Apple Watch Series 3 with LTE Support will be available in Jio, Reliance and Airtel stores - Sakshi
Sakshi News home page

ఆపిల్‌ వాచెస్‌: జియో ఆఫర్లు

Published Tue, Apr 24 2018 1:20 PM | Last Updated on Mon, Aug 20 2018 3:07 PM

Apple Watch Series 3 available on Reliance Jio - Sakshi

యాపిల్‌ వాచ్‌ 3 సిరీస్‌

సాక్షి, ముంబై: సంచలన మొబైల్ డేటా  నెట్‌వర్క్‌  రిలయన్స్‌ జియో తన కస్టమర్ల కోసం మరో కొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.    యాపిల్‌ వాచ్‌ సీరిస్‌3లోని సెల్యులార్‌ వాచ్‌లను  జియో కస‍్టమర్లకుఅందుబాటులోకి తీసుకొస్తోంది.  ముఖ్యంగా రిలయన్స్‌ జియో.కాం, జియో స్టోర్స్‌లలో, రిలయన్స్‌ డిజిటల్స్‌ ద్వారా మే11 నుంచి విక‍్రయానికి ఇవి లభ్యం కానున్నాయి. అలాగే  మే4వ తేదీనుంచి ప్రీ ఆర్డర్‌ చేసుకును అవకాశాన్నికూడా కల్పిస్తున్నట్టు జియో తెలిపింది.  దీంతో ఆపిల్‌ వాచ్‌ 3 సిరీస్‌లను విక్రయిస్తున్న తొలి 4జీ ఆపరేటర్‌గా అవతరించింది.  ఈ మేరకు జియో మంగళవారం ఒక ప్రకటన విడుదల  చేసింది.

ప్రీ బుకింగ్‌ ఆఫర్లు: యాపిల్ వాచ్ సిరీస్ 3 జియో ఎవ్రీవేర్‌ కనెక్ట్‌ సర్వీస్‌తో అందిస్తోంది. దీంతో  జియో  నెంబర్‌ను  ఐఫోన్,  యాపిల్ వాచ్ సిరీస్ 3 సెల్యులర్ రెండింటిలోనూ  ఉపయోగించు కోవచ్చు. అంటే  నెంబర్‌ పోర్టబులిటీ ఉచితం అన్నమాట. ఇందుకు ఐ ఫోన్‌లో యాపిల్‌ వాచ్‌  ఐకాన్‌ ఓపెన్‌ చేసి, జియో నెంబర్‌తో అనుసంధానం చేసుకోవాలి.  అయితే వినియోగదారులు తమకు ఐఫోన్ 6ఎస్‌, లేదా కొత్త  మోడల్‌ ఐఫోన్‌  ఆపరేటింగ్‌ సిస్టం 11.3 లేదా ఆ తరువాతదని  నిర్ధారించుకోవాలి. అలాగే ఈ సిరీస్‌ను అందుకునే తొలి  కస్టమర్‌ కావచ్చు. అంతేకాదు హోమ్‌ డెలివరీ అవకాశం కూడా ఉందని జియో వెల్లడించింది.

టారిఫ్‌: ఈ సుప్రీం సేవలకు రిలయన్స్ జియో ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయదు.  జియోలో వాడుతున్న అన్ని ప్లాన్లను ఇందులో కూడా పొందవచ్చు.  ప్రీపెయిడ్‌,  పోస్ట్‌పెయిడ్‌  చందాదారులకు ఈ ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.

యాపిల్ వాచ్ సిరీస్ 3 (ఎల్‌టీఈ+జీపీఎస్‌)ఫీచర్లు: మూడవ తరం ఆపిల్ వాచెస్‌  ద్వారా మ్యూజిక్‌ వినవచ్చు..సెల్యులార్ కనెక్టివిటీతో ఫోన్ లేకుండానే ఫోన్ కాల్స్‌ చేసుకోవచ్చు.  ఇందులో డ్యూయల్ కోర్ ప్రాసెసర్, వాటర్‌ రెసిస్టెంట్‌,  కొత్తబారో మెట్రిక్‌ అల్టీమీటర్‌, బిల్ట్‌ ఇన్‌స్పీకర్‌(సిరి) లాంటి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement