Pre-Orders
-
ఆపిల్ వాచెస్: జియో ఆఫర్లు
సాక్షి, ముంబై: సంచలన మొబైల్ డేటా నెట్వర్క్ రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం మరో కొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. యాపిల్ వాచ్ సీరిస్3లోని సెల్యులార్ వాచ్‌లను జియో కస్టమర్లకుఅందుబాటులోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా రిలయన్స్ జియో.కాం, జియో స్టోర్స్‌లలో, రిలయన్స్ డిజిటల్స్ ద్వారా మే11 నుంచి విక్రయానికి ఇవి లభ్యం కానున్నాయి. అలాగే మే4వ తేదీనుంచి ప్రీ ఆర్డర్ చేసుకును అవకాశాన్నికూడా కల్పిస్తున్నట్టు జియో తెలిపింది. దీంతో ఆపిల్ వాచ్ 3 సిరీస్‌లను విక్రయిస్తున్న తొలి 4జీ ఆపరేటర్‌గా అవతరించింది. ఈ మేరకు జియో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రీ బుకింగ్ ఆఫర్లు: యాపిల్ వాచ్ సిరీస్ 3 జియో ఎవ్రీవేర్ కనెక్ట్ సర్వీస్‌తో అందిస్తోంది. దీంతో జియో నెంబర్‌ను ఐఫోన్, యాపిల్ వాచ్ సిరీస్ 3 సెల్యులర్ రెండింటిలోనూ ఉపయోగించు కోవచ్చు. అంటే నెంబర్ పోర్టబులిటీ ఉచితం అన్నమాట. ఇందుకు ఐ ఫోన్లో యాపిల్ వాచ్ ఐకాన్ ఓపెన్ చేసి, జియో నెంబర్‌తో అనుసంధానం చేసుకోవాలి. అయితే వినియోగదారులు తమకు ఐఫోన్ 6ఎస్, లేదా కొత్త మోడల్ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టం 11.3 లేదా ఆ తరువాతదని నిర్ధారించుకోవాలి. అలాగే ఈ సిరీస్‌ను అందుకునే తొలి కస్టమర్ కావచ్చు. అంతేకాదు హోమ్ డెలివరీ అవకాశం కూడా ఉందని జియో వెల్లడించింది. టారిఫ్: ఈ సుప్రీం సేవలకు రిలయన్స్ జియో ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయదు. జియోలో వాడుతున్న అన్ని ప్లాన్లను ఇందులో కూడా పొందవచ్చు. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ చందాదారులకు ఈ ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. యాపిల్ వాచ్ సిరీస్ 3 (ఎల్టీఈ+జీపీఎస్)ఫీచర్లు: మూడవ తరం ఆపిల్ వాచెస్ ద్వారా మ్యూజిక్ వినవచ్చు..సెల్యులార్ కనెక్టివిటీతో ఫోన్ లేకుండానే ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఇందులో డ్యూయల్ కోర్ ప్రాసెసర్, వాటర్ రెసిస్టెంట్, కొత్తబారో మెట్రిక్ అల్టీమీటర్, బిల్ట్ ఇన్స్పీకర్(సిరి) లాంటి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. -
ఆ రెండు నోకియా ఫోన్ల ప్రీ-ఆర్డర్లు
హెచ్ఎండీ గ్లోబల్ ఇటీవల లాంచ్ చేసిన నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో స్మార్ట్ఫోన్ల ప్రీ-ఆర్డర్లు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. భారత్‌లో ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లను ప్రారంభించినట్టు హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. మార్చిలో ఈ రెండు స్మార్ట్ఫోన్లు గ్లోబల్‌గా అందుబాటులోకి రాగ, ఈ నెల మొదట్లో భారత్‌లో లాంచ్ అయ్యాయి. ఏప్రిల్ 30 నుంచి ఈ స్మార్ట్ఫోన్లు వినియోగదారుల చేతిలోకి రానున్నాయి. నోకియా 7 ప్లస్ ధర రూ.25,999గా కంపెనీ నిర్ణయించగా.. అమెజాన్ ఇండియా, నోకియా.కామ్/ఫోన్లలో ఇది అందుబాటులో ఉండనుంది. నోకియా సిరోకో ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, నోకియా మొబైల్ షాపులో లభ్యం కానుంది. సంగీత, పూర్విక, బిగ్ సి, క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి ఎంపిక చేసిన అవుట్లెట్లలో కూడా ఈ రెండు హ్యాండ్సెట్లు దొరకనున్నాయి. నోకియా 7 ప్లస్ కొనుగోలుదారులకు ఎయిర్టెల్ నెట్వర్క్ రూ.2000 క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. అదేవిధంగా నోకియా 8 సిరోకో స్మార్ట్‌ఫోన్‌ఫై ఎయిర్టెల్ తన యూజర్లకు 20జీబీ అదనపు డేటాను ఆఫర్ చేయనుంది. పోస్టుపెయిడ్ కస్టమర్లు రూ.399, రూ.499 ప్లాన్లపై నెలకు 20జీబీ కాంప్లిమెంటరీ డేటా పొందనున్నారు. 2018 డిసెంబర్ 31 వరకు ఎయిర్టెల్ టీవీ యాప్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను అందించనుంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లను ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లు 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందనున్నారు. మేక్మైట్రిప్ ద్వారా జరిపే దేశీయ హోటల్స్ బుకింగ్స్‌పై 25 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభించనుంది. నోకియా 7 ప్లస్ ఫీచర్లు 6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ఎస్ఓసీ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ వీ5.0, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్. నోకియా 8 సిరోకో ఫీచర్లు 5.5 ఇంచ్ డిస్ప్లే, 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బారోమీటర్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్బీ టైప్ సి, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్. -
ప్రీ-ఆర్డర్‌కు వచ్చిన రెడ్మి నోట్ 5 ప్రొ
షావోమి రెడ్మి నోట్ 5 సిరీస్‌లో హై-ఎండ్ వేరియంట్ రెడ్మి నోట్ 5 ప్రొ నేడు ప్రీ-ఆర్డర్స్‌కు వచ్చేసింది. షావోమి ఈ-కామర్స్ వెబ్సైట్ ఎంఐ.కామ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ప్రీ-ఆర్డర్లకు ఉంచింది. దీంతో ఇక నుంచి రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్‌సేల్ కోసం వేచిచూడాల్సినవసరం లేదు. ఈ ఫోన్ ఫ్లాష్ సేల్కు వచ్చిన ప్రతీసారి‘సోల్డ్ అవుట్’ అని దర్శనమిస్తుండటంతో వినియోగదారులు తీవ్ర నిరాశకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ రెడ్మి నోట్ 5 ప్రొ ప్రీ-ఆర్డర్లను స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎంఐ వెబ్సైట్ ద్వారా ఈ ఫోన్‌ను ఆర్డర్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ ఫోన్‌ను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్లో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంచింది. ఆర్డర్ చేసిన తర్వాత రెండు లేదా నాలుగు వారాల్లో ఈ ఫోన్‌ను వినియోగదారుడికి డెలివరీ అవుతుంది. ఒక వ్యక్తి ఒకటి, లేదా రెండు మాత్రమే ఫోన్లను ఆర్డర్ చేసే సౌకర్యం కల్పించింది. ఒకవేళ ముందస్తు ఆర్డర్‌ను రద్దు చేసుకోవాలనుకుంటే ఫోన్ షిప్పింగ్ కన్నా ముందే రద్దు చేసుకోవాలి. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా రెడ్మి నోట్ 5 ప్రొ అందుబాటులో ఉంటుంది. కానీ వీక్లీ ఫ్లాష్ సేల్స్ ద్వారానే ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను విక్రయించనుంది. 4జీబీ ర్యామ్ 64జీబీ మెమరీ సామర్థ్యం ఉన్న రెడ్మి నోట్ 5 ప్రొ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్, 64జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.16,999. షావోమి ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టిన ఫోన్లన్నంటిలో ఇదే ఖరీదైనది. ఇది నలుపు, గోల్డ్, లేక్ బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఫోన్ ఆర్డర్ చేసుకున్న వారికి జియో ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. రూ.2,200 విలువ కలిగిన 44 వోచర్లను ‘మై జియో’ యాప్‌లో యాడ్ చేస్తుంది. అంతేకాకుండా రూ.198, రూ.299 రీఛార్జ్‌తో 4.5టీబీ వరకూ డేటాను పొందవచ్చు. రెడ్మి నోట్ 5 ప్రొ ఫీచర్స్ 5.99 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ వెనుక 12 మెగా పిక్సెల్, 5మెగాపిక్సెల్స్‌తో డ్యుయల్ కెమెరా ముందు వైపు 20 మెగాపిక్సెల్ కెమెరా 4000 ఎంఎహెచ్ బ్యాటరీ -
పవర్‌పుల్ స్మార్ట్‌ఫోన్ పవర్3: ఫీచర్స్ అదుర్స్
ఇటీవల మార్కెట్లో విడుదలైన పవర్‌పుల్ స్మార్ట్‌ఫోన్ పవర్ 3 ఇపుడు ప్రీ ఆర్డర్స్‌కు అందుబాటులో ఉంది. తన పవర్ సిరీస్‌లో భాగంగా యూలే ఫోన్ లాంచ్ చేసిన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ 'పవర్ 3' సుమారు రూ.19,210 (220 డాలర్లు) ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతున్నది. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ వేరియంట్లో జనవరి 8 వరకు ఈ ప్రీ ఆర్డర్ కు లభ్యం. దీంతో పాటు ఒక గిఫ్ట్ బ్యాగ్ (సుమారు రూ.3వేలు) కూడా అందిస్తోంది. వన్ ప్లస్ 5 టీ తరహాలో ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్‌ను జోడించింది. 6జీబీ, భారీ బ్యాటరీ, మొత్తం నాలుగు కెమెరాలు ఈ డివైస్‌లో ప్రత్యేకఆకర్షణగా నిలువస్తున్నాయి. 6జీబీ, భారీ బ్యాటరీ, మొత్తం నాలుగు కెమెరాలు ఈ డివైస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. యూలే ఫోన్ పవర్ 3 ఫీచర్లు... 6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2.5డి కర్వ్డ్ గ్లాస్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో) 6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 16+5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 13+5 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు 6080 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ -
భారత్‌కు వచ్చేస్తోన్న ఆపిల్ ఐఫోన్ ఎక్స్
టెక్ దిగ్గజం ఆపిల్ తీసుకొచ్చిన బిగ్గెస్ట్ లాంచ్ భారత్‌కు వచ్చేస్తోంది. నేటి నుంచి ఐఫోన్ ఎక్స్ ప్రీ-ఆర్డర్లు భారత్‌లో ప్రారంభం కానున్నాయి. భారత్‌తో పాటు 55 దేశాల్లో ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్లను కంపెనీ ప్రారంభిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు ఈ ఫోన్‌ను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఈ డివైజ్‌ను ఆఫర్ చేస్తుండగా.. ఆఫ్‌లైన్‌గా ఆపిల్ అధికారిక రిటైలర్ వద్ద కంపెనీ ప్రీ-ఆర్డర్లను చేపడుతోంది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఈ డివైజ్‌ను తన వెబ్సైట్లో లిస్టు చేసింది. కమింగ్ సూన్ అనే సంకేతంతో దీన్ని తన వెబ్సైట్లో పొందుపరిచింది. మధ్యాహ్నం 12:31 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు దీని ప్రీ-ఆర్డర్లను చేపడుతున్నాయి. ఐఫోన్ ఎక్స్ ధర భారత్‌లో రూ.89వేల నుంచి ప్రారంభమవుతోంది. దివాళి సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ఐఫోన్ ఎక్స్‌తో పాటు లాంచ్‌చేసిన ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్‌ల విక్రయాలని కంపెనీ గత నెలలోనే చేపట్టింది. అయితే ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్‌లకు అంత డిమాండ్ లేదని, ఐఫోన్ ఎక్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు ఆపిల్ నుంచి విడుదలైన అత్యంత ఖరీదైన డివైజ్ ఐఫోన్ ఎక్సే. దీని అతిపెద్ద వేరియంట్ ఖరీదు లక్షకు పైనే ఉంది. -
గెలాక్సీ ఎస్7ను మించిపోయిన ఎస్8
సియోల్ : సియోల్ : ఐఫోన్ కిల్లర్ గా తాజాగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్ విడుదల చేసిన గెలాక్సీ ఎస్8 స్మార్ట్ ఫోన్ ప్రీఆర్డర్స్ లో అదరగొడుతుందట. తన ముందస్తు స్మార్ట్ ఫోన్ ఎస్7 కంటే మించిపోయిన ప్రీ-ఆర్డర్లను రికార్డు చేసినట్టు శాంసంగ్ మొబైల్ బిజినెస్ చీఫ్ కోహ్ డాంగ్-జిన్ వెల్లడించారు. దక్షిణకొరియా, అమెరికా, కెనడాలో ఈ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ విక్రయాలను ఏప్రిల్ 21 నుంచి కంపెనీ చేపట్టబోతుంది. నోట్ 7 దెబ్బకు అతలాకుతలమైన శాంసంగ్, ఎలాగైనా మార్కెట్లో నిలదొక్కుకుని, ఆపిల్ కు చెక్ పెట్టాలని ఈ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజానికి తొలి ఏడాది విక్రయ రికార్డును ఈ ఫోన్ ఇస్తుందని కొంతమంది ఇన్వెస్టర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్లను ప్రారంభించామని, అంచనావేసిన దానికంటే మెరుగ్గా దీని ప్రీ-ఆర్డర్లు రికార్డవుతున్నట్టు కోహ్ చెప్పారు. ఎలాంటి బ్యాటరీ పేలుళ్ల ఘటనలు సంభవించకుండా.. ఎంతో సురక్షితమైన ఫోన్ గా దీన్ని ప్రవేశపెట్టామన్నారు. ఏప్రిల్-జూన్ క్వార్టర్ కంపెనీకి బెస్ట్ ఎవర్ క్వార్టర్లీ ప్రాఫిట్ గా నమోదవుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. స్ట్రాంగ్ ఎస్8 అమ్మకాలు, మెమరీ చిప్ మార్కెట్ బూమ్ కంపెనీకి మంచి వద్ధి రికార్డు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.