మరోసారి జియో ఆఫర్లు: రూ.27వేలకే ఐఫోన్‌10..కానీ | Apple iPhone X now available at just Rs. 26,700 with Reliance Jio offers | Sakshi
Sakshi News home page

మరోసారి జియో ఆఫర్లు: రూ.27వేలకే ఐఫోన్‌10..కానీ

Published Sat, Nov 4 2017 6:56 PM | Last Updated on Sat, Nov 4 2017 7:04 PM

Apple iPhone X now available at just Rs. 26,700 with Reliance Jio offers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో మరోసారి ఆపిల్‌ ఐఫోన్లపై బంపర్‌ ఆఫర్లతో  ఐఫోన్‌  లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.  ఆపిల్‌ కంపెనీ  తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఐ ఫోన్‌ 10(x) పై రిలయన్స్ జియో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.  అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ నిలిచి ఐఫోన్‌ 10ను 70శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌తో కేవలం రూ. 26,7700 కే అందించనుంది. 256 జీబీ ఐ ఫోన్‌ 10 ధర రూ.30,600లకు లభ్యం కానుంది.  కేవలం రిలయన్స్‌ జియో వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తింపచేయనున్నట్టు జియో వెల్లడించింది.  అయితే దీనికి  కొన్ని షరతులు కూడా ప్రకటించింది.

ఆపిల్ ఐఫోన్ X పై 70శాతం క్యాష్‌ బ్యాక్‌ ప్రకటించింది. ఇక షరతుల విషయానికి వస్తే.. రిలయన్స్‌ జియో కస్టమర్లు అయి వుండాలి.  ఒక సంవత్సరం తరువాత ఈ స్మార్ట్‌ఫోన్‌నుతిరిగి  జియోకి అప్పగించాల్సి ఉంటుంది. అదీ  పూర్తిగా పనిచేసే స్థితిలో ఉన్నట్లయితే కంపెనీ దాన్ని తిరిగి కొనుగోలు చేస్తుంది.  అలాగే నమోదు చేసుకున్న తేదీ నుంచి  పోస్ట్‌ పెయిడ్‌ ఖాతాదారులు నెలకు రూ.799 చొప్పున 12 నెలలు  రీచార్జ్‌ తప్పనిసరిగా చేయించుకోవాలి.  లేదా  రూ. 9,999 వార్షిక రీఛార్జిని  ఒకేసారి చేయించుకోవాలి. జియో స్టోర్‌, మై జియో యాప్‌ , రిలయన్స్‌  డిజిటల్‌,  లేదా అమెజాన్‌లో కొనుగోలు చేసిన వారికి మాత్రమే  ఈ  ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. డిసెంబర్‌ 31 వరకు కొనుగోళ్లపై ఈ ఆఫర్  వర్తిస్తుంది. 

ఐ ఫోన్‌ 10(64జీబీ) కొనుగోలు సమయంలో  అసలు ధర రూ. 89వేలు  చెల్లించాలి. సం.రం తరువాత  పూర్తిగా కండీషన్‌లో ఉన్న ఐఫోన్‌ను తిరిగి జియోకి ఇస్తే  ఆ సమయంలో​ రూ.62,300 లను జియో చెల్లిస్తుంది. ఇదే నిబంధన రూ. 1,02,000 విలువైన ఐ ఫోన్‌ 10 (256 జీబీ ధర) కూడా వర్తిస్తాయి.  దీనిపై  రూ. 71,400 లను జియో వాపస్‌ ఇస్తుంది.  ఒక వేళ ఈ డివైస్‌కు పాక్షికంగా ఏదైనా డామేజ్‌ జరిగితే ఇచ్చే చెల్లింపుపై ఎలాంటి క్లారిటీ లేదు. 

కాగా గతంలో ఆపిల్ ఐఫోన్ 8 ,  ఐ ఫోన​ 8 ప్లస్‌ను  రిలయన్స్‌  ద్వారా కొనుగోలు  చేసిన జియో వినియోగదారులకి ఒక సంవత్సరం తర్వాత తిరిగి ఇస్తే అనే షరతుపై అసలు కొనుగోలు ధరలో 70 శాతం తిరిగి ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement