![introductory offer Samsung Galaxy F54 5G phone goes on sale check Details - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/20/Samsung%20Galaxy%20F54%205G.jpg.webp?itok=e9YL8ZSG)
శాంసంగ్‌కు చెందిన టాప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్54 5 జీపై భారీ తగ్గింపు లభిస్తోంది. గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లోఇటీవల లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇపుడు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. మెటోర్ బ్లూ ,స్టార్‌డస్ట్ సిల్వర్ రెండు రంగులలో లభిస్తుంది. ఐదు సంవత్సరాల వరకు భద్రతా అప్‌డేట్స్, అలాగే తాజా ఫీచర్‌లు, మెరుగైన భద్రత ఉంటుందని కంపెనీ భరోసా ఇస్తోంది.
గెలాక్సీ ఎఫ్54 5జీ స్పెసిఫికేషన్స్
6.7అంగుళాల sAMOLED+ డిస్‌ప్లే
Android 13 ఆపరేటింగ్ సిస్టమ్
8జీబీర్యామ్ , 256 జీబీ స్టోరేజ్
ఐకానిక్ గెలాక్సీ సిగ్నేచర్ డిజైన్
108 ఎంపీ నో షేక్ కెమెరా, 8+2 ఎంపీ లెన్స్
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
6000mAh బ్యాటరీ, 25W సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్
ఆఫర్
ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్,ఇతర ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ. 3,000 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. అన్ని ఆఫర్లతో సహా, గెలాక్సీ ఎఫ్54 5జీ ధర రూ. 27,999లకే కొనుగోలు చేయవచ్చు. జూన్ 20వరకే ఈ ఆఫర్‌అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment