
న్యూఢిల్లీ : టెక్నాలజీ దిగ్గజం ఎయిర్‌టెల్ ఇటీవల లాంచ్ చేసిన తన కొత్త ఆన్‌లైన్ స్టోర్‌లో ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా, స్పెషల్‌గా తీసుకొచ్చిన ఐఫోన్ ఎక్స్ అందుబాటులో ఉంచుతోంది. నవంబర్ 3 నుంచి ఎయిర్‌టెల్ స్టోర్‌లో ఐఫోన్ ఎక్స్‌ను విక్రయించబోతున్నట్టు తెలిసింది. తమ పాత కస్టమర్లకు, కొత్త హైవాల్యు కస్టమర్లకు ఈ ఫోన్‌ను అందుబాటులో ఉంచబోతుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే ఈ స్టోర్ ప్రీ-ఆర్డర్లను స్వీకరిస్తుందో లేదో ఇంకా స్పష్టత లేదు. కానీ ఐఫోన్ ఎక్స్‌తో పాటు కొన్ని ప్లాన్లను ఎయిర్‌టెల్ ఆఫర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. పరిమిత సంఖ్యలోనే గ్లోబల్‌గా ఐఫోన్ ఎక్స్ అందుబాటులోకి వస్తోంది. ఐఫోన్ ఎక్స్ రాక కోసం ఎదురుచూస్తున్న ప్లాట్‌ఫామ్‌లలో ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ స్టోర్ కూడా ఒకటని ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఎక్కువ విలువ కలిగిన కస్టమర్లను సొంతం చేసుకోవడానికి రిలయన్స్ జియోతో ఎయిర్‌టెల్ మరోసారి పోటీ పడుతోంది.
ఐఫోన్ 8, 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్‌లతో జియో అంతకముందే భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ ఫోన్లపై 70 శాతం బైబ్యాక్ గ్యారెంటీని కూడా రిలయన్స్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలంటే కస్టమర్లు రూ.799 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో ఉన్న జియో ప్లాన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ తన ఆన్‌లైన్ స్టోర్‌లో ఐఫోన్ 7 కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ.7777 డౌన్ పేమెంట్‌తో ఐఫోన్ 7ను అందజేసేలా ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ స్టోర్ ఆఫర్ ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.2,499 చొప్పున 24 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. నెలకు 30 జీబీ డేటా, అపరిమిత లోకల్/ఎస్టీడీ కాల్స్‌తో పాటు, ఎయిర్‌టెల్ సెక్యూర్ ప్యాకేజీని కంపెనీ అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment