినట్టు రెండు మార్కెట్ రీసెర్చ్ రిపోర్టులు పేర్కొన్నాయి. అదనంగా సీబీఐ(పూర్తిగా నిర్మించిన యూనిట్లు)పై దిగుమతి డ్యూటీలను పెంచడం, భారత్‌లో ఐఫోన్ ధరలపై ప్రభావం పడింది. భారత మార్కెట్లో తన ఉత్పత్తిని పెంచుకోవడం కోసం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించడం కోసం ఆపిల్, ప్రభుత్వంతో చర్చించింది. కాగ, గత క్వార్టర్లో ఐఫోన్ ఎక్స్, ఐఫోన్8, 8 ప్లస్ లాంచ్‌తో ఆపిల్ టాప్‌లో నిలిచింది. కానీ కంపెనీ నుంచి భారత్‌కు సరుకు రవాణా 74 శాతం తగ్గింది. -
ఐఫోన్ 8, 8 ప్లస్‌పై పేటీఎం భారీ క్యాష్‌బ్యాక్
న్యూఢిల్లీ : ఆపిల్ ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లు కొన్ని రోజుల క్రితమే భారత మార్కెట్లోకి లాంచ్ అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 29 నుంచి ఇవి విక్రయానికి వచ్చాయి. లాంచ్ అయిన వెంటనే ఈ స్మార్ట్ఫోన్లపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు పలు ఆఫర్లను తీసుకొచ్చాయి. తాజాగా పేటీఎం కూడా ఈ కొత్త ఐఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్లను కొనుగోలుచేసిన కస్టమర్లకు 15 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఐఫోన్ 8, 8 ప్లస్ ఏది కొనుగోలు చేసినా తొలుత ఫ్లాట్ రూ.9,000 క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. యస్ బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికైతే అదనంగా మరో రూ.6000 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం ఆఫర్ చేయనుంది. ఈ ఆఫర్ కేవలం పేటీఎం వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. నిన్నటి నుంచి వాలిడ్‌లో ఉన్న ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్, రేపటి(అక్టోబర్ 12) వరకు ఉండనుంది. క్యాష్ బ్యాక్‌లో తొలుత రూ.9000ను కొనుగోలు చేసిన 24 గంటల్లోగా వినియోగదారుల పేటీఎం అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. అనంతరం నవంబర్ 20 లేదా అంతకంటే ముందు వరకు మిగిలిన రూ.6,000 క్యాష్ బ్యాక్ రీఫండ్ అవనుంది. పేటీఎంలో రూ.61,700గా లిస్టు అయిన ఐఫోన్ 8 64జీబీ వేరియంట్ ధర రూ.9000 క్యాష్‌బ్యాక్ అనంతరం రూ.52,700గా ఉంది. అదేవిధంగా 64జీబీ వేరియంట్ ఐఫోన్ 8 ప్లస్ ధర రూ.9000 క్యాష్‌బ్యాక్ అనంతరం 61,195 రూపాయలు. 256జీబీ వేరియంట్ ఐఫోన్ 8, 8 ప్లస్ స్మార్ట్ఫోన్లు క్యాష్‌బ్యాక్ అనంతరం రూ.65,870గా, రూ.76,749గా ఉన్నాయి. ఒకవేళ యూజర్లు యస్ బ్యాంక్ యూజర్లు అయితే ఆ ధరలపై మరో 6,000 రూపాయలు తగ్గుతాయి. -
ఐఫోన్ 8, 8 ప్లస్ బ్యాటరీలో లోపాలు
-
చౌక ధరకే.. ఐఫోన్ 8!
ఆపిల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లు భారత్‌లో రేపటి నుంచి విక్రయానికి రాబోతున్నాయి. ఈ స్మార్ట్ఫోన్లను ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ రేపు నావి ముంబైలోని లాంచ్ చేయబోతున్నారు. వీటి ప్రీ-ఆర్డర్లు కూడా దేశవ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అమెజాన్, రిలయన్స్ జియోలు ఈ రెండు హ్యాండ్సెట్లపై ఇప్పటికే ధరలను తగ్గించినట్టు ప్రకటించగా... తాజాగా ఫ్లిప్‌కార్ట్ కూడా వీటి జాబితాలో చేరిపోయింది. ఫ్లిప్‌కార్ట్ కూడా ఐఫోన్ 8 బేస్ మోడల్‌ను అత్యంత తక్కువకు రూ.31,100కే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా రూ.40,100కు తగ్గించింది. ఐఫోన్ 8 ఆఫర్లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను రూ.23 వేల వరకు అందిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ 7 ఉండి ఉంటే, దాన్ని కొత్త దానితో అప్‌గ్రేడ్ చేసుకుంటే, ధరపై రూ.20వేల ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఐఫోన్ 7 ప్లస్‌తో ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.23వేల డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఐఫోన్ 7ప్లస్‌తో ఎక్స్చేంజ్ చేసుకున్న వారికి రూ.64వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్ 8(64జీబీ వేరియంట్) రూ.41వేలకే లభ్యం కానుంది. పాత హ్యాండ్‌సెట్‌ను తీసుకున్నందుకు పికప్ ఛార్జీలుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా సిటీ క్రెడిట్ లేదా వరల్డ్ డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే, మరో 10 వేల రూపాయల క్యాష్‌బ్యాక్ లభించనుంది. అయితే ఈ ఆఫర్ కార్పొరేట్ కార్డులకు అందుబాటులో ఉండదు. ఈ ఆఫర్ కూడా ప్రీ-ఆర్డర్ లావాదేవీలకు సెప్టెంబర్ 29 సాయంత్రం 5:59 వరకు మాత్రమే వాలిడ్‌లో ఉండనుంది. 2017 డిసెంబర్ 30 కంటే వరకు ఈ క్యాష్‌బ్యాక్ మొత్తం అకౌంట్లో క్రెడిట్ అవుతుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్ ఆఫర్లన్నింటిన్నీ తీసుకుంటే, ఐఫోన్ 8 బేస్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.31,100కు, ఐఫోన్ 8 ప్లస్ బేస్ వేరియంట్ రూ.40,100కు లభ్యం కానున్నాయి. అదేవిధంగా 256జీబీ ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ వేరియంట్లు కూడా రూ.44,100కు, రూ.53,100కు కొనుగోలుచేసుకోవచ్చు. ఈ ఫోన్లను కొనుగోలు చేసే అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వ్, సిటీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, కొటక్ బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకు, స్టాండర్డ్ ఛార్టడ్, ఎస్బీఐ, యస్ బ్యాంకుల వినియోగదారులకు 12 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. అమెజాన్ కూడా ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లపై రూ.12,100 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో కూడా సిటీ బ్యాంకు కార్డులపై రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. క్యాష్‌బ్యాక్‌తో పాటు బైబ్యాక్ గ్యారెంటీని ప్రకటించింది. -
ఐఫోన్ 8, 8 ప్లస్‌ను లాంచ్ చేసేది ఎవరో తెలుసా?
సాక్షి, ముంబై : తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కంపెనీలో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన కొత్త ఐఫోన్లను భారత్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లను శుక్రవారం మధ్యాహ్నం నావి ముంబైలోని టెల్కో ప్రధాన కార్యాలయంలో ఆకాశ్ అంబానీ ఆవిష్కరించనున్నట్టు తెలిసింది. ఈ కొత్త టెల్కో జియోతో, రిలయన్స్ రిటైల్‌తో ఆపిల్ భాగస్వామ్యం ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ఐఫోన్లను ఆకాశ్ అంబానీ ఆవిష్కరిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నెలకు 799 జియో కనెక్షన్‌తో ఈ కొత్త ఐఫోన్లను కొనుగోలుచేసిన వారికి, బైబ్యాక్ గ్యారెంటీ అందుబాటులో ఉంటుంది. అంటే ఒక సంవత్సరం తర్వాత తిరిగి ఇస్తే.. వీటి అసలు కొనుగోలు ధరలో 70 శాతం తిరిగి ఇవ్వనున్నట్టు రిలయన్స్ డిజిటల్ వెల్లడించింది. అయితే కస్టమర్లు కచ్చితంగా జియో కనెక్షన్‌ను వాడాల్సి ఉంటుంది. నెలకు రూ.799తో రీఛార్జ్ చేయించుకోవాల్సిందే. ఈ కొత్త ఐఫోన్ ప్లాన్ కింద నెలకు 90జీబీ డేటాను జియో ఆఫర్ చేయనుంది. ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ కస్టమర్లందరికీ ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండింట్లోనూ ఆపిల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. రిలయన్స్ డిజిటల్, అమెజాన్ రెండు ఐఫోన్లను అధికారికంగా విక్రయిస్తున్నాయి. ఈ కొత్త ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు జియో తన కస్టమర్లకు తన వెబ్సైట్లోనూ, జియో స్టోర్‌లోనూ ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. సెప్టెంబర్ 22 -29వ తేదీల మధ్య రిలయన్స్ డిజిటల్ ద్వారా ఈ స్మార్ట్ఫోన్లను ప్రీ బుకింగ్ చేస్తే రూ.10వేల క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను జియో ప్రకటించింది. సెప్టెంబర్ 29 లాంచింగ్ సందర్భంగా ఈ క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రమే లభ్యం. -
ఐఫోన్ 8 తయారీకి ఖర్చెంత అయిందంటే...
ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐఫోన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఐఫోన్ ఎక్స్ అనే స్పెషల్ ఫోన్‌తో పాటు వీటిని కూడా ఆపిల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఐఫోన్ ఎక్స్‌తో పాటు ఈ రెండు ఐఫోన్లు కూడా చాలా ఖరీదైనవి. ధర పరంగే కాక, తయారీ విషయంలోనూ ఈ ఫోన్లు చాలా ఖర్చుతో కూడుకున్నవని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వీటిని తయారుచేయడానికి ఆపిల్ భారీ ఎత్తున్న ఖర్చు చేసినట్టు పేర్కొన్నాయి.మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ అధ్యయన రిపోర్టు ప్రకారం ఐఫోన్ ఖర్చుగా ఆపిల్ 247.51 డాలర్లను, ఐఫోన్ 8 ప్లస్ ఖర్చుగా 288.08 డాలర్లుగా వెచ్చించినట్టు తెలిసింది. అంటే దేశీయ కరెన్సీ ప్రకారం ఐఫోన్ 8 తయారీ కోసం సుమారు రూ.16వేలు, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ కోసం రూ.19వేలను ఖర్చుచేసినట్టు వెల్లడైంది. ఇది కేవలం ఈ కొత్త ఐఫోన్ల కోసం ఆపిల్ వెచ్చించిన ఖర్చులో సగ భాగం మాత్రమేనని తెలిపింది. ప్రస్తుత అధ్యయనంలో లేబర్, మార్కెటింగ్, రీసెర్చ్ వ్యయాలను కలుపలేదు. పాపులర్ హై-ఎండ్ ఫోన్ల తయారీ ఖర్చుపై ఈ అధ్యయనాన్ని ప్రతేడాది మార్కిట్ రీసెర్చ్ చేపడుతోంది. ఐఫోన్ 8 స్మార్ట్‌ఫోన్‌ను రూ.64వేల నుంచి ఆపిల్ విక్రయిస్తుండగా... ఐఫోన్ 8 ప్లస్ ధర రూ.73వేలు ఉంది. గ్లోబల్ మార్కెట్లలో అమ్మకానికి వచ్చిన ఈ రెండు స్మార్ట్ఫోన్ల ప్రీ-బుకింగ్‌లు భారత్‌లో సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్ 29 నుంచి ఇవి విక్రయానికి వస్తున్నాయి. ఐఫోన్ ఎక్స్ కూడా భారత్‌లో నవంబర్ 3 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89వేలు. అయితే ఐఫోన్ ఎక్స్ తయారీ ఖర్చును మాత్రం ఐహెచ్ఎస్ గణించలేదు. ఐఫోన్ ఎక్స్ తయారీ కోసం ఆపిల్ భారీ మొత్తంలో ఖర్చు చేసి ఉంటుందని మాత్రం ఐహెచ్ఎస్ మార్కిట్ చెప్పింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8కు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనావేస్తోంది. అంతకముందు ఐహెచ్ఎస్ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం గెలాక్సీ ఎస్8 మొత్తం తయారీ ఖర్చు 307 డాలర్లు. -
కొత్త ఐఫోన్లు భారత్‌లోకి వచ్చేది అప్పుడే!
ఎన్నో లీకేజీలు, మరెన్నో రూమర్ల అనంతరం ఆపిల్ తన సరికొత్త ఐఫోన్లను మంగళవారం రాత్రి కూపర్టినోలోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో ఆవిష్కరించింది. ఐఫోన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఐఫోన్X తో పాటు ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లను తన అభిమానుల ముందుకు తీసుకొచ్చింది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ అప్డేటెడ్ వెర్షన్లగా ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లు వచ్చాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లు త్వరలోనే భారత్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. ఉత్తర, తూర్పు భారతంలోని అధికారిక స్టోర్లలో సెప్టెంబర్ 17 నుంచి వీటి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయని రిటైల్ దిగ్గజం బ్రైట్‌స్టార్ ఇండియా బుధవారం రిపోర్టు చేసింది. సెప్టెంబర్ 29 నుంచి ఈ కొత్త ఐఫోన్ మోడల్స్ అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఫేసియల్ రిక్నైజేషన్‌తో వచ్చిన హైఎండ్ ఐఫోన్X, ప్రీఆర్డర్లు అక్టోబర్ 27 నుంచి ప్రారంభమవుతాయని బ్రైట్‌స్టార్ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ కూడా నవంబర్3 నుంచి స్టోర్లలోకి వస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. హైఎండ్ ఫోన్‌గా ఆవిష్కరణ అయిన ఐఫోన్ X ప్రారంభ ధర భారత్‌లో రూ.89వేలుగా ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్ల ప్రారంభ ధర రూ.64వేలని తెలిసింది. గ్లోబల్‌గా ఐఫోన్8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లు సెప్టెంబర్ 22 నుంచి విక్రయానికి వస్తున్నాయి. ఐఫోన్ 8, 64జీబీ ధర రూ.64వేలు ఐఫోన్ 8, 256 జీబీ వేరియంట్ ధర రూ.77వేలు ఐఫోన్ 8 ప్లస్, 64జీబీ వేరియంట్ ధర రూ.73వేలు ఐఫోన్ 8 ప్లస్, 256జీబీ వేరియంట్ ధర రూ.86వేలు