శాన్‌ఫ్రాన్సిస్కో: ఆపిల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఐ ఫోన్ ఎక్స్‌పైతాజా మరో షాకింగ్‌న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అతిఖరీదైన హైఎండ్ స్మార్ట్‌ఫోన్ ఐ ఫోన్ ఎక్స్ భారీగా చోరీకి గురికావడం కలకలం రేపింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆపిల్ స్టోర్‌లో ఈ దొంగతనం జరిగింది. సుమారు మూడు వందలకుపైగా ఆపిల్ హాట్ ఫోన్ ఐ ఫోన్ ఎక్స్ డివైస్‌లను చోరులు అపహరించుకుపోయారు.
పోలీసులు అందించిన నివేదిక ప్రకారం 313 డివైస్‌లు చోరీకి గురయ్యాయి. ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు ఆపిల్ స్టోర్‌ముందు పార్కింగ్ చేసిన యూపీఎస్ ట్రక్‌ను అటకాయించి వీటిని ఎత్తుకెళ్ళారు. వీటి విలువ 370, 000 డాలర్లకంటే ఎక్కువ ఉంటుందని అంచనా. అనుమానితులను ఇంకా గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనపై అటు యూపీఎస్‌సంస్థ, ఇటు ఆపిల్ విచారణ చేపట్టింది.
దొంగిలించిన ఐఫోన్ల వ్యాపారం దీర్ఘకాలంగా లాభసాటిగా ఉంది. మరోవైపు ‘ఫైండ్ మై ఐపోన్’, రిమోట్ లాకౌట్ పేరుతో కొత్త ఫీచర్‌ను ఆపిల్‌ను అందుబాటులోకి తేవడంతో ఐ ఫోన్ల దొంగతనాలు బాగా తగ్గాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి విక్రయానికి ముందే రాకముందే భారీ ఎత్తుర ఐ ఫోన్లు చోరీకి గురి కావడం గమనార్హం.
కాగా భారత మార్కెట్లో నవంబర్ 3 సాయంత్రం. 6గంటలనుంచి ఐ ఫోన్ ఎక్స్ రూ.89వేల ప్రారంభ ధరనుంచి విక్రయానికి అందుబాటులోకి వచ్చాయి. నవంబర్ 3 ముందు అక్టోబర్ 27 ప్రీ ఆర్డర్ ప్రారంభించినప్పుడు నిమిషాల్లో ఐ ఫోన్ ఎక్స్ ఫోన్లు ఔట్ ఆఫ్‌స్టాక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment