
ఐఫోన్ ఎక్స్ విక్రయానికి వచ్చి ఒక్కరోజు మాత్రమే.. కానీ అప్పుడే ఈ ఫోన్ వీధుల్లో హల్‌చల్ చేస్తోంది. వచ్చిన రోజే కొనడం అయిపోయింది... అప్పుడే ఆ ఫోన్‌ను వీధుల్లో విక్రయించేస్తున్నారు. అదేమిటి అనుకుంటున్నారా? ప్రస్తుతం హాంకాంగ్ గ్రే మార్కెట్‌లో జరుగుతున్న తతంగం. ఆపిల్ కొత్త ఈ ఐఫోన్‌ను హాంకాంగ్ గ్రే మార్కెట్ ట్రేడ్ ఫుల్‌గా అమ్ముడుపోతుంది. మాంగ్‌కాక్ నగరంలో అత్యంత రద్దీ కల షాపింగ్ ప్రాంతమైన అర్గిలే స్ట్రీట్ ఈ ఫోన్‌ను డజన్ కార్డు టేబుల్స్‌ను, స్టైరోఫోమ్‌బాక్స్‌లు ఏర్పాటుచేసి మరీ విక్రయిస్తున్నారు. ఆపిల్ రిటైల్స్ ఈ ఫోన్ 256జీబీ వేరియంట్ ధర హాంకాంగ్ డాలర్ 9,888 కాగ, 64జీబీ వేరియంట్ ధర హాంకాంగ్ డాలర్ 8,588.
ప్రస్తుతం హాకాంగ్ వీధుల్లో ఈ ఫోన్ ఎక్స్ 256జీబీ వేరియంట్ ధర హాంకాంగ్ డాలర్ 10,300 నుంచి హాంకాంగ్ డాలర్ 10,500 పలుకుతోంది. అదేవిధంగా 64జీబీ వేరియంట్ ధర హాంకాంగ్ డాలర్ 8,800 నుంచి హాంకాంగ్ డాలర్ 8,900 మధ్యలో విక్రయిస్తున్నారు. నేటి నుంచి గ్లోబల్‌గా విక్రయానికి వచ్చిన ఈ ఐఫోన్ ఎక్స్ కోసం టోక్యో నుంచి సిడ్నీ వరకు అన్ని ఆపిల్ స్టోర్లలోనూ పెద్ద పెద్ద క్యూలే దర్శనమిచ్చాయి. ముఖం గుర్తింపు విధానం, 3జీ సెన్సార్స్ వంటి కొత్త కొత్త ఆవిష్కరణలతో ఈ ఫోన్ అమ్మకానికి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment