కాలిఫోర్నియా : టెక్ దిగ్గజం ఆపిల్ రికార్డు సృష్టించింది. గతేడాది చివరి మూడు నెలల కాలంలో 20 బిలియన్ డాలర్ల లాభాలు వచ్చాయని, అంచనావేసిన దానికంటే అధికంగా కొత్త స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్ విక్రయాలను నమోదుచేసినట్టు తెలిసింది. రెవెన్యూలు సైతం 13 శాతం పెరిగి 88.3 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ఆపిల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద క్వార్టర్ అని, తామే ఆశ్చర్యపోయినట్టు ఆపిల్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు. కొత్త ఐఫోన్ లైనప్‌లో ఎక్కువ మొత్తంలో రెవెన్యూ ఆర్జించినట్టు పేర్కొన్నారు. తమ అంచనాలకు మించి ఐఫోన్ ఎక్స్ దూసుకుపోయిందని, నవంబర్ నెలలో తాము సరుకు రవాణా ప్రారంభించినప్పటి నుంచి ప్రతి వారం టాప్ సెల్లింగ్ ఐఫోన్‌గా ఇదే నిలిచినట్టు ఆపిల్ పేర్కొంది.
10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఐకానిక్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. అత్యంత ఖరీదైన ఈ ఐఫోన్‌కు బలహీనమైన డిమాండ్ ఉందని వార్తలు వచ్చినప్పటికీ.. రెవెన్యూలను ఈ ఫోన్ బాగానే సొంతం చేసుకుంది. ఈ క్వార్టర్‌లో మొత్తంగా ఐఫోన్ విక్రయాలు 77.3 మిలియన్లుగా ఉన్నాయని రిపోర్టు చేసింది. ఇటీవల వచ్చిన ఆదాయాలు అన్ని ప్రాంతాల నుంచి వచ్చాయని.. సవాళ్లను ఎదుర్కొంటున్న ''గ్రేటర్ చైనా'' నుంచి కూడా తాము భారీగా ఆదాయలు ఆర్జించినట్టు కంపెనీ తెలిపింది. ఆపిల్ టీవీ, ఆపిల్ వాచ్‌ల నుంచి కంపెనీ రెవెన్యూలు 36 శాతం పెరిగి 5.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment