
న్యూఢిల్లీ : ఐఫోన్ 10ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐఫోన్ ఎక్స్ అమ్మకాలు భారత్‌లో నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి రిటైల్ స్టోర్‌ల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆపిల్ రీసెల్లర్స్, ఇతర పార్టనర్ అవుట్‌లెట్లన్నీ పలు ఆఫర్లతో అక్టోబర్ 27నే ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్లను చేపట్టాయి. ఈ ఆఫర్లలో సిటీబ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లకు రూ.10వేల క్యాష్‌బ్యాక్, జియో బైబ్యాక్ ఆఫర్ కలిసి ఉండనున్నాయి.
అదేవిధంగా టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కూడా తన ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్‌ను విక్రయానికి తీసుకొస్తోంది. ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్‌ను చేపట్టనప్పటికీ, తన ఆన్‌లైన్ స్టోర్‌లో పరిమిత కాల వ్యవధిలో క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. నేటి(శుక్రవారం) సాయంత్రం ఆరు గంటల నుంచి శనివారం ఉదయం ఏడు గంటల వరకు ఈ ఫోన్‌పై క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. 64జీబీ వెర్షన్ గల ఈ ఫోన్ ధర రూ.89వేలు. అదేవిధంగా హైవేరియంట్ 256జీబీ ఫోన్ ధర 1,02,000 రూపాయలుగా ఉంది. సిల్వర్, స్పేస్ గ్రే రంగుల్లో ఇది అందుబాటులోకి ఉంటుంది. అన్ని కొత్త ఐఫోన్ ఎక్స్ లెదర్ ఫోలియో రూ.8,600కే అందుబాటులో ఉంటుంది.
ఐఫోన్ ఎక్స్ స్పెషిఫికేషన్లు..
5.8 అంగుళాల సూపర్ రెటీనా డిస్‌ప్లే
ఫేస్ ఐడీ, వైర్‌లెస్ ఛార్జింగ్
వాటర్, డస్ట్ రెసిస్టాన్స్
12 మెగాపిక్సెల్‌తో రెండు వెనుక కెమెరాలు
7 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ ఫేస్‌టైమ్ హెచ్‌డీ కెమెరా
ఏ11 బయోనిక్ ప్రాసెసర్
Comments
Please login to add a commentAdd a comment