
న్యూఢిల్లీ : ఐఫోన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా మార్కెట్‌లోకి వచ్చిన ఆపిల్ అత్యంత ఖరీదైన ఫోన్ ఐఫోన్ ఎక్స్. ఈ స్మార్ట్‌ఫోన్ నేటి మధ్యాహ్నం నుంచి భారత్‌లో ప్రీ-ఆర్డర్‌కు వచ్చింది. ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్‌కు వచ్చిన 15 నిమిషాల్లో లోపే అవుటాఫ్ స్టాక్ అయింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండు వెబ్‌సైట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ స్టాక్ 15 నిమిషాల్లోనే అయిపోయింది. ఐఫోన్ ఎక్స్‌పై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు రెండూ బంపర్ ఆఫర్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేసే సిటిబ్యాంకు క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు రూ.10వేల క్యాష్‌బ్యాక్ ఈ వెబ్‌సైట్లు అందిస్తున్నాయి. అంతేకాక రిలయన్స్ జియో భాగస్వామ్యంలో అమెజాన్ 70 శాతం బైబ్యాక్ గ్యారెంటీని ఆఫర్ చేస్తోంది. ఈ బైబ్యాక్ గ్యారెంటీ పొందాలంటే, వినియోగదారుడు రూ.799తో జియో కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ 2017 నవంబర్ 3 నుంచి 2017 డిసెంబర్ 31 వరకు వాలిడ్‌లో ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్ కూడా ఐఫోన్ ఎక్స్‌పై పలు ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌తో పాటు ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేసే వారికి రూ.15వేల క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. దాంతో పాటు ఆపిల్ వాచ్ సిరీస్3 తో ఐఫోన్ ఎక్స్‌ను కొంటే రూ.20వేల క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. అంతేకాక రూ.20వేల ఎక్స్చేంజ్ ఆఫర్, రూ.52వేల విలువైన బైబ్యాక్ విలువను ఫ్లిప్‌కార్ట్ నుంచి కస్టమర్లు పొందవచ్చు. ఐఫోన్ ఎక్స్ ధర భారత్‌లో రూ.89వేల నుంచి ప్రారంభమవుతోంది. దీని హైవేరియంట్ ఖరీదు లక్ష రూపాయలకు పైననే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment