గెలాక్సీ ఎస్7ను మించిపోయిన ఎస్8
గెలాక్సీ ఎస్7ను మించిపోయిన ఎస్8
Published Thu, Apr 13 2017 10:38 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM
సియోల్ : సియోల్ : ఐఫోన్ కిల్లర్ గా తాజాగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్ విడుదల చేసిన గెలాక్సీ ఎస్8 స్మార్ట్ ఫోన్ ప్రీఆర్డర్స్ లో అదరగొడుతుందట. తన ముందస్తు స్మార్ట్ ఫోన్ ఎస్7 కంటే మించిపోయిన ప్రీ-ఆర్డర్లను రికార్డు చేసినట్టు శాంసంగ్ మొబైల్ బిజినెస్ చీఫ్ కోహ్ డాంగ్-జిన్ వెల్లడించారు. దక్షిణకొరియా, అమెరికా, కెనడాలో ఈ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ విక్రయాలను ఏప్రిల్ 21 నుంచి కంపెనీ చేపట్టబోతుంది. నోట్ 7 దెబ్బకు అతలాకుతలమైన శాంసంగ్, ఎలాగైనా మార్కెట్లో నిలదొక్కుకుని, ఆపిల్ కు చెక్ పెట్టాలని ఈ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజానికి తొలి ఏడాది విక్రయ రికార్డును ఈ ఫోన్ ఇస్తుందని కొంతమంది ఇన్వెస్టర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్లను ప్రారంభించామని, అంచనావేసిన దానికంటే మెరుగ్గా దీని ప్రీ-ఆర్డర్లు రికార్డవుతున్నట్టు కోహ్ చెప్పారు. ఎలాంటి బ్యాటరీ పేలుళ్ల ఘటనలు సంభవించకుండా.. ఎంతో సురక్షితమైన ఫోన్ గా దీన్ని ప్రవేశపెట్టామన్నారు. ఏప్రిల్-జూన్ క్వార్టర్ కంపెనీకి బెస్ట్ ఎవర్ క్వార్టర్లీ ప్రాఫిట్ గా నమోదవుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. స్ట్రాంగ్ ఎస్8 అమ్మకాలు, మెమరీ చిప్ మార్కెట్ బూమ్ కంపెనీకి మంచి వద్ధి రికార్డు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Advertisement