
థానే : వార్తల్లో నిలిచేందుకు కొందరు విచిత్రమైన స్టంట్లు చేస్తున్నారు. థానేకు చెందిన పల్లివల్ అనే యువకుడు కూడా అదే దారిని ఎంచుకున్నాడు. గుర్రం మీద బ్యాండ్ మేళంతో ఊరంతా ఊరేగాడు. అయితే అతని చేష్టలకు కారణం లేకపోలేదు. ఐఫోన్ X సొంతం చేసుకోబోతున్న ఆనందమే అతనితో ఆ పని చేయించింది.
నైపదా ప్రాంతానికి చెందిన పల్లివల్ ఐ ఫోన్ Xకు ఆర్డర్ ఇచ్చాడు. శుక్రవారం సాయంత్రం దానిని డెలివరీ చేస్తామని షో రూం వాళ్లు చెప్పారు. దీంతో బ్రాండ్ న్యూ ఫోన్ తన చేతికి దక్కుతుందన్న ఆనందంలో విచిత్రమైన ఆలోచన చేశాడు. గుర్రంపై ఐ లవ్ ఐఫోన్ ఎక్స్ అనే బ్యానర్ పట్టుకుని గుర్రం మీద ముందు వెళ్తుంటే.. వెనకాల బాండ్ పార్టీ అతని అనుసరిస్తూ వచ్చింది. అలా హరినివాస్ సర్కిల్‌లోని షోరూం దాకా ర్యాలీ సాగింది. ఆ హడావుడి చూసి పెళ్లి సందడి అనుకున్నంత వారంతా ఫోన్ కోసమని తెలియగానే వార్నీ యేషాలో అనుకున్నారు. గుర్రం మీద ఉన్న పల్లివల్‌కు స్టోర్ ఓనర్ అశిష్ థక్కర్ స్వయంగా ఫోన్ అందించి శుభాకాంక్షలు తెలియజేశాడు.
ఆపిల్ కంపెనీ ఐఫోన్ 10వ సిరీస్‌లో భాగంగా వచ్చిన ఫోన్ ప్రారంభ ధర రూ. 89,000 వేల నుంచి గరిష్ఠ ధర రూ. 1,02,000 దాకా పలుకుతోంది. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా హ్యాపీనెస్ అంటూ ఆ ఫోన్ ఫోటోతో ఓ ట్వీట్ చేయటం విశేషం.
Happiness!! #iPhoneX pic.twitter.com/r2cFknpOeU
— Abhishek Bachchan (@juniorbachchan) November 4, 2017
ఐఫోన్ X కొన్న ఆనందంలో విచిత్రమైన ఆలోచన
Comments
Please login to add a commentAdd a comment