
ఐఫోన్ అక్కడ చాలా చీప్ గురూ..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలో ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొత్త వెర్షన్ విడుదలైందంటే చాలు దక్కించుకోవడానికి రోజుల తరబడి మొబైల షోరూంల ముందు కాపుకాచుకొని ఉంటారు. మరికొంత మంది ఐఫోన్ అభిమానులు శరీర భాగాలను అమ్మకానికి ఉంచుతారు. గతంలో ఐఫోన్‌ల కోసం కిడ్నీలను అమ్ముకున్న వ్యక్తుల గురించి తెలుసు. ఐఫోన్ అంటే మార్కెట్‌లో అంత పిచ్చి. ఇప్పుడు దానికోసం కిడ్నీలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐఫోన్ ఇప్పుడు చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. భారత్‌లో ఐఫోన్ ఎక్స్ ధర లక్ష పైమాటే. కానీ దుబాయి, హాంకాంగ్‌లలో సుమారు రూ. 71వేలకే వస్తుంది.
ఐఫోన్ కొనడానికి మీ బడ్జెట్ సుమారు రూ.90వేలు అనుకుంటే దుబాయి ఒక్కరోజు ప్రయాణపు చార్జీలు రౌండ్‌ట్రిప్ కలుపుకుంటే రూ.14 వేలకు మించదు. దుబాయిలో ఐఫోన్ ఖరీదు సుమారు రూ.71 వేలు. మొత్తం కలిపితే రూ. 85వేలు. 2 స్టార్ హోటల్లో ఒక్కరోజు రాత్రి గడపడానికి అయ్యే ఖర్చు రూ.2,800 మిగిలినవి ఇతర ఖర్చులు పెట్టుకోవచ్చు. అంతే కాదు ఇతర దేశం తిరగినట్టు ఉంటుంది. మన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో షార్ట్ వెకేషన్‌కు వెళ్లినట్లు ఫోటోలు పెట్టుకోవచ్చు.
అదే ఇండియాలో అయితే ఐఫోన్‌కు పెట్టే ఖర్చుతో రూ.15వేలు విలువ చేసే ఫోన్‌లు 6, లేదా జియోఫోన్‌లు 60 తీసుకోవచ్చు.