ఐఫోన్ ఎక్స్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : ఆపిల్ తన ఐఫోన్ 10వ వార్షికోత్సవంగా తీసుకొచ్చిన స్పెషల్ ఎడిషన్ ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే సరియైన సమయమట. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్లను ఆపిల్ ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు హోల్డర్స్ అందరికీ ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. దీంతో పాటు ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేసిన ఆరు నెలల అనంతరం ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను ఇది కల్పిస్తోంది. వీటితో పాటు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చి కొత్త ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ కనీసం 20 వేల రూపాయల బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.20వేల కంటే ఎక్కువగా బైబ్యాక్ పొందే కస్టమర్లకు అదనంగా మరో 7వేల రూపాయల డిస్కౌంట్‌ను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, గూగుల్ పిక్సెల్, శాంసంగ్ గెలాక్సీ ఎస్8, శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ వంటి స్మార్ట్‌ఫోన్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
అయితే ఈ ఫోన్లు మామూలు స్థాయిలోనే వాడుతూ ఉండాలి. ఎలాంటి ఫిజికల్ డ్యామేజ్ ఉండకూడదు. అన్ని యాక్ససరీస్‌ను కలిగి ఉండాలి. పైన పేర్కొన్న ఆఫర్లు ఆపిల్ ప్రీమియం రీసెల్లర్స్, ఇతర ఎంపిక చేసిన స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. కాగ, గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 8, 8 ప్లస్‌లతో పాటు ఐఫోన్ ఎక్స్‌ను ఆపిల్ లాంచ్ చేసిన సంగతి తెలిసింది. అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా ఇది మార్కెట్‌లోకి వచ్చింది. ఐఫోన్ ఎక్స్ ప్రారంభ ధర 83,499 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఓఎస్ 11తో రన్ అవుతుంది. కంపెనీ సొంత ఏ11 బయోనిక్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఓలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయిన తొలి ఐఫోన్ ఇదే కావడం విశేషం. 5.8 అంగుళాల డిస్‌ప్లే, 2436 x 1125 పిక్సెల్ రెజుల్యూషన్, ఫేస్‌ఐడీ ఫీచర్, 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 7 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్, వీడియో కాలింగ్, 64జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లను ఇది కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment