కొత్త ఐఫోన్లు భారత్‌లోకి వచ్చేది అప్పుడే!
కొత్త ఐఫోన్లు భారత్‌లోకి వచ్చేది అప్పుడే!
Published Wed, Sep 13 2017 3:27 PM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM
ఎన్నో లీకేజీలు, మరెన్నో రూమర్ల అనంతరం ఆపిల్ తన సరికొత్త ఐఫోన్లను మంగళవారం రాత్రి కూపర్టినోలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఆవిష్కరించింది. ఐఫోన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఐఫోన్X తో పాటు ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్లను తన అభిమానుల ముందుకు తీసుకొచ్చింది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ అప్‌డేటెడ్ వెర్షన్లగా ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు త్వరలోనే భారత్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. ఉత్తర, తూర్పు భారతంలోని అధికారిక స్టోర్లలో సెప్టెంబర్ 17 నుంచి వీటి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయని రిటైల్ దిగ్గజం బ్రైట్‌స్టార్ ఇండియా బుధవారం రిపోర్టు చేసింది. సెప్టెంబర్ 29 నుంచి ఈ కొత్త ఐఫోన్ మోడల్స్ అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది.
అదేవిధంగా ఫేసియల్ రిక్నైజేషన్‌తో వచ్చిన హైఎండ్ ఐఫోన్X, ప్రీఆర్డర్లు అక్టోబర్ 27 నుంచి ప్రారంభమవుతాయని బ్రైట్‌స్టార్ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ కూడా నవంబర్3 నుంచి స్టోర్‌లలోకి వస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. హైఎండ్ ఫోన్‌గా ఆవిష్కరణ అయిన ఐఫోన్ X ప్రారంభ ధర భారత్‌లో రూ.89వేలుగా ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ల ప్రారంభ ధర రూ.64వేలని తెలిసింది. గ్లోబల్‌గా ఐఫోన్8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్లు సెప్టెంబర్ 22 నుంచి విక్రయానికి వస్తున్నాయి.
ఐఫోన్ 8, 64జీబీ ధర రూ.64వేలు
ఐఫోన్ 8, 256 జీబీ వేరియంట్ ధర రూ.77వేలు
ఐఫోన్ 8 ప్లస్, 64జీబీ వేరియంట్ ధర రూ.73వేలు
ఐఫోన్ 8 ప్లస్, 256జీబీ వేరియంట్ ధర రూ.86వేలు
Advertisement
Advertisement