
అప్పుడే ఐఫోన్ ఎక్స్‌కు నకిలీ.. చాలా చీప్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో ఏవస్తువు విడుదలైనా రెండో రోజే చైనాలో దానికి నకిలీ రెడీగా ఉంటుంది. ఎలాంటిదానికైనా చైనా కంపెనీలు ఇట్టే నకిలీ సృష్టించగలవు. ఇప్పడు మార్కెట్‌లో తాజా సంచలనం ఐఫోన్ ఎక్స్. ప్రకటించి పట్టుమని పది రోజులు కూడా కాలేదు. కానీ అప్పుడే ఐఫోన్ ఎక్స్‌కు జిరాక్స్‌లా ఉండే ఫోన్‌ను తయారు చేసింది చైనాకు చెందిన జూఫోన్ కంపెనీ.
ప్రపంచంలో ఏకొత్త ఫోన్ విడుదలైనా రెండో రోజే ఆమోడల్‌తో నకిలీ ఫోన్‌లు విడుదల చేయడంలో ఈకంపెనీ ముందుంటుంది. ఈ తరహాలోనే ఐఫోన్ ఎక్స్‌కు డూప్లికేట్ ఫోన్‌ను జూఫోన్ ఎక్స్ పేరుతో విడుదల చేసింది. అయితే ఇది ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ధర రూ.6500 ఉంటుంది. ఐఫోన్ ఎక్స్‌పెట్టే ధరతో 14 జూఫోన్ ఎక్స్‌లు కొనుక్కోవచ్చు.
ఫోన్ ఫీచర్లు
స్క్రీన్ 5.5 అంగుళాలు
ర్యామ్ 1జీబీ, ఇంటర్నల్ స్టోరేజి 16జీబీ
డ్యూయెల్ సిమ్‌కార్డు ఉపయోగించవచ్చు
720*1280 పిక్సెల్ హెచ్‌డీ డిస్‌ప్లే
4జీ ఎల్టీఈ లేదు. 3జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది.
వెనుక భాగంలో రెండు కెమెరాలను ఏర్పాటు చేసింది.
ధర దాదాపు రూ.6500