రూ.46వేల స్మార్ట్‌ఫోన్‌ రూ.8990కే.. | Get the Samsung Galaxy S7 for as low as Rs 8,990! | Sakshi
Sakshi News home page

రూ.46వేల స్మార్ట్‌ఫోన్‌ రూ.8990కే..

Published Wed, Jan 3 2018 10:36 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

 Get the Samsung Galaxy S7 for as low as Rs 8,990! - Sakshi

న్యూఢిల్లీ : ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ నేటి నుంచి మొబైల్‌ బొనాంజ సేల్‌కు తెరతీసింది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్‌ చేస్తోంది. రూ.46వేలుగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌పై 19,010 రూపాయల డిస్కౌంట్‌ అందిస్తోంది. అంతేకాక పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్‌పై రూ.18వేల తగ్గింపును కూడా ప్రకటించింది. దీంతో మొత్తంగా శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7 స్మార్ట్‌ఫోన్‌ రూ.8990కే అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్ ఆనెక్స్‌, గోల్డ్‌ ప్లాటినం, సిల్వర్‌ టైటానియం రంగుల్లో లభ్యమవుతుంది. ఫీచర్ల పరంగా చూసుకుంటే  ఈ స్మార్ట్‌ఫోన్‌ 5.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎక్సీనోస్‌ 8890 ప్రాసెసర్‌తో ఇది రూపొందింది. 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌, 200జీబీ వరకు విస్తరణ మెమరీ, 12 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఫీచర్లను ఇది కలిగి ఉంది. 
 

ఫ్లిప్‌కార్ట్‌ నేటి నుంచి 5వ తారీఖు వరకు నిర్వహించనున్న సేల్‌లో పలు స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తుంది. 

రెడ్‌మి నోట్‌(4జీబీ)
అసలు ధర రూ.12,999
అందుబాటు ధర రూ.10వేలు

షావోమి ఎంఐ ఏ1(4జీబీ/64జీబీ)
అసలు ధర రూ.14,999
అందుబాటులోని ధర రూ.12,999

ఆపిల్‌ ఐఫోన్‌ 8
పరిమిత స్టాక్స్‌
అందుబాటులో ఉండే ధర రూ.54,999

మోటో జీ5 ప్లస్‌(4జీబీ)
రూ.16,999
అందుబాటు ధర రూ.9999

గూగుల్‌ పిక్సెల్‌ 2/2 ఎక్స్‌ఎల్‌
అసలు ధర రూ.61వేలు
అందుబాటులోని ధర రూ.39,999

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement