iPhone X
-
వచ్చేస్తోంది కొత్త ఐఫోన్
శాన్ ఫ్రాన్సిస్కో: త్వరలో కొత్త ఐఫోన్ వెర్షన్‌ను ప్రవేశపెట్టనుందన్న వార్తలకు ఊతమిస్తూ టెక్ దిగ్గజం యాపిల్ వచ్చే నెల 10న సిలికాన్ వేలీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఇన్విటేషన్లు పంపింది. సాధారణంగా ఏటా క్రిస్మస్ షాపింగ్ సీజన్‌కు ముందు.. ఇలాంటి కార్యక్రమంలోనే యాపిల్ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ వస్తోంది. ఈసారీ సెప్టెంబర్ 10న జరిగే కార్యక్రమంలో ’ఐఫోన్ 11’ హ్యాండ్‌సెట్స్‌ను కూడా ఆవిష్కరించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం మూడు ఐఫోన్ 11 మోడల్స్‌ను ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్‌ని అప్‌గ్రేడ్ చేసి ఎక్స్ఎస్, ఎక్స్ఆర్ మోడల్స్‌ను కొత్త రూపంలో ఆవిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐఫోన్ ఎక్స్ఎస్ సిరీస్ స్థానంలో వచ్చే కొత్త ఐఫోన్ 11 మోడల్లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. -
బంపర్ ఆఫర్: ఐఫోన్లపై భారీ తగ్గింపు
2018 కొత్త ఐఫోన్ మోడల్స్... ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్ లాంచింగ్ సందర్భంగా, పాత ఐఫోన్ వేరియంట్లపై భారీగా ధరలు తగ్గించింది ఆపిల్. దేశీయ మార్కెట్లోనూ, గ్లోబల్‌గా కూడా వీటి ధరలు తగ్గాయి. దేశీయ మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 6ఎస్ 32జీబీ వేరియంట్ ధర రూ.29,900కే లభ్యమవుతుంది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ బేస్ వేరియంట్ ధర కూడా 34,900 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ కొత్త ధరలను ఆపిల్ తన వెబ్సైట్లో అప్డేట్ చేసింది. అయితే ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ 10 లను అమెరికాలో నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. కానీ భారత్‌లో కేవలం ఐఫోన్ ఎస్ఈ నే నిలిపివేసింది. మిగతా మూడు ఐఫోన్లను తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ మోడల్ కొత్త ధర పాత ధర ఐఫోన్10 (256 జీబీ) రూ.1,06,900 రూ.1,08,930 ఐఫోన్10 (64 జీబీ) రూ.91,900 రూ.95,390 ఐఫోన్ 8 (64జీబీ) రూ.59,900 రూ.67,940 ఐఫోన్ 8 (256జీబీ) రూ.74,900 రూ.81,500 ఐఫోన్ 8 ప్లస్ (64జీబీ) రూ.69,900 రూ.77,560 ఐఫోన్ 8 ప్లస్ (256జీబీ) రూ.84,900 రూ.91,110 ఐఫోన్ 7 (32జీబీ) రూ.39,900 రూ.52,370 ఐఫోన్ 7 (128జీబీ) రూ.49,900 రూ.61,560 ఐఫోన్ 7 ప్లస్ (32జీబీ) రూ.49,900 రూ.62,840 ఐఫోన్ 7 ప్లస్ (128జీబీ) రూ.59,900 రూ.72,060 ఐఫోన్ 6ఎస్ (32జీబీ) రూ.29,900 రూ.42,900 ఐఫోన్ 6ఎస్ (128జీబీ) రూ.39,900 రూ.52,100 ఐఫోన్ 6ఎస్ ప్లస్ (32జీబీ) రూ.34,900 రూ.52,240 ఐఫోన్ 6ఎస్ ప్లస్ (128జీబీ) రూ.44,900 రూ.61,450 -
షాకింగ్ : ఆన్లైన్లో నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం
ఆన్లైన్లో స్మార్ట్ఫోన్లను కొంటున్నారా? అయితే కాస్త చూసి కొనుగోలు చేయండని పలు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. తాజాగా వడోదరలో భారీ ఫేక్ మొబైల్ హ్యాండ్సెట్ రాకెట్ వెలుగుచూసింది. ఈ రాకెట్లో కీలక సూత్రధారి అయిన ఓ వ్యక్తిని వడోదర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి నకిలీ హ్యాండ్సెట్లను తయారుచేసి, వాటిని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయిస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు. అంతేకాక ఈ వ్యక్తి నుంచి రూ.24 లక్షల విలువైన నకిలీ మొబైల్ హ్యాండ్సెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ హ్యాండ్సెట్లపై తాము ఇప్పటికే పలు ఫిర్యాదులను అందుకున్నామని, కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నకిలీ మొబైల్ హ్యాండ్సెట్ల రాకెట్లో కీలకదారి అయిన ఈ వ్యక్తి దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు నకిలీ యూనిట్లను అమ్మినట్టు విచారణలో తేలింది. నకిలీ డివైజ్‌లలో ముఖ్యంగా ఐఫోన్ ఎక్స్, శాంసంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్ఫోన్లు ఉన్నట్టు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. రూ.50వేలకు పైన ఖరీదు ఉన్నవాటినే నకిలీలు రూపొందించి, ఆన్లైన్ కస్టమర్లకు అమ్మినట్టు తేల్చారు. అయితే కస్టమర్లు తాము కొనుగోలు చేయాలనుకునే స్మార్ట్‌ఫోన్ అసలైనదా? కానిదా? తెలుసుకునేందుకు ప్రతి ఫోన్‌పై ఐఎంఈఐ నెంబర్‌ను చెక్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. *#06# నెంబర్‌కు డయల్ చేసినా కూడా ఐఎంఈఐ నెంబర్, సంబంధిత మొబైల్ కంపెనీదా? కాదా? అని తెలిసిపోతుందన్నారు. -
ఐఫోన్ ఎక్స్ అద్దె రూ.4,299
ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్, వెహికిల్స్‌ను అద్దెకు తీసుకుని వాడుకోవడం తెలిసే ఉంటుంది. కానీ స్మార్ట్‌ఫోన్ అద్దెకు తీసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. కన్జ్యూమర్ రెంటల్ వెబ్సైట్ రెంటోమోజో, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్, వెహికిల్స్‌తో పాటు స్మార్ట్ఫోన్లను అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్ ఫ్లాగ్షిప్ డివైజ్‌లు ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, గూగుల్ పిక్సెల్ 2, శాంసంగ్ గెలాక్సీ ఎస్9, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8లను ఆరు నెలలకు, ఏడాదికి, రెండేళ్లకు అద్దెకు ఇవ్వడం ఆఫర్ చేస్తోది. ఈ స్మార్ట్ఫోన్ల అద్దె నెలకు రూ.2,099 నుంచి ప్రారంభమై, రూ.9,299 వరకు ఉంది. రెండేళ్ల అద్దె తర్వాత ఆ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ సొంతం కూడా చేసుకునే ఆప్షన్‌ను రెంటోమోజో ఆఫర్ చేస్తోంది. రెంటోమోజో వెబ్సైట్లో ఐఫోన్ ఎక్స్ అద్దె నెలకు 4,299 రూపాయలుగా ఉంది. ఒకవేళ 24 నెలలు పాటు అద్దెకు దీన్ని బుక్ చేసుకోవాలంటే 4,299 రూపాయలను నెల నెలా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరు నెలలకు దీన్ని అద్దెకు తీసుకోవాలనుకుంటే, నెలకు రూ.9,299ను చెల్లించాలి. ఎక్కువ కాలం పాటు అద్దెలు, వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. ఒకవేళ 24 నెలల తర్వాత ఈ ఐఫోన్ ఎక్స్ మీకు కావాలంటే అదనంగా రూ.15,556ను చెల్లించాలి. తొలుత రీఫండబుల్ డిపాజిట్‌గా 9,998 రూపాయలను కూడా రెంటోమోజో తీసుకుంటోంది. అత్యంత తక్కువ అద్దె గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్‌పై ఉంది. 24 నెలల కాలానికి నెలవారీ 2,099 రూపాయలను చెల్లించాలి. ఆరు నెలలకు దీని అద్దె నెలవారీ 5,398 రూపాయలుగా ఉంది. గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్‌కు కూడా రూ.5,398 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. అలాగే ఐఫోన్ 8, శాంసంగ్ గెలాక్సీ ఎస్9, గెలాక్సీ నోట్ 8లు కూడా అద్దెకు అందుబాటులో ఉన్నాయి. రెంటోమోజో అద్దెకు ఉంచిన డివైజ్‌లన్నీ ఖరీదైనవే. కొంత కాలమైనా ఆ ఫోన్లను వాడాలనే ఆశ కలిగి వారికి, రెంటోమోజో ఈ బంపర్ కానుకను అందిస్తుంది. -
ఐఫోన్ ఎక్స్‌పై భారీ ఆఫర్
ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌లు, మార్కెటింగ్ ఆఫర్లతో పేటీఎం మాల్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీనిలో భాగంగా ఈ సంస్థ ‘ఫ్రీడం క్యాష్‌బ్యాక్ సేల్’ను నిర్వహిస్తోంది. ఆగస్టు 8 నుంచి ప్రారంభమైన ఈ సేల్, ఆగస్టు 15 వరకు కొనసాగనుంది. ఈ ఫ్రీడం క్యాష్‌బ్యాక్ సేల్‌లో భాగంగా ఐఫోన్ అభిమానుల కోసం ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఐఫోన్ ఎక్స్(64జీబీ)ను కేవలం 67,298 రూపాయలకే విక్రయిస్తోంది. దీని అసలు ధర 92,798 రూపాయలుగా ఉంది. ఫ్రీడం క్యాష్‌బ్యాక్ సేల్‌లో ఐఫోన్ ఎక్స్‌పై ఫ్లాట్ 10వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. దీంతో ఐఫోన్ ఎక్స్(64జీబీ) పేటీఎం మాల్లో రూ.82,798కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు తమ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే అదనంగా మరో 1,250 రూపాయల క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. పాత ఫోన్ల ఎక్స్చేంజ్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఐఫోన్ ఎక్స్ ధర మరో రూ.14,250 తగ్గుతోంది. దీంతో మొత్తంగా ఐఫోన్ ఎక్స్ 64జీబీ వేరియంట్ ధర 67,298 రూపాయలకు దిగొస్తోంది. మరోవైపు పేటీఎం మాల్ నిర్వహిస్తున్న సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 20 వేల రూపాయల వరకు ధర తగ్గించింది. ఇంటెల్ కోర్ ఐ3, 4జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్, ఏడాది పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కలిగిన లెనోవో ఐడియాప్యాడ్ 320 ధర పేటీఎం మాల్లో రూ.22,490కు తగ్గింది. అదేవిధంగా ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్ కలిగిన డెల్ వోస్ట్రో 3578 ల్యాప్‌టాప్‌పై ఫ్లాట్ 6000 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఎంఎస్ఐ జీఎల్63 8ఆర్ఈ-455ఐఎన్ గేమింగ్ ల్యాప్‌టాప్‌పై రూ.20వేల క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం మాల్ తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. 13 శాతం తగ్గింపు, 11000 రూపాయల క్యాష్‌బ్యాక్ ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎంక్యూడీ42హెచ్ఎన్/ ల్యాప్‌టాప్‌పై కస్టమర్లకు అందుతుంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రొ కోర్ ఐ5 ల్యాప్‌టాప్‌పై 10 వేల రూపాయల క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. -
ఐఫోన్ ఎక్స్ కంటే ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఇదే!
న్యూఢిల్లీ : ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ఫోన్ ఏదీ అంటే. ఠక్కున ఐఫోన్ ఎక్స్ అని చెప్పేస్తాం. లక్ష రూపాయలకు పైగా ధరతో భారత్‌లో అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా వినియోగదారుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా ఐఫోన్ ఎక్స్ ధరను మించి, దాని కంటే ఖరీదైన స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఎల్జీ తన సిగ్నేచర్ సిరీస్‌లో లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గతేడాది లాంచ్ చేసిన ఎల్జీ సిగ్నేచర్ ఎడిషన్‌కు సక్సెసర్‌గా, ఎల్జీ సిగ్నేచర్ ఎడిషన్(2018)ను ఎల్జీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. తెలుపు, నలుపు రంగుల్లో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర 1,999,800 ఓన్‌లు అంటే దేశీయ కరెన్సీ ప్రకారం 1,22,820 రూపాయలు. ఐఫోన్ ఎక్స్ ధర రూ.1,02,425. ఐఫోన్ ఎక్స్ కంటే కూడా ఎల్జీ సిగ్నేచర్ ఎడిషన్(2018) స్మార్ట్ఫోనే ఖరీదైనది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే ప్రారంభమవుతున్నాయి. ఎల్జీ సిగ్నేచర్ ఎడిషన్ 2018, జిర్కోనియం పింగాణీ వంటి ప్రీమియం మెటిరీయల్తో రూపొందింది. ఇది వెనుకవైపు ఎలాంటి గీతలు పడకుండా కాపాడుతోంది. ఈ డివైజ్‌కు వెనుకాల కస్టమర్లు తమ పేర్లను కూడా చెక్కించుకోవచ్చు. ఎల్జీ సిగ్నేచర్ ఎడిషన్ 2018 ఫీచర్లు... 6 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్‌తో ప్రొటెక్షన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ 6 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 2 టీబీ వరకు విస్తరణ మెమరీ వెనుకవైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్లతో రెండు కెమెరాలు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ 3.0 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ -
భారీ స్క్రీన్‌తో వస్తున్న శాంసంగ్ మడిచే ఫోన్
సియోల్ : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ మరో కొత్తరకం ఫోన్‌ను తీసుకురాబోతుంది. అదే మడతపెట్టే ఫోన్. ఈ ఫోన్ గురించి మార్కెట్లో వస్తున్న రిపోర్టులు అన్నీ ఇన్నీ కావు. ఈ ఏడాది చివరి వరకు శాంసంగ్ మడతపెట్టే ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతుందని తెలుస్తోంది. కంపెనీ ఈ ఫోన్ లాంచింగ్‌పై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా శాంసంగ్ తీసుకొస్తున్న మడతపెట్టే ఫోన్, అతిపెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంటుందని తెలిసింది. భారీ ఎత్తున 7 అంగుళాల డిస్ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంటుందని తాజా రిపోర్టు పేర్కొంది. వాలెట్ మాదిరే దీన్ని మడతపెట్టుకోవచ్చని రిపోర్టు తెలిపింది. మడతపెట్టి ప్యాకెట్లో పెట్టుకుని మరీ ఎక్కడికైనా ఈ ఫోన్‌ను తీసుకెళ్లచ్చని రిపోర్టు పేర్కొంది. భారీ స్క్రీన్‌తో పాటు ఈ ఫోన్‌కు ముందు వైపు రెండో డిస్ప్లే కూడా ఉంటుందట. ఈ రెండో డిస్ప్లే ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం యూజర్లకు నోటిఫికేషన్ల గురించి తెలియజేయడం కోసమేనని తెలిసింది. దీంతో వాట్సాప్ మెసేజ్‌లు వచ్చినప్పుడు, ఈమెయిల్స్ చదవాలనుకున్నప్పుడు హ్యాడ్‌సెట్‌ను పూర్తిగా తెరవాల్సిన పనిలేదట. అన్ని నోటిఫికేషన్లను రెండో డిస్ప్లే నుంచే చెక్ చేసుకోవచ్చని రిపోర్టు చెబుతోంది. ఫోన్‌కు టాప్‌లో ముందు వైపు ఈ రెండో డిస్ప్లేను కంపెనీ అందిస్తుంది. ‘విన్నర్’ అనే కోడ్‌నేమ్‌తో ఈ శాంసంగ్ మడతపెట్టే ఫోన్ వస్తుందని, గేమింగ్ ఔత్సాహికులను, వినియోగదారులను టార్గెట్ చేసుకుని ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ ధర కూడా తక్కుమేవీ లేదట. ఇంచుమించు ఐఫోన్ ఎక్స్ మాదిరి లక్ష రూపాయల ధరను కలిగి ఉంటుందని లీకైన రిపోర్టులు చెబుతున్నాయి. తొలుత ఈ ఫోన్ పరిమిత పరిమాణంలోనే అందుబాటులో ఉంటుందట. ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌కు ఇది గట్టిపోటీగా నిలువబోతుందని టాక్. తొలుత శాంసంగ్ ఈ ఫోన్‌ను తన స్వదేశంలో లాంచ్ చేసుకుని, అనంతరం ఇతర మార్కెట్లకు తీసుకొస్తుందట. అయితే భారత స్టోర్లలోకి ఇది వస్తుందా? రాదా? అన్నది ఇంకా క్లారిటీగా తెలియరాలేదు. -
కుమారస్వామి ఏంటీ పని?
బెంగళూరు : కర్ణాటక ఎంపీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రజాధనంతో కాస్ట్ లీ గిఫ్ట్స్ కొనిచ్చారంటూ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకుడు రాజీవ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. విలువైన ఐఫోన్ ఎక్స్, లెదర్ బ్యాగ్‌లను రాష్ట్ర ఎంపీలకు కుమారస్వామి ఇచ్చారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కావేరి సమస్యపై చర్చించేందుకు ఎంపీలందరినీ ఆహ్వానించడాన్ని చంద్రశేఖర్ సమర్థించారు. అయితే, రాష్ట్రం ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ఎంపీలకు కాస్ట్ లీ గిఫ్ట్‌లు అవసరమా? అని నిలదీశారు. కుమారస్వామి పంపిన గిఫ్ట్స్ ఇవేనంటూ ఓ ఫొటోను సైతం ట్వీట్‌కు జత చేశారు. అందులో ఐఫోన్ ఎక్స్‌తో పాటు ‘మూచీస్’ బ్యాగ్ ఉన్నాయి. -
త్వరలోనే ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎస్ఈ నిలిపివేత?
టెక్ దిగ్గజం ఆపిల్ మరికొన్ని నెలల్లో తన మెగా హార్డ్‌వేర్ ఈవెంట్‌ను నిర్వహించబోతుంది. ఆ ఈవెంట్లో గత ఎంతో కాలంగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న కొత్త ఐఫోన్లను కంపెనీ లాంచ్ చేయబోతుందని తెలుస్తోంది. ఈ కొత్త ఐఫోన్లకు 2018లో భారీ ఎత్తున్న డిమాండ్ వచ్చే అవకాశాలున్నాయని కూడా టెక్ వర్గాలు అంచనావేస్తున్నాయి. అయితే వీటికి డిమాండ్ భారీ ఎత్తున్న ఉండబోతున్న తరుణంలో, ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఐఫోన్ ఎక్స్‌ను, ఐఫోన్ ఎస్ఈ లను నిలిపివేస్తుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. కంపెనీ ప్రస్తుతం తన ఫోకస్ అంతా కొత్తగా విడుదల చేయబోతున్న ఆ మూడు ఐఫోన్లపైనే ఉంచనున్నట్టు పేర్కొంటున్నారు. బ్లూఫిన్ రీసెర్చ్ విడుదల చేసిన ఓ ఇన్వెస్టర్ నోట్లో.. గత కొన్నేళ్లుగా ఎలాంటి అప్‌గ్రేడ్ లేకపోవడంతో, తాజాగా తీసుకొచ్చే ఐఫోన్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిసింది. ఆపిల్ ఆ మెగా ఈవెంట్లో 5.8 అంగుళాల ఐఫోన్ ఎక్స్ సక్ససర్, 6.5 అంగుళాల ఐఫోన్ ఎక్స్ ప్లస్ మోడల్, అఫార్డబుల్ 6.1 అంగుళాల ఎల్సీడీ ఐఫోన్‌ను లాంచ్ చేస్తుంది. అఫార్డబుల్ ఎల్సీడీ ఐఫోన్‌కు భారీ ఎత్తున్న డిమాండ్ వస్తుందని చాలా కాలం నుంచే విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2018 మూడు, నాలుగు క్వార్టర్లలో 9.1 కోట్ల యూనిట్ల 2018 ఐఫోన్‌ను తయారు చేస్తుందని బ్లూఫిన్ విశ్లేషకులు చెప్పారు. మరో 9.2 కోట్ల యూనిట్లను 2019 తొలి రెండు క్వార్టర్లలో రూపొందిస్తుందని పేర్కొన్నారు. షిప్మెంట్లను కూడా భారీగానే చేపట్టనుందని తెలిపారు. ఐఫోన్ ఎక్స్ ధర(999 డాలర్లు) మాదిరే ఐఫోన్ ఎక్స్ ప్లస్ ధరను నిర్ణయిస్తుందని, అదేమాదిరి మూడు ఐఫోన్లలో కెల్లా 6.1 అంగుళాల ఎల్సీడీ ఐఫోన్ ధరనే అత్యంత తక్కువగా ఉంచనుందని తెలుస్తోంది. దీని ధర 600 డాలర్ల నుంచి 700 డాలర్ల మధ్యలో ఉండొచ్చని సమాచారం. ఇది ఐఫోన్ ఎస్ఈని రీప్లేస్ చేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్లను లాంచ్ చేయబోతున్న తరుణంలో, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎస్ఈలను నిలిపివేయబోతున్నట్టు విశ్లేషకులంటున్నారు. ఒకవేళ ఐఫోన్ ఎక్స్‌ను కనుక ఆపిల్ నిలిపివేస్తే, లాంచ్ అయిన ఏడాదిలో నిలిచిపోయిన ఫోన్ ఇదే అవుతుంది. -
ఐఫోన్ ఎక్స్‌లో మరో ప్రాబ్లమ్, యూజర్లు గగ్గోలు
ఐఫోన్ ఎక్స్.. ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన 10వ ఐఫోన్ వార్షికోత్సవ సందర్భంగా తీసుకొచ్చిన స్పెషల్ ఎడిషన్. కానీ ఈ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఈ స్మార్ట్‌ఫోన్‌కు అమర్చిన ఫేస్ఐడీలో లోపం ఉన్నట్టు యూజర్లు ఫిర్యాదులు చేస్తే.. తాజాగా వెనుక వైపు గల డ్యూయల్ కెమెరాకు అమర్చిన గ్లాస్ ప్రొటెక్షన్ అనుకోకుండా పగిలిపోతుందట. ఈ విషయంపై యూజర్లు నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడం ప్రారంభమైంది. రెడ్డిట్, ఆపిల్ సపోర్టు ఫోరమ్స్ల్లో పలు రిపోర్టులు చక్కర్లు కొడుతున్నాయి. పలువురు ఐఫోన్ యూజర్లు తమ కెమెరా గ్లాస్ పగిలిపోతుందని ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఎందుకు ఈ గ్లాస్ పగిలిపోతుందో సరియైన కారణం మాత్రం తెలియడం లేదు. తమ ఫోన్లను కింద పడేయలేదని, దానికదే పగిలిపోతుందని యూజర్లు పేర్కొంటున్నారు. ‘నా ఐఫోన్ ఎక్స్ కెమెరా లెన్స్ పగిలిపోయినట్టు ఇప్పుడే చూశా. కానీ నేనసలు ఈ ఫోన్‌ను కిందనే పడేయలేదు’ అని ఒక యూజర్ రెడ్డిట్‌లో రిపోర్టు చేశాడు. చల్లని వాతావరణంతో మనిషి చేతులు, కాళ్లు పగిలినట్టు, ఫోన్ వెనుక వైపు కెమెరా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా చల్లని వాతావరణానికి దెబ్బతింటుందని పలువురు యూజర్లు విశ్వసిస్తున్నారు. అయితే చల్లని వాతావరణంలో ఉన్నందుకు వెనుక వైపు కెమెరా గ్లాస్ పగులుతుందని రిపోర్టులు వస్తున్నాయని, తాను మలేషియాలో ఉంటానని, ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉందని, అయితే ఇక్కడ ఏ కారణం చేత పగిలింది అని ఓ బాధిత యూజర్ ఆపిల్ సపోర్టు ఫోరమ్‌కు లేఖ రాశారు. తమ వద్ద 32-36 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్టు పేర్కొన్నారు. ఐఫోన్ ఎక్స్‌తో పాటు యూజర్లు తన పాకెట్లలో మరికొన్ని వస్తువులను పెట్టుకుని ఉంటుండటంతో, కెమెరా గ్లాస్ పగులుతున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 7 నుంచి ఆపిల్ తన ఐఫోన్ మోడల్స్‌కు సఫైర్ గ్లాస్ కవర్‌ను వాడుతోంది. ఇది చాలా స్వచ్ఛంగా ఉంటోంది. కానీ ఎందుకు పగులుతుందో మాత్రం సరియైన క్లారిటీ తెలియడం లేదు. అయితే పగిలిపోయిన ఈ కెమెరా గ్లాస్‌కు వారెంటీ కిందకి వస్తుందో రాదో కూడా అనుమానమే. -
ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌ను ప్రారంభించింది. ఆపిల్ వీక్ సేల్ పేరుతో ఈ ఈ-కామర్స్ దిగ్గజం వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకు మీ ఫేవరెట్ ఆపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా అవకాశం కల్పిస్తోంది. ఐఫోన్లపై మాత్రమే కాక, ఆపిల్ 10వ వార్షికోత్సవ ఎడిషన్ ఐఫోన్ ఎక్స్, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్, ఎయిర్‌పాడ్స్, ఆపిల్ వాచ్ సిరీస్‌లపై కూడా భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న ఆపిల్, ఎంపిక చేసిన ఆపిల్ ఉత్పత్తులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్, మే 27 వరకు జరుగనుంది. ఐఫోన్ ఎక్స్... ఆపిల్ వార్షికోత్సవ ఎడిషన్ ఐఫోన్ ఎక్స్‌ను 85,999 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది. ఇది అసలు ధర కంటే నాలుగు వేలు తక్కువ. ఇది 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర. 256జీబీ మోడల్ ధర ఐఫోన్‌ను 97,920 రూపాయలకు విక్రయిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ వస్తోంది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్... ఐఫోన్ 8 (64జీబీ మోడల్) స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ధరలో 62,999 రూపాయలకు విక్రయిస్తోంది. 256జీబీ స్టోరేజ్ మోడల్‌ను కూడా 73,999కే అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ స్టోరేజ్ మోడల్‌ను 72,999 రూపాయలు అందుబాటులోకి తీసుకురాగ, 256జీబీ మోడల్‌ను 85,999 రూపాయలకు విక్రయిస్తున్నట్టు ప్లిప్‌కార్ట్ తెలిపింది. ఐఫోన్ 6ఎస్.. ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను 33,999 రూపాయల నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 40వేల రూపాయలు. ఈ ధర స్పేస్ గ్రే, గోల్డ్ కలర్ వేరియంట్లు మాత్రమే. ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్ 32జీబీ రోజ్ గోల్డ్, సిల్వర్ కలర్స్ వేరియంట్లను 34,999 రూపాయలకు అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఐఫోన్ ఎస్ఈ.. ఈ స్మార్ట్‌ఫోన్ 32జీబీ వేరియంట్‌ను 17,999 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. ఆపిల్ వీక్ సేల్‌లో ఇదే బెస్ట్ డీల్. అదనంగా కస్టమర్లకు 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తోంది. ఇతర డీల్స్... ఆపిల్ ఎయిర్‌పాడ్స్ బ్లూటూత్ హెడ్సెట్ విత్ మిక్‌ను 11,499కు విక్రయిస్తోంది ఆపిల్ ఇయర్‌పాడ్స్ విత్ 3.5ఎంఎం హెడ్‌ఫోన్ ప్లగ్ వైర్డ్ హెడ్సెట్ విత్ మిక్‌ను 1,899కు అందుబాటులోకి ఆపిల్ టీవీ 32 జీబీ మోడల్ ఏ 1625ను 14,698 రూపాయలకు విక్రయం 9.7 అంగుళాల ఆపిల్ ఐప్యాడ్ 32జీబీ మోడల్‌ను 22,900 రూపాయలకు ఆఫర్ 9.7 అంగుళాల ఆపిల్ ఐప్యాడ్(6వ జనరేషన్)32 జీబీ ని 28వేల రూపాయలకు అందుబాటు ఆపిల్ వాచ్ సిరీస్‌ల ప్రారంభ ధర 20,900 రూపాయలు -
ఐఫోన్ ఎక్స్‌లో లోపం : డివైజ్ రీప్లేస్
శాన్ఫ్రాన్సిస్కో : ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్‌లో తీసుకొచ్చిన అత్యుత్తమ లాకింగ్ ఫీచర్ ఫేస్ ఐడీ. ఫింగర్‌ప్రింట్‌తో పోలిస్తే అత్యంత భద్రతతో కూడుకున్నదిగా దీన్ని ఆపిల్ అభివర్ణించింది. అయితే ప్రస్తుతం ఈ ఫేస్‌ఐడీకి సంబంధించే ఆపిల్ సమస్యలు ఎదుర్కొంటోంది. ఎవరైతే ఫేస్ఐడీ అన్‌లాక్ స్కానర్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి డివైజ్‌ను కొత్త దానితో రీప్లేస్ చేయనున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఫోన్‌ను రిఫైర్ చేయలేని పక్షంలో వారికి ఈ కొత్త డివైజ్‌ను అందించనున్నట్టు రిపోర్టులు తెలిపాయి. మ్యాక్రూమర్స్ రిపోర్టు ప్రకారం ఫేస్ఐడీతో సమస్యలు ఎదుర్కొంటున్న ఐఫోన్ ఎక్స్ యూనిట్ల సర్వీసు పాలసీని అప్డేట్ చేస్తున్నట్టు ఈ కూమర్టినో కంపెనీ ప్రకటించినట్టు తెలిసింది. ఈ పాలసీ ప్రకారం ఫేస్ఐడీ సమస్యను తొలుత వెనుక కెమెరాతో పరిష్కరించడానికి చూస్తామని తెలిపింది. ఒకవేళ అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే, ఆపిల్ మొత్తం యూనిట్‌ను కొత్త డివైజ్‌తో రీప్లేస్ చేస్తుందని పేర్కొంది. డివైజ్ వెనుక కెమెరా ద్వారా ఈ సమస్య వస్తున్నట్టు ఈ టెక్ దిగ్గజం ఒప్పుకున్నట్టు డైలీ టెలిగ్రాఫ్ రిపోర్టు చేసింది. ముందు వైపు ఉన్న ట్రూడెప్త్ కెమెరా, వెనుక వైపు ఉన్న టెలిఫోటో లెన్స్ లింక్ అయి ఉన్నాయని రిపోర్టు తెలిపింది. ఆపిల్ అందించిన ఈ ఫేస్ఐడీ ఫీచర్, ఏ11 న్యూరల్ ఇంజిన్‌లో ట్రూ డెప్ట్ కెమెరా సిస్టమ్‌తో ఎనాబుల్ అయింది. ఇది 3డీ ఫేస్ స్కానర్. ఇది ఒక వ్యక్తి యొక్క ముఖాన్ని విశ్లేషించడానికి, గుర్తింపును ధృవీకరించడానికి అనేక అంశాలను ఉపయోగిస్తుంది. -
ఆపిల్‌కు గుడ్‌న్యూస్ : ఆ ఫోన్ దంచికొట్టింది
టెక్ దిగ్గజం ఆపిల్‌కు గుడ్‌న్యూస్ వెలువడింది. ఈ వారంలో ప్రకటించిన త్రైమాసికపు ఫలితాల్లో ఐఫోన్ ఎక్స్ బెస్టింగ్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ ఎక్స్ విక్రయాల్లో ఎలా ఉంటుందో అని మార్కెట్ విశ్లేషకులు, కంపెనీ పలు సందేహ పడింది. కానీ వారందరి సందేహాలను బద్దలు కొడుతూ.. 2018 తొలి క్వార్టర్లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ ఎక్స్ నిలిచినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 16 మిలియన్ యూనిట్ల ఐఫోన్ ఎక్స్‌లను రవాణా చేసినట్టు సీనెట్ రిపోర్టులు పేర్కొన్నాయి. ఐఫోన్ ఎక్స్‌తో పాటు లాంచ్ చేసిన ఐఫోన్ 8 కేవలం 12.5 మిలియన్ యూనిట్లు మాత్రమే రవాణా జరుగగా.. ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 8.3 మిలియన్ యూనిట్లు రవాణా జరిగింది. ఆపిల్ ప్రకటించిన ఈ ఫలితాలు వాల్‌స్ట్రీట్ అంచనాలను కూడా బీట్ చేశాయి. అయితే భారత మార్కెట్లో మాత్రం ఆపిల్ మార్కెట్ షేరు తగ్గింది. 2018 తొలి క్వార్టర్లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో శాంసంగ్ కంపెనీ ఆధిపత్యంలో నిలిచినట్టు రెండు మార్కెట్ రీసెర్చ్ రిపోర్టులు పేర్కొన్నాయి. అదనంగా సీబీఐ(పూర్తిగా నిర్మించిన యూనిట్లు)పై దిగుమతి డ్యూటీలను పెంచడం, భారత్‌లో ఐఫోన్ ధరలపై ప్రభావం పడింది. భారత మార్కెట్లో తన ఉత్పత్తిని పెంచుకోవడం కోసం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించడం కోసం ఆపిల్, ప్రభుత్వంతో చర్చించింది. కాగ, గత క్వార్టర్లో ఐఫోన్ ఎక్స్, ఐఫోన్8, 8 ప్లస్ లాంచ్‌తో ఆపిల్ టాప్‌లో నిలిచింది. కానీ కంపెనీ నుంచి భారత్‌కు సరుకు రవాణా 74 శాతం తగ్గింది. -
వన్‌ప్లస్ 6 లాంచింగ్ మే 18...?
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌పై పలు అంచనాలు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. చైనా స్మార్టఫోన్ల తయారీదారు వన్‌ప్లస్ తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6ను 2018, మే 18న భారతదేశంలో లాంచ్ చేయనుందని సమాచారం. గతంలో వన్‌ప్లస్ కంపెనీ విడుదల చేసిన టీజర్లో చూపినట్లుగానే ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్ మాదిరి నాచ్ డిస్ప్లే డిజైన్‌తో మార్కెట్లోకి విడుదల కానుంది. 64జీబీ బేస్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర 34వేల రూపాయలుగానూ, 128 జీబీ టాప్ స్మార్ట్‌ఫోన్ వేరియంట్ ధర 39వేల రూపాయలుగా ఉండొచ్చని అంచనా. ముఖ్యంగా వాటర్ రెసిస్టెన్స్ ఫిచర్ వన్‌ప్లస్ 6లో కీలక ఫీచర్‌గా ఉండనుంది. ఈ విషయాన్ని స్వయంగా వన్‌ప్లస్ సంస్థ సోమవారం పోస్టు చేసిన ట్విట్లో పేర్కొంది. వన్‌ప్లస్ 6 స్పెషిఫికేషన్లపై అంచనాలు... 6.28 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ డిస్ప్లే 19:9 ఆస్పెక్ట్ రెషియో 845 సాన్డ్రాగన్ అక్టాకోర్ చిప్ సెట్ 6జీబీ ర్యామ్ 64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లు వెనుకవైపు 16+20 మెగాపిక్సెల్ డ్యూయల్ సెన్సార్లు ముందు వైపు 20 మెగాపిక్సెల్ కెమెరా 3450 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ సారి వన్‌ప్లస్ 6 లాంచింగ్‌తో పాటు వన్‌ప్లస్ కంపెనీ పదోవార్షికోత్సవాన్ని మార్వేల్స్ స్టూడియో భాగస్వామ్యంతో ‘అవేంజర్స్:ఇన్ఫినిటి వార్’ తో కలిసి నిర్వహించనున్నట్లు గురువారం తెలిపింది. గతంలో 2017, డిసెంబర్లో భారతదేశంలో తన మూడో వార్షికోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ‘వన్‌ప్లస్ 5టీ’ స్మార్ట్‌ఫోన్‌ను ‘స్టార్‌వార్స్’తో కలిసి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
అదిరిపోయే ఫీచర్లతో హానర్ 10
హువావే సబ్ బ్రాండు హానర్ గురువారం కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ 10ను చైనాలో లాంచ్ చేసింది. ఐఫోన్ ఎక్స్ మాదిరి నాచ్ డిస్ప్లే డిజైన్‌తో హానర్ 10ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌గా కూడా కంపెనీ లాంచ్ చేయబోతోంది. బ్లాక్, గ్రే, మిరేజ్ బ్లూ, మిరేజ్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర 2,600 సీఎన్‌వై( సుమారు రూ.27,300), టాప్ వేరియంట్ ధర 2,800 సీఎన్‌వై(రూ.29,400)గా కంపెనీ పేర్కొంది. ఇటీవలే హువావే పీ20, పీ20 ప్రొ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. హానర్ 10 స్పెషిఫికేషన్లు... 5.84 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ డిస్ప్లే ఇన్-హౌజ్ కిరిన్ 970 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్ 64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లు వెనుకవైపు 16 మెగాపిక్సెల్, 24 మెగాపిక్సెల్ డ్యూయల్ సెన్సార్లు ముందు వైపు 24 మెగాపిక్సెల్ కెమెరా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 3400 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు -
ఖరీదైన ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్
న్యూఢిల్లీ : ఆపిల్ తన ఐఫోన్ 10వ వార్షికోత్సవంగా తీసుకొచ్చిన స్పెషల్ ఎడిషన్ ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే సరియైన సమయమట. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్లను ఆపిల్ ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు హోల్డర్స్ అందరికీ ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. దీంతో పాటు ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేసిన ఆరు నెలల అనంతరం ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను ఇది కల్పిస్తోంది. వీటితో పాటు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చి కొత్త ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ కనీసం 20 వేల రూపాయల బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.20వేల కంటే ఎక్కువగా బైబ్యాక్ పొందే కస్టమర్లకు అదనంగా మరో 7వేల రూపాయల డిస్కౌంట్‌ను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, గూగుల్ పిక్సెల్, శాంసంగ్ గెలాక్సీ ఎస్8, శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ వంటి స్మార్ట్ఫోన్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్లు మామూలు స్థాయిలోనే వాడుతూ ఉండాలి. ఎలాంటి ఫిజికల్ డ్యామేజ్ ఉండకూడదు. అన్ని యాక్ససరీస్‌ను కలిగి ఉండాలి. పైన పేర్కొన్న ఆఫర్లు ఆపిల్ ప్రీమియం రీసెల్లర్స్, ఇతర ఎంపిక చేసిన స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. కాగ, గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 8, 8 ప్లస్లతో పాటు ఐఫోన్ ఎక్స్‌ను ఆపిల్ లాంచ్ చేసిన సంగతి తెలిసింది. అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా ఇది మార్కెట్లోకి వచ్చింది. ఐఫోన్ ఎక్స్ ప్రారంభ ధర 83,499 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఓఎస్ 11తో రన్ అవుతుంది. కంపెనీ సొంత ఏ11 బయోనిక్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఓలెడ్ డిస్ప్లేతో లాంచ్ అయిన తొలి ఐఫోన్ ఇదే కావడం విశేషం. 5.8 అంగుళాల డిస్ప్లే, 2436 x 1125 పిక్సెల్ రెజుల్యూషన్, ఫేస్ఐడీ ఫీచర్, 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 7 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్, వీడియో కాలింగ్, 64జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లను ఇది కలిగి ఉంది. -
ఆపిల్ చరిత్రలో అతిపెద్ద క్వార్టర్
కాలిఫోర్నియా : టెక్ దిగ్గజం ఆపిల్ రికార్డు సృష్టించింది. గతేడాది చివరి మూడు నెలల కాలంలో 20 బిలియన్ డాలర్ల లాభాలు వచ్చాయని, అంచనావేసిన దానికంటే అధికంగా కొత్త స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్ విక్రయాలను నమోదుచేసినట్టు తెలిసింది. రెవెన్యూలు సైతం 13 శాతం పెరిగి 88.3 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ఆపిల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద క్వార్టర్ అని, తామే ఆశ్చర్యపోయినట్టు ఆపిల్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు. కొత్త ఐఫోన్ లైనప్‌లో ఎక్కువ మొత్తంలో రెవెన్యూ ఆర్జించినట్టు పేర్కొన్నారు. తమ అంచనాలకు మించి ఐఫోన్ ఎక్స్ దూసుకుపోయిందని, నవంబర్ నెలలో తాము సరుకు రవాణా ప్రారంభించినప్పటి నుంచి ప్రతి వారం టాప్ సెల్లింగ్ ఐఫోన్‌గా ఇదే నిలిచినట్టు ఆపిల్ పేర్కొంది. 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఐకానిక్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. అత్యంత ఖరీదైన ఈ ఐఫోన్‌కు బలహీనమైన డిమాండ్ ఉందని వార్తలు వచ్చినప్పటికీ.. రెవెన్యూలను ఈ ఫోన్ బాగానే సొంతం చేసుకుంది. ఈ క్వార్టర్లో మొత్తంగా ఐఫోన్ విక్రయాలు 77.3 మిలియన్లుగా ఉన్నాయని రిపోర్టు చేసింది. ఇటీవల వచ్చిన ఆదాయాలు అన్ని ప్రాంతాల నుంచి వచ్చాయని.. సవాళ్లను ఎదుర్కొంటున్న ''గ్రేటర్ చైనా'' నుంచి కూడా తాము భారీగా ఆదాయలు ఆర్జించినట్టు కంపెనీ తెలిపింది. ఆపిల్ టీవీ, ఆపిల్ వాచ్‌ల నుంచి కంపెనీ రెవెన్యూలు 36 శాతం పెరిగి 5.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
ఆపిల్ నుంచి మూడు ఐఫోన్లు..!
టెక్ దిగ్గజం ఆపిల్.. 2018లో మూడు కొత్త ఐఫోన్లను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. కంపెనీ నుంచి విడుదలయ్యే ఉత్పత్తులపై సరియైన అంచనాలను విడుదల చేసే కేజీఐ సెక్యురిటీస్ విశ్లేషకుడు మింగ్-చి కుయో ఈ విషయాన్ని వెల్లడించారు. కుయో తాజా రిపోర్టులో ఆపిల్ 2018లో ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎక్స్ ప్లస్, తక్కువ ధరలో 6.1 అంగుళాల అతిపెద్ద డిస్ప్లేతో ఐఫోన్ ఎక్స్‌ను ప్రవేశపెట్టనుందని తెలిపారు. 6.1 అంగుళాల ఐఫోన్ ఎక్స్‌ను బడ్జెట్ ఆప్షన్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇది ఎల్సీడీ డిస్ప్లే కలిగి ఉంటుందట. ఈ వెర్షన్ కోసం జపాన్ డిస్ప్లే 70 శాతం ఎల్సీడీ ప్యానల్స్‌ను సరఫరా చేసిందని తెలిసింది. ఆల్ట్రా స్లిమ్ బెజెల్స్‌లో రూపొందుతున్న ఈ ఫోన్‌కు, ఫేస్ ఐడీ, యానిమోజీస్ ఉంటాయని తాజా రిపోర్టు పేర్కొంది. 2017 ఐఫోన్ ఎక్స్ కంటే కూడా పెద్ద బ్యాటరీని ఇది కలిగి ఉంటుందట. అల్యూమినియం ఫ్రేమ్, నో 3డీ టచ్, సింగిల్ రియర్ కెమెరా దీనిలో మిగతా ఫీచర్లు. మరికొన్ని అంచనాల ప్రకారం ఈ ఐఫోన్ ఎక్స్, అచ్చం ఐఫోన్ ఎస్ఈ2 మాదిరిగా ఉండనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టుతో ఐఫోన్ ఎస్ఈ 2 కూడా మార్కెట్లోకి వస్తున్నట్టు డిజిటైమ్స్ రిపోర్టు సంకేతాలిచ్చింది. 2018లో రాబోతున్న మిగతా రెండు ఐఫోన్లు ఐఫోన్ ఎక్స్(2018), ఐఫోన్ ఎక్స్ ప్లస్‌లు 6.5 అంగుళాల, 5.8 అంగుళాల డిస్ప్లేలను కలిగి ఉన్నట్టు కూడా కుయో రిపోర్టు చేశారు. ఐఫోన్ ఎక్స్ ప్లస్‌కు 4జీబీ ర్యామ్, అతిపెద్ద 3300-3400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నాయి. డిజిటైమ్స్ రిపోర్టు ఆపిల్ ప్రస్తుతం నాలుగు ఐఫోన్ మోడల్స్‌పై పనిచేస్తుందని... దానిలో రెండు ఎల్సీడీ డిస్ప్లే ఫోన్లు కాగ, మరో రెండు ఓలెడ్ డిస్ప్లేలు కలిగి ఉన్న ఫోన్లని తెలిపింది. కానీ తర్వాత ఈ రిపోర్టు కూడా లాంచింగ్‌కు ఆపిల్ మూడు మోడల్స్‌నే పరిమితం చేసిందని అంచనా వేస్తోంది. -
బ్యాడ్‌న్యూస్ : ఐఫోన్ ఎక్స్ నిలిపివేత?
ఐఫోన్ పదో వార్షికోత్సవంగా టెక్ దిగ్గజం ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా, అత్యంత ఖరీదైన ఐఫోన్ ఎక్స్ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కొత్త డిజైన్‌లో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినప్పటికీ, ఆపిల్ బెస్ట్-సెల్లింగ్ ఐఫోన్లలో ఒకటిగా ఇది నిలువలేకపోతుంది. ప్రారంభం నుంచి విక్రయాల్లో తన సత్తా చాట లేకపోతున్న ఈ ఫోన్ ఆఖరికి నిలిపివేత దగ్గరికి వచ్చినట్టు తెలుస్తోంది. నిరాశజనకమైన ఐఫోన్ ఎక్స్ విక్రయాలు, ఈ ఫోన్‌ను పూర్తిగా నిలిపివేసేందుకు దారితీయవచ్చని కేజీఐ సెక్యురిటీస్ విశ్లేషకుడు మింగ్-చి క్యూ చెప్పారు. అంతకముందు 2018 తొలి క్వార్టర్లో ఆపిల్ ఈ ఐఫోన్‌ను 20-30 మిలియన్ యూనిట్లలో విక్రయిస్తుందని అంచనావేసిన కేజీఐ సెక్యురిటీస్ విశ్లేషకుడు మింగ్-చి, ప్రస్తుతం ఈ అంచనాలను మరింత తక్కువ చేశారు. కేవలం ఈ క్వార్టర్లో 18 మిలియన్ యూనిట్లనే విక్రయించవచ్చని పేర్కొన్నారు. ఈ ఫోన్‌కు చైనీస్ కస్టమర్ల నుంచి అంత మంచి ఫలితాలేమీ రావడం లేదని, దీంతో ఐఫోన్ ఎక్స్‌ను ఈ ఏడాది మధ్యలో నిలిపివేసి, అతిపెద్ద రీప్లేస్మెంట్ సైకిల్‌ను చేపట్టవచ్చని పేర్కొన్నారు. దీంతో ఐఫోన్ ఎక్స్ భవిష్యత్తు అనిశ్చితంగా మారబోతున్నట్టు వెల్లడవుతోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు కేవలం 62 మిలియన్ యూనిట్ల ఐఫోన్ ఎక్స్ విక్రయాలు మాత్రమే జరిగాయి. కానీ ఆపిల్ 80 మిలియన్ యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్, చైనా లాంటి దేశాల్లో ఈ ఫోన్‌కు సరియైన స్పందన రావడం లేదు. ధర ఎక్కువగా ఉండటంతో దీని కొనడానికి ఐఫోన్ అభిమానులు ఆసక్తి చూపకపోవడం మరో కారణంగా నిలుస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధరనే 89వేల రూపాయల వరకు ఉంది. హై వేరియంట్ ధర లక్ష రూపాయలకు పైమాటే. దీంతో ఐఫోన్ ఎక్స్‌నే తక్కువ ధరలో, పెద్ద స్క్రీన్‌ప్లేతో ప్రవేశపెట్టాలని ఆపిల్ యోచిస్తోంది. ఈ కొత్త మోడల్స్ మార్కెట్లోకి ప్రవేశపెట్టాక, ఐఫోన్ ఎక్స్ అమ్మకాలను నిలిపివేయొచ్చని తెలుస్తోంది. -
ఆ 8 ఫోన్లపై రూ.8వేల వరకు క్యాష్‌బ్యాక్
స్మార్ట్ఫోన్లపై ఈ-కామర్స్ కంపెనీలు భలే భలే ఆఫర్లను ప్రకటిస్తూ ఉన్నాయి. కేవలం ఈ-కామర్స్ వెబ్సైట్లు మాత్రమే కాక, టెలికాం ఆపరేటర్లు సైతం మొబైల్ ఫోన్లపై క్యాష్‌బ్యాక్‌లకు తెరలేపాయి. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ వెబ్సైట్లు, మొబైల్ కంపెనీలు అందిస్తున్న క్యాష్‌బ్యాక్ ఆఫర్ల వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం.. ఐఫోన్ ఎక్స్ : పేటీఎంలో రూ.4000 క్యాష్‌బ్యాక్ ఆపిల్ అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్సే. ఈ ఫోన్ 256జీబీ వేరియంట్‌పై రూ.4000 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం ప్లాట్‌ఫామ్‌పై పొందవచ్చు. రూ.1,01,498గా లిస్టు అయిన ఈ ఫోన్‌ను క్యాష్‌బ్యాక్ అనంతరం రూ.97,498కే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా 88,698 రూపాయల 64జీబీ వేరియంట్‌ను కూడా రూ.4000 క్యాష్‌బ్యాక్‌తో రూ.84,698కే వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను పొందడానికి యూజర్లు ప్రోమోకోడ్ ఏ4కే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. శాంసంగ్ నోట్8 : అమెజాన్‌లో రూ.8000 క్యాష్‌బ్యాక్ అమెజాన్ పే ను వాడుతూ నోట్ 8ను కొనుగోలు చేసిన వారికి రూ.8000 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. ఫోన్‌ను కస్టమర్‌కి పంపిన తర్వాత 72 గంటల వ్యవధిలో అమెజాన్ పేలో ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని క్రెడిట్ చేస్తారు. జనవరి 10 వరకే ఇది వాలిడ్‌లో ఉంటుంది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ : పేటీఎంపై రూ.6000 వరకు క్యాష్‌బ్యాక్ 2016లో లాంచ్ అయిన ఈ రెండు ఐఫోన్లపైనా రూ.6000 వరకు క్యాష్‌బ్యాక్ లభ్యమవుతోంది. రూ.57,690గా ఉన్న ఐఫోన్ 7, 256జీబీ వేరియంట్ రూ. 51,690కు అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవడానికి ఏ6కే కోడ్‌ను అప్లయ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 32జీబీ వేరియంట్ ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు కూడా రూ.5,500 వరకు క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. క్యాష్‌బ్యాక్ అనంతరం ఐఫోన్ 7 ప్లస్ రూ.51,604కు దిగొచ్చింది. మోటో జీ5ఎస్ ప్లస్ : పేటీఎంలో రూ.1,625 క్యాష్‌బ్యాక్ రిటైల్ ధరపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను మోటో జీ5ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై పేటీఎం ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్ కింద ఒక్కో యూజర్ మూడు ఆర్డర్లను బుక్ చేసుకోవడానికి ఉంది. ఇది కూడా కేవలం ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే. ఫోన్ షిప్ అయిన 24 గంటల వ్యవధిలో యూజర్ అకౌంట్లోకి ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని జమచేస్తారు. శాంసంగ్ గెలాక్సీ జే7 మ్యాక్స్ - వొడాఫోన్ ద్వారా రూ.1500 క్యాష్‌బ్యాక్ ఇటీవల శాంసంగ్‌తో జతకట్టిన వొడాఫోన్, గెలాక్సీ జే7 మ్యాక్స్ కొత్త, పాత యూజర్లకు రూ.1500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తుంది. ఎం-పైసా వాలెట్ల ద్వారా ఈ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ కస్టమర్లిందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. వివో వీ7 ప్లస్ : పేటీఎంలో రూ.1,100 క్యాష్‌బ్యాక్ రూ.21,990 ధర కలిగిన ఈ హ్యాండ్‌సెట్‌పై రూ.1100 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. క్యాష్‌బ్యాక్ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,890కి దిగొచ్చింది. 10.ఆర్ డీ స్మార్ట్‌ఫోన్ : జియో ద్వారా రూ.1500 క్యాష్‌బ్యాక్ 10.ఆర్ డీ స్మార్ట్‌ఫోన్ నిన్నటి నుంచే విక్రయానికి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై జియో ప్రైమ్ కస్టమర్లకు అమెజాన్‌లో రూ.1500 క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. అయితే యూజర్లు కనీసం రూ.199తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. -
ఆపిల్‌పై దాడులు : ఆ ఫోనే టార్గెట్
సియోల్ : దక్షిణ అమెరికాలో సూపర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్ లాంచింగ్‌కు ముందు ఆపిల్ సంస్థలపై రెగ్యులేటర్లు దాడులు జరిపాయి. అయితే ఈ దాడులపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఐఫోన్ ఎక్స్ విజయాన్ని నాశనం చేయడం కోసం దక్షిణ కొరియా అథారిటీలు ఇలాంటి కుట్రలకు పన్నాగాలు పన్నుతున్నారేమోనని లండన్‌కు చెందిన మెట్రో లేటు రిపోర్టు చేసింది. శుక్రవారం నుంచి దక్షిణ కొరియాలో ఐఫోన్ ఎక్స్ విక్రయానికి వచ్చింది. ఈ విక్రయానికి ముందు ఆపిల్ కార్యాలయాలపై రెగ్యులేటర్లు దాడులు నిర్వహించారు. ఈ వారం ప్రారంభంలో ఇన్వెస్టిగేటర్లు ఆపిల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారని, వ్యాపార పద్దతుల గురించి ప్రశ్నలు వేశారని రిపోర్టు తెలిపింది. ఆపిల్, ఇతర కంపెనీల నుంచి వస్తున్న పోటీ నుంచి స్థానిక కంపెనీలను రక్షించాలని కొరియా ఫెయిర్ ట్రేడ్ కమిషన్ కోరుతోంది. దక్షిణ కొరియాలో ఆపిల్ ఉత్పత్తులకు బాగా గిరాకి ఉంటుంది. స్థానిక దిగ్గజ కంపెనీలైన శాంసంగ్, ఎల్జీ ఉత్పత్తుల కంటే కూడా ఆపిల్ ఉత్పత్తులకే డిమాండ్ ఎక్కువ. అయితే స్థానిక ఫోన్ నెట్‌వర్క్‌లతో ఆపిల్ అన్యాయపూర్వకమైన కాంట్రాక్టులను ఏర్పరుచుకుందని ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్టిగేటర్లు 2016లోనే విచారణ చేపట్టారు. -
ఆ ఫోన్ కోసం విద్యార్థులు ఓవర్‌టైమ్ వర్క్
బీజింగ్ : ఐఫోన్ ఎక్స్... ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన నూతన స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్‌కు వినియోగదారుల నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చింది. డిమాండ్‌ను చేధించడానికి మరోవైపు కంపెనీకి ఉత్పత్తి ఆలస్యమైంది. దీంతో ఆపిల్ సప్లయిర్ ఫాక్స్‌కాన్ ఐఫోన్ ఎక్స్‌ను రూపొందించడానికి వేల కొద్ది విద్యార్థులను ఉద్యోగులుగా నియమించుకుంది. అంతేకాక వారితో ఓవర్‌టైమ్ వర్క్ కూడా చేయించినట్టు మీడియా రిపోర్టు చేసింది. ఫైనాన్సియల్ టైమ్స్ రిపోర్టు ప్రకారం 17 నుంచి 19 వయసు ఉన్న విద్యార్థులను ఫాక్స్‌కాన్ సెప్టెంబర్‌లో ఇంటర్న్‌లుగా నియమించుకుంది. చైనాలోని జెంగ్జౌ అసెంబ్లింగ్ యూనిట్లో వీరిని నియమించింది. మూడు నెలల పాటు ఇంటర్న్‌లుగా ఇక్కడ పనిచేస్తే పని అనుభవం కూడా వస్తుందంటూ పేర్కొంది. కానీ ఈ పని తమ చదువుకు ఏ మాత్రం సరిపోదని, తమ స్కూల్ వారు బలవంతం మీద ఇక్కడ పనిచేసినట్టు ఓ విద్యార్థిని చెప్పింది. ఈ విద్యార్థి 1200 ఐఫోన్ ఎక్స్‌లకు కెమెరాలను అసెంబుల్ చేసింది. స్థానికంగా ఉన్న ఈ ఫాక్స్‌కాన్ యూనిట్లో పనిచేస్తున్న 3000 మంది జెంగ్జౌ అర్బన్ రైల్ ట్రాన్సిట్ స్కూల్ విద్యార్థుల్లో ఈమె ఒకరు. కానీ ఆపిల్, ఫాక్స్‌కాన్ రెండు కంపెనీలు విద్యార్థులు స్వచ్ఛదంగానే ఈ పనిచేస్తున్నారని పేర్కొన్నాయి. స్థానిక ప్రభుత్వాలు, వొకేషనల్ స్కూల్స్ కోపరేషన్తోనే ఇంటర్న్‌షిప్ ప్రొగ్రామ్‌లను చేపడతామని ఫాక్స్‌కాన్ చెబుతోంది. కానీ చైనాలోని మరో మూడు ఫాక్స్‌కాన్ యూనిట్లు పనిగంటలను పెంచుతూ ఆరోగ్య, భద్రతా రెగ్యులేషన్లను ఉల్లంఘిస్తుందని గార్డియన్ రిపోర్టు చేసింది. ఎలాంటి పరిమితులు లేకుండా ఎక్కువ గంటల పాటు వర్కర్లను పనిచేయించేలా ఫ్యాక్టరీలకు ఆపిల్ అనుమతిస్తోందని న్యూయార్క్‌కు చెందిన లాభాపేక్ష లేని చైనా లేబర్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లి కయాంగ్ తెలిపారు. విద్యార్థులను రాత్రి సమయాల్లో పనిచేస్తుందని, ఎక్కువ గంటల పాటు పని చేయిస్తుందని పేర్కొన్నారు. -
ఐఫోన్ల కోసం అంత క్యూలు ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : ఆపిల్ కంపెనీ ప్రత్యేక ఎడిషన్ ‘ఆపిల్ ఎక్స్’ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు కూడా ఎప్పటిలాగే వినియోగదారులు ఒక రోజు ముందు నుంచే కంపెనీ షోరూమ్‌ల ముందు క్యూలో నిలుచున్నారు. పడిగాపులు గాశారు. ఆపిల్ కంపెనీ నుంచి ఏ కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసినప్పుడల్లా వినియోగదారులు ఒకటి, రెండు రోజుల ముందు నుంచే షాపుల ముందు క్యూలు కడుతున్నారు. గత పదేళ్లుగా ఇదే జరుగుతోంది. ఎందుకు వినియోగదారులు ఇలా క్యూలో నిలబడుతున్నారు. చాలా మందికన్నా ముందుగానే తాము కొత్త ఫోన్‌ను అందుకోవలనా? పరిమితంగా ఉత్పత్తి చేస్తున్నారు, ఆలస్యంగా వెళితే దొరకవనే ఉద్దేశమా? ఆపిల్ ఉత్పత్తులపైన ఉన్న క్రేజీనా? వినియోగదారుల్లో పెరిగిన కన్జూమరిజమా?, మూర్ఖత్వమా? ఆన్లైన్లో కూడా అమ్మకాలున్నప్పుడు షాపుల ముందే ఎందుకు పడిగాపులు పడాలి? ఇలా క్యూలో నిలబడడాన్ని శ్యామ్‌సంగ్ లాంటి పోటీ మొబైల్ ఫోన్ సంస్థలు యాడ్స్ రూపంలో అపహాస్యం చేస్తున్నా వినియోగదారులు క్యూలో నిలబడేందుకు ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు? ఇలా క్యూలో నిలబడ్డవారినే ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలు చేయగా చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. మొట్టమొదటి ప్రధాన కారణం మీడియానేనని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి క్యూలకు ఎక్కువ ప్రాధాన్యతను మొదటి నుంచి ఇస్తున్నది మీడియానే. మీడియాలో తాము కనిపిస్తామన్న ఉద్దేశంతో కొంత మంది వినియోగదారులు క్యూ కడుతుండగా, ఎక్కువ మంది తాము నిలబడ్డ చోటును అమ్ముకుంటున్నారు. ఈ చోటు విలువ అంతా, ఇంతా కూడా కాదు. మూడు వేల నుంచి 30 వేల రూపాయల వరకు ఉంటోంది. క్యూలో ముందున్న వ్యక్తి తన చోటును 30వేల రూపాయలకు విక్రయిస్తుండగా, పదవ స్థానంలో ఉన్న వ్యక్తి ఎనిమిది నుంచి 15 వేల రూపాయల వరకు అమ్ముతున్నారు. కొందరు తమ యాప్స్ పబ్లిసిటీ కోసం క్యూలను ఉపయోగించుకుంటున్నారు. తమ యాడ్ కలిగిన టీషర్టులు ధరించి క్యూలో నిలబడిన వారికి, వారి వారి డిమాండ్ల మేరకు డబ్బులు చెల్లిస్తున్నారు. కొన్ని యాప్స్ సంస్థలు తమ వాలంటీర్లనే డబ్బులిచ్చి నిలబెడుతున్నాయి. ఇటీవల ఐఫోన్ ఆపిల్ ఎక్స్ విడుదల సందర్భంగా సిడ్నీలో క్యూలో ముందు నిలబడిన వ్యక్తి ‘యూట్యూబర్’. ఫోన్ విడుదలపై యూట్యూబ్ డాక్యుమెంటరీ తీయాలనుకున్నారు. అందులో ప్రధానంగా కనిపించడం కోసం మొదటి స్థానంలో నిలబడ్డారు. ఇక రెండు, మూడోస్థానంలో నిలబడ్డవారు ‘డెయిలీ మిర్రర్’ వెబ్‌సైట్‌కు లైవ్ బ్లాగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో ఫుడ్ కంపెనీలు కూడా ఏమీ తీసిపోలేదు. తమ ఉత్పత్తులను పబ్లిసిటీ కోసం క్యూలో నిలుచున్న వారికి ఉచితంగా అందజేస్తున్నాయి. గ్రెగ్స్, డామినోస్, నండోస్, సబ్వే కంపెనీలు ఈ విషయంలో పోటీ పడ్డాయి. తమ ఉత్పత్తులను వినియోగదారులు తింటుంటే మీడియాలో వాటి బ్రాండ్ల పేర్లు కనిపిస్తాయన్నది ఆహార కంపెనీల ఆశ. చారిటీ సంస్థల ప్రతినిధులు కూడా నిధుల కోసం క్యూలో నిలబడుతుండడం విశేషం. ఇలా ఆపిల్ క్యూల వెనక ఎవరి ప్రయోజనాలు వారికున్నాయి. అందరికన్నా ఎక్కువ ప్రయోజనం మాత్రం ఆపిల్ కంపెనీకే. -
మరోసారి జియో ఆఫర్లు: రూ.27వేలకే ఐఫోన్10..కానీ
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మరోసారి ఆపిల్ ఐఫోన్లపై బంపర్ ఆఫర్లతో ఐఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఆపిల్ కంపెనీ తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఐ ఫోన్ 10(x) పై రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ నిలిచి ఐఫోన్ 10ను 70శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో కేవలం రూ. 26,7700 కే అందించనుంది. 256 జీబీ ఐ ఫోన్ 10 ధర రూ.30,600లకు లభ్యం కానుంది. కేవలం రిలయన్స్ జియో వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తింపచేయనున్నట్టు జియో వెల్లడించింది. అయితే దీనికి కొన్ని షరతులు కూడా ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ X పై 70శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఇక షరతుల విషయానికి వస్తే.. రిలయన్స్ జియో కస్టమర్లు అయి వుండాలి. ఒక సంవత్సరం తరువాత ఈ స్మార్ట్‌ఫోన్‌నుతిరిగి జియోకి అప్పగించాల్సి ఉంటుంది. అదీ పూర్తిగా పనిచేసే స్థితిలో ఉన్నట్లయితే కంపెనీ దాన్ని తిరిగి కొనుగోలు చేస్తుంది. అలాగే నమోదు చేసుకున్న తేదీ నుంచి పోస్ట్ పెయిడ్ ఖాతాదారులు నెలకు రూ.799 చొప్పున 12 నెలలు రీచార్జ్ తప్పనిసరిగా చేయించుకోవాలి. లేదా రూ. 9,999 వార్షిక రీఛార్జిని ఒకేసారి చేయించుకోవాలి. జియో స్టోర్, మై జియో యాప్ , రిలయన్స్ డిజిటల్, లేదా అమెజాన్‌లో కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 31 వరకు కొనుగోళ్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఐ ఫోన్ 10(64జీబీ) కొనుగోలు సమయంలో అసలు ధర రూ. 89వేలు చెల్లించాలి. సం.రం తరువాత పూర్తిగా కండీషన్లో ఉన్న ఐఫోన్‌ను తిరిగి జియోకి ఇస్తే ఆ సమయంలో రూ.62,300 లను జియో చెల్లిస్తుంది. ఇదే నిబంధన రూ. 1,02,000 విలువైన ఐ ఫోన్ 10 (256 జీబీ ధర) కూడా వర్తిస్తాయి. దీనిపై రూ. 71,400 లను జియో వాపస్ ఇస్తుంది. ఒక వేళ ఈ డివైస్‌కు పాక్షికంగా ఏదైనా డామేజ్ జరిగితే ఇచ్చే చెల్లింపుపై ఎలాంటి క్లారిటీ లేదు. కాగా గతంలో ఆపిల్ ఐఫోన్ 8 , ఐ ఫోన 8 ప్లస్‌ను రిలయన్స్ ద్వారా కొనుగోలు చేసిన జియో వినియోగదారులకి ఒక సంవత్సరం తర్వాత తిరిగి ఇస్తే అనే షరతుపై అసలు కొనుగోలు ధరలో 70 శాతం తిరిగి ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఐఫోన్ X కొన్న ఆనందంలో విచిత్రమైన ఆలోచన