టెక్ దిగ్గజం ఆపిల్ తీసుకొచ్చిన బిగ్గెస్ట్ లాంచ్ భారత్‌కు వచ్చేస్తోంది. నేటి నుంచి ఐఫోన్ ఎక్స్ ప్రీ-ఆర్డర్లు భారత్‌లో ప్రారంభం కానున్నాయి. భారత్‌తో పాటు 55 దేశాల్లో ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్లను కంపెనీ ప్రారంభిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు ఈ ఫోన్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఈ డివైజ్‌ను ఆఫర్ చేస్తుండగా.. ఆఫ్‌లైన్‌గా ఆపిల్ అధికారిక రిటైలర్ వద్ద కంపెనీ ప్రీ-ఆర్డర్లను చేపడుతోంది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఈ డివైజ్‌ను తన వెబ్‌సైట్‌లో లిస్టు చేసింది. కమింగ్ సూన్ అనే సంకేతంతో దీన్ని తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. మధ్యాహ్నం 12:31 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు దీని ప్రీ-ఆర్డర్లను చేపడుతున్నాయి.
ఐఫోన్ ఎక్స్ ధర భారత్‌లో రూ.89వేల నుంచి ప్రారంభమవుతోంది. దివాళి సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ఐఫోన్ ఎక్స్‌తో పాటు లాంచ్‌చేసిన ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్‌ల విక్రయాలని కంపెనీ గత నెలలోనే చేపట్టింది. అయితే ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్‌లకు అంత డిమాండ్ లేదని, ఐఫోన్ ఎక్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు ఆపిల్ నుంచి విడుదలైన అత్యంత ఖరీదైన డివైజ్ ఐఫోన్ ఎక్సే. దీని అతిపెద్ద వేరియంట్ ఖరీదు లక్షకు పైనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment